COVID బూస్టర్ షాట్ స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం ఎలా?

|

COVID-19 మహమ్మారి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఊహించని విపత్తును అధిగమించడానికి ప్రజలు కష్టపడుతుండగా సైబర్ నేరగాళ్లు మాత్రం ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. కరోనా యొక్క కొత్త ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల కోవిడ్ కేసుల పెరుగుదలతో భారతదేశంలో 60 ఏళ్లకు పైబడిన పౌరులకు ముందు జాగ్రత్తగా టీకాలను అందించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేసుల తగ్గుదలే ప్రధాన దేయంగా ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో అక్రమార్కులు కొత్త ఆలోచనలతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజా కోవిడ్ బూస్టర్ షాట్ స్కామ్‌లో భాగంగా ఆరోగ్య అధికారులని తెలుపుతూ మోసగాళ్లు ప్రజలను మోసగించి వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను తీసుకోవడానికి ప్రయత్నిస్తు వారిని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దుండగులు ప్రజలను ఎలా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారో వంటి వివరాలు తెలుసుకోవడానికి చదవండి.

 

COVID బూస్టర్ షాట్ స్కామ్

COVID బూస్టర్ షాట్ స్కామ్

సైబర్ మోసగాళ్లు ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి ఆరోగ్య అధికారులుగా ముసుగు వేసుకొని ప్రజలకు కాల్ చేస్తారు. ఎక్కువగా వృద్ధులు ముందు జాగ్రత్తగా COVID బూస్టర్‌ను అందించారు. ప్రస్తుతానికి సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే కేటాయించబడుతుంది. మోసగాళ్లు ఒక వ్యక్తి చిరునామా, ఫోన్ నంబర్ మొదలైనవాటితో పాటు రెండవ డోస్ తీసుకున్నారా లేదా అని అడుగుతారు. యూజర్లను ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని సందర్భాల్లో మోసాలను తెలియకుండా ఉండడానికి కాలర్ ఇప్పటికే టీకా తేదీతో సహా అవసరమైన వివరాలను కలిగి ఉన్నారు.

బూస్టర్ డోస్

మొత్తం సమాచారాన్ని పొందిన తర్వాత మోసగాళ్లు బూస్టర్ డోస్ పొందడానికి ఎవరైనా ఆసక్తి కలిగి ఉన్నారా మరియు దానికి స్లాట్ కావాలా అని అడగడానికి రెండవ కాల్ చేస్తారు. టీకాలు వేయడానికి తేదీ మరియు సమయం నిర్ధారించబడిన తర్వాత వారు మొబైల్ నంబర్‌కు OTPని పంపుతారు. కొన్ని సందర్భాల్లో బుకింగ్ ప్రక్రియలో సహాయం చేయడానికి స్కామర్‌లు AnyDesk వంటి నిర్దిష్ట యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని కూడా అడగవచ్చు. OTP అనేది 'ఫిషింగ్ స్కామ్'కి కీలకం తప్ప మరొకటి కాదు. బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుండి నగదు బదిలీని ధృవీకరించే చివరి మార్గం OTP. మీరు వారికి OTPని అందించిన తర్వాత మీ బ్యాంక్ ఖాతా నుండి మొత్తం డబ్బు లావాదేవీ చేయబడుతుంది.

వ్యాక్సిన్ స్లాట్
 

ఒక నివేదిక ప్రకారం వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ కోసం వృద్ధులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI లేదా మొబైల్ యాప్‌లు ఎలా పని చేస్తాయనే ఆలోచన లేని గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ కొత్త స్కామ్ ఎక్కువగా జరుగుతోంది. సులువుగా నగదు బదిలీ కోసం OTPని పొందడానికి స్కామర్‌లు వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి స్కామ్‌ల నుండి మిమ్మలిని మీరు రక్షించుకోవడానికి కింద తెలిపే సూచనలను పాటించండి.

COVID స్కామ్‌ల నుండి తనను తాను రక్షించుకునే విధానం

COVID స్కామ్‌ల నుండి తనను తాను రక్షించుకునే విధానం

** COVID స్లాట్ బుకింగ్ కోసం వచ్చే కాల్‌లు అన్ని కూడా ఫేక్/స్పామ్ కావున మీరు అప్రమత్తంగా ఉంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ మోసాన్ని నివారించవచ్చు. ఇందులో గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫోన్ కాల్‌ల ద్వారా వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం అందించలేదు అని గుర్తుంచుకోవాలి.

** వ్యాక్సిన్ స్లాట్‌ను బుక్ చేసుకునే ఏకైక మార్గం కౌవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్‌కి వెళ్లడం మాత్రమే. అయితే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేయలేక పోయినప్పటికీ మీరు ఏదైనా వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా వ్యాక్సిన్ ను పొందవచ్చు మరియు వ్యాక్సిన్ కోసం మీరే నమోదు చేసుకోవచ్చు.

** OTPని స్వీకరించిన తరువాత ఆ మెసేజ్ ను జాగ్రత్తగా చదవాలని సూచించబడింది. రెండవది ఇది స్పామ్ కాల్ కాదా అని హైలైట్ చేసే కాల్ బ్లాకర్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Protect Yourself From COVID Booster Shot Scams?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X