మీ ఆఫీస్ కంప్యూటర్ నందు మీ గోప్యతని రక్షించుకునే మార్గం ఉందా ?

|

ఒక్కోసారి ఆఫీసు పనులు చేస్తున్న సమయంలోనే ఎన్నో పర్సనల్ పనులకు సమయం కేటాయించవలసి వస్తుంది. ఉదాహరణకు మీరు ఆఫీస్ డెస్క్ ముందు ఉన్నప్పుడు మీ పిల్లల స్కూల్ టీచర్ నుండి మెయిల్ రావడం,లేదా బాంక్ అధికారులు మీకు మెయిల్ చెయ్యడం వంటి విషయాలకి తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాని అత్యధిక కంపెనీలు భద్రతా పరమైన సమస్యల దృష్ట్యా ఆఫీస్ వేళల యందు పర్సనల్ పనులను కంప్యూటర్ ద్వారా చేయుటకు అంగీకరించవు. మీ కంప్యూటర్ కి ఇంటర్నెట్ అనుసంధానింపబడి ఉంటే, అది కేవలం ఆఫీస్ ప్రయోజనాలకే వాడాలి, మీ పర్సనల్ పనులకి కాదు అని వారి నియమంగా ఉంటుంది. తద్వారా ఉద్యోగి చర్యలను మానిటరింగ్ కూడా చేస్తుంటారు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఉద్యోగం నుండి తొలగించుటయే కాకుండా చాలా తీవ్రమైన చర్యలను సైతం తీసుకుంటున్నాయి కంపెనీలు.ఇలాంటి సందర్భాలలో మీ గోప్యతకు రక్షణ ఎలా?

 

చిక్కుల్లో ఎయిర్‌టెల్, ట్రాయ్ నుంచి భారీ షాక్ !చిక్కుల్లో ఎయిర్‌టెల్, ట్రాయ్ నుంచి భారీ షాక్ !

ముందుగా ఇంటర్నెట్ మాన్యువల్ చదవండి.

ముందుగా ఇంటర్నెట్ మాన్యువల్ చదవండి.

చాలామంది చేయని పని ఇదే. ఉద్యోగంలో చేరిన వెంటనే ఇంటర్నెట్ వాడకం నియమనిబంధనలు చేతికి ఇస్తారు. వీటిని క్షుణ్ణంగా చదవవలసి ఉంటుంది. ఆయా కంపెనీల అవసరాలను బట్టి నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఆఫీస్ సమయాల యందు పోర్న్ వెబ్సైట్స్ చూస్తూ సమయం వృధా చేస్తున్నారన్న భావనతోనే ఈ నియమాలు చేయడం మొదలుపెట్టాయి. చట్ట వ్యతిరేక పనులకు, పోర్నోగ్రఫీ ,మత కుల విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలలో పాల్గొనకూడదు అని ఆ నిబంధనలోని సారాంశం. తద్వారా మీ ఆఫీస్ కంప్యూటర్ మానిటర్ చేయబడుతూ ఉంటుంది. కావున గోప్యత అనే పదానికే ఆస్కారం లేదిక్కడ.

మీ ప్రైవసీ అన్నిటికన్నా ముఖ్యం

మీ ప్రైవసీ అన్నిటికన్నా ముఖ్యం

మీ ప్రైవసీ మీకు ముఖ్యం అని భావిస్తే మీరు మొట్టమొదట చేయవలసిన పని మీ పర్సనల్ పనులకు ఆఫీస్ కంప్యూటర్ వాడకపోవడమే . కాని ఇది అన్నివేళలా సాద్యం కాదు . ఇలా వాడకపోవడం వలన వర్క్ మెయిల్ - హోం మెయిల్ రెండింటిని సమన్వయపరచడం అనేది అసాధ్యం అవుతుంది. దీనికి ప్రత్యామ్న్యాయ మార్గం మీ స్మార్ట్ ఫోన్ ద్వారా మీ హోం మెయిల్ ని ఉపయోగించడమే. కాని మీ కంపెనీ యొక్క ఉచిత wifi పాలసీని అర్ధం చేసుకొనవలసి ఉంటుంది. ఆ నియమాలను దాటి చేసే వినియోగం మీ జాబ్ పోవడానికి కూడా కారణం కావొచ్చు. మీ కంపెనీ wifi వాడని పక్షంలో మీరు సరైన ఇంటర్నెట్ ప్లాన్ ను ఎన్నుకోవలసి ఉంటుంది.

మీ సొంత మాధ్యమమే మీకు రక్ష
 

మీ సొంత మాధ్యమమే మీకు రక్ష

కొన్ని కంపెనీలలో యాజమాన్యాలు మరింత కఠినతరంగా వ్యవహరిస్తుంటాయి. ఉద్యోగిని మానిటర్ చేయుటకు కీ లాగర్స్ వాడడం, స్క్రీన్ షాట్స్ తీయడం, కీలక పదాలను ట్రాకింగ్ చేసే సాఫ్ట్వేర్లను వాడడం, వెబ్ కాం వీడియో ఫీడ్ లను వినియోగించడం ద్వారా ఉద్యోగి తలకూడా పక్కకు తిప్పలేని విధంగా పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగి స్థానాన్ని బట్టి రక్షణలు, అదనపు హక్కులు కూడా ఉంటాయి. సాధారణంగా US లో ఇంటర్నెట్ ద్వారా పంపే వ్యక్తిగత మెయిల్స్ ని, ప్రైవేట్ చాట్స్ ని అడ్డుకోవడం చట్టవిరుద్ధం. ఈ పనికి పూనుకున్న వారు యజమాని అయినా శిక్షార్హులే. కాని ఈ రక్షణ పరిమితంగానే ఉంటుంది. కారణం, ఉద్యోగి చేసే ప్రతి ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన ఒక కాపీ యజమాని సర్వర్లో సేవ్ చేయబడి ఉంటుంది. కావున మీ కంప్యూటర్ యజమాని పర్యవేక్షణలో ఉన్నట్లయితే, మీరు మీ సొంత మాధ్యమాన్ని వినియోగించుకోవడం అన్నిటికన్నా శ్రేయస్కరం అని సలహా ఇస్తున్నాము.

మీ భద్రతా మీ చేతుల్లో

మీ భద్రతా మీ చేతుల్లో

మీ వ్యక్తిగత సమాచారాన్ని, లేదా డాక్యుమెంట్లను మీ ఆఫీస్ కంప్యూటర్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకండి. భద్రతా ప్రమాణాల దృష్ట్యా చాలా కంపెనీలలో USB సపోర్ట్ ని నిలిపివేయడం కూడా చేస్తున్నాయి. ఒకవేళ మీకు డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అయితే ఎక్స్టర్నల్ డ్రైవ్ లోనికి తీసుకోవడం ఉత్తమం. 

ఒకవేళ మీకు USB సపోర్ట్ కలిగి ఉంటే

ఒకవేళ మీకు USB సపోర్ట్ కలిగి ఉంటే

ఒకవేళ మీకు USB సపోర్ట్ కలిగి ఉంటే , మీ డేటాని ఎప్పటికప్పుడు పెన్ డ్రైవ్ లోకి తీసుకోవడం ఉత్తమం. అలా USB access ఉన్న యెడల మరో అడుగు ముందుకు వేసి మీ పెన్ డ్రైవ్ లో క్రోం, ఫైర్ ఫాక్స్, లేదా ఓపెరా పోర్టబుల్ బ్రౌజర్లను ఉంచుకుని, మీ ఆఫీస్ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయకుండానే బ్రౌసర్ వాడుకునే వెసులుబాటు ఉంది. దీనిలో incogito మోడ్ ద్వారా మీ పర్సనల్ డేటా సేవ్ కానివ్వకుండా చర్యలు తీసుకుంటుంది. 

మీ డేటా భద్రతా కోసం

మీ డేటా భద్రతా కోసం

మీ డేటా భద్రతా కోసం యజమానులు మీపై మానిటరింగ్ చేయకుండా ఓపెరా బ్రౌజర్ మరొక అడుగు ముందుకు వేసి VPN సర్వీస్ కూడా తన పోర్టబుల్ వర్షన్లో పొందుపరచడం జరిగింది . దీనివలన ఇంటర్నెట్ వినియోగించినా యజమాని దృష్టికి వెళ్ళకుండా నిరోధించవచ్చు. vpn ఒరిజినల్ IP అడ్రెస్ కి స్పూఫ్ IP అడ్రెస్స్ తో కవర్ చేస్తుంది. తద్వారా మానిటర్ చేయడం కష్టతరం అవుతుంది.

Best Mobiles in India

English summary
How to protect your privacy on your work computer more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X