Home
How to

మీ ల్యాప్‌టాప్ సెక్యూరిటీ కోసం ముఖ్యమైన టిప్స్

ప్రయాణ సమయాల్లో మీ వెంట క్యారీ చేసే ల్యాప్‌టాప్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన టిప్స్.

By Sivanjaneyulu Bommu

వేలకు వేలు పోసి కొనుగోలు చేసే స్మార్ట్ గాడ్జెట్స్ పట్ల ప్రయాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రయాణ సమయాల్లో మీ వెంట క్యారీ చేసే ల్యాప్‌టాప్‌లను సురక్షితంగా ఉంచుకునేందుకు పలు ముఖ్యమైన టిప్స్.

సాధారణ బ్యాక్‌ప్యాక్లలో వద్దు..

సాధారణ బ్యాక్‌ప్యాక్లలో వద్దు..

చాలా మంది ప్రయాణ సమయాల్లో తమ ల్యాప్‌టాప్‌లను సాధారణ బ్యాక్‌ప్యాక్ ఇంకా పుస్తకాల బ్యాగ్‌లలో మోసుకువెళుతుంటారు. ఈ విధానం ఏమాత్రం సురిక్షితం కాదు. ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బ్యాగ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంపిక చేసుకోవటం ద్వారా ప్రయాణంలో మీ ల్యాపీ ఒత్తిడికి గురికాకుండా ఉంటుంది.

పవర్‌ను పూర్తిగా ఆఫ్‌చేసి ఉంచటం మంచిది

పవర్‌ను పూర్తిగా ఆఫ్‌చేసి ఉంచటం మంచిది

ప్రయాణ సమయాల్లో ల్యాప్‌‌టాప్ పవర్‌ను పూర్తిగా ఆఫ్‌చేసి ఉంచటం మంచిది. జర్నీ సమయంలో ల్యాపీని ఎక్కువ సేపు వినియోగంచటం కారణంగా కుదుపుకు గురయ్యే అవకాశముంది. దీంతో ల్యాపీలోని కాంపోనెంట్లు దెబ్బ తింటాయి. ప్రయాణ సమయంలో ల్యాపీని చల్లటి వాతావరణంలో ఉంచటం మంచింది.

మరింత అప్రమత్తత అవసరం..

మరింత అప్రమత్తత అవసరం..

ప్రయాణ సందర్భాల్లో మీ ల్యాప్‌టాప్‌కు అదనపు సెక్యూరిటీ అవసరం. ఇటీవల కాలంలో రైళ్లు, బుస్సులలో ల్యాప్‌టాప్ దొంగతనాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి, ప్రయాణం సమయంలో ల్యాప్‌టాప్ రక్షణ పట్ల మరింత అప్రమత్తత అవసరం.

పబ్లిక్ ప్రాంతాల్లో వై-ఫై..

పబ్లిక్ ప్రాంతాల్లో వై-ఫై..

పబ్లిక్ ప్రాంతాల్లో వై-ఫై నెట్‌వర్క్‌లను ఉపయోగించే ముందు కాస్తంత ఆలోచించండి. మీ ల్యాపీలోకి వైరస్‌లను ప్రవేశపెట్టి డేటాను దొంగిలించేందుకు హ్యాకర్లకు ఇదో మంచి మార్గం. ఇటువంటి సమస్యలను ఎదుర్కొవాలంటే మీ ల్యాప్‌టాప్‌లో సురక్షితమైన యాంటీ స్పైవేర్ వ్యవస్థను అప్ టూ డేట్‌గా లోడై ఉండాలి.

ఆ వివరాలు నోట్ చేసి పెట్టుకోండి..

ఆ వివరాలు నోట్ చేసి పెట్టుకోండి..

మీ ల్యాప్‌టాప్ మోడల్, సీరియల్ నెంబర్, సర్వీస్ నెంబర్, స్పెసిఫికేషన్స్ వంటి అంశాలను లిఖిత పూర్వకంగా రాసి ఉంచుకోవటం మంచింది. అనుకోని పరిస్థితులలో ల్యాపీ చోరికి గురైనట్లయితే ఈ సమాచారంతో వెతికిపట్టుకునే అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
How to Protect Your Laptop when Traveling. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X