వాట్సాప్ సందేశాలను పంపినవారికి తెలీకుండా చదవడం ఎలా?

Posted By: ChaitanyaKumar ARK

వాట్సాప్ తన ప్రతి వర్షన్ లోనూ కొత్త కొత్త ఫీచర్లతో అల ఆధార్ కార్డ్ అడ్రస్ ఛేంజ్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్‌తో  రిస్తూ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంది. అలా ప్రవేశపెట్టబడిన ఫీచర్లలో ముఖ్యమైనది read receipt (బ్లూ టిక్స్) ఫీచర్. ఈ ఫీచర్ వలన, పంపిన మెసేజ్ అవతలి వారు చదివారో లేదో తెలుసుకోవడం సులభతరం అయింది. ఒకప్పుడు కొన్ని e-మెయిల్ సర్వీసులు ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టినా , కొన్ని సెక్యూరిటీ పరమైన కారణాలవలన ఆ ఫీచర్ ని తొలగించవలసి వచ్చింది. కాని వాట్సాప్ లో ఈ ఫీచర్ అధిక ప్రాచుర్యాన్ని పొందింది. వాట్సాప్ లో మెసేజ్ పంపిన తర్వాత మూడు స్టేజులు ఉంటాయి. మెసేజ్ పంపినప్పుడు ఒక టిక్, గ్రహీతకు చేరినప్పుడు డబుల్ టిక్స్ , గ్రహీత చదివినప్పుడు బ్లూ కలర్ టిక్స్ గా మారుతుంది. దీన్నే read receipt ఫీచర్ అంటారు. ఈ ఫీచర్ ని సెట్టింగ్స్ లో కొన్ని అమర్పుల ద్వారా డిసేబుల్ కూడా చెయ్యవచ్చు. కాని డిసేబుల్ చేసిన తర్వాత అవతలి వారికి పంపిన మెసేజెస్ read receipts కూడా మనకు కనపడవు. ఈ ఫీచర్ ని తొలగించడం వలన ఇరుపక్కలా read receipt ఆగిపోతుంది కావున, దీనిని టర్న్ ఆఫ్ చేయలేము. కనీ సెట్టింగ్స్ లో ఎటువంటి మార్పులూ చేయకుండా నే read receipt కనపడకుండా చేయవచ్చు. 

ఆధార్ కార్డ్ అడ్రస్ ఛేంజ్ చేయాలా? ఈ సింపుల్ టిప్స్‌తో మీరే సరిచేసుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొదటి పద్దతి:

1)మీకు వాట్సాప్ మెసేజ్ వచ్చిన వెంటనే, నోటిఫికేషన్ బార్ ని స్క్రోల్ డౌన్ చేసి airoplane mode సెట్ చెయ్యండి.

2)సర్వీసులన్నీ ఆగిపోయాక, మీకు వచ్చిన మెసేజ్ చదవండి.

3)చదివిన తర్వాత, వాట్సాప్ అప్లికేషన్ క్లోజ్ చేయండి. ఎట్టి పరిస్తితుల్లో baakground మల్టీ టాస్కింగ్ సెక్షన్ లో లేకుండా చూడండి.

4)అప్లికేషన్ ను మూసివేసి , మల్టి టాస్కింగ్ లో లేదని నిర్దారించుకున్నాక , airoplane mode ఆఫ్ చేయండి.

 

 

బాక్ బటన్ క్లిక్ చేశాక..

ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉంటుంది. కేవలం బాక్ బటన్ క్లిక్ చేసినంత మాత్రాన అప్లికేషన్ మూసివేయబడదు. బాక్ బటన్ క్లిక్ చేశాక , మల్టి window బటన్ క్లిక్ చేసి, అందులోనుండి కూడా అప్లికేషన్ తొలగించవలసి ఉంటుంది. తద్వారా మీరు ఆన్లైన్ వచ్చాక, మీ యాక్టివిటీ sync కాకుండా ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ మల్టి టాస్కింగ్ విండోలో ఉన్నట్లయితే, మీరు aeroplane మోడ్ ఆఫ్ చేసి , ఆన్లైన్ వచ్చాక , మీ యాక్టివిటీ synk చేయబడి, మెసేజ్ పంపిన వారికి read receipt (బ్లూ టిక్స్) చూపబడుతాయి.

చాట్ బాక్స్ ఓపెన్ చేయకపోయినా..

పై విధానం అన్నివేళలా పని చేయక పోవచ్చు. తర్వాతి కాలంలో ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నప్పుడు ఏ క్షణాన మీరు అప్లికేషన్ ఓపెన్ చేసినా, చాట్ బాక్స్ ఓపెన్ చేయకపోయినా కూడా రీడ్ రిసీప్ట్స్ కనిపించడం జరుగుతుంది. కావున ఇది తాత్కాలికంగా రీడ్ రిసీప్ట్స్ కనపడకుండా చేయగలదు అని మాత్రం చెప్పగలం.

రెండవ పద్దతి:

రీడ్ రిసీప్ట్స్ కనపడకుండా చేయడానికి ప్లే స్టోర్ లో unseen - no last read అనే అప్లికేషన్ ఉచితంగా లభ్యమవుతుంది. ఈ లింక్ ద్వారా ఈ అప్లికేషన్ ను పొందవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.tda.unseen&rdid=com.tda.unseen

ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ పద్దతులను ఫాలో అవ్వండి

1)ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత , అప్లికేషన్ కి నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది.

2)తర్వాత అప్లికేషన్ సెట్టింగ్స్ లో మీరు ఏ అప్లికేషన్లకు రీడ్ రిసీప్ట్స్ ఆపాలి అనుకుంటున్నారో వాటిని పొందుపరచవలసి ఉంటుంది. ఉదాహరణకు వాట్సాప్ , వైబర్, మెసెంజర్

3)ఇప్పుడు వాట్సాప్ లో ఏ మెసేజ్ వచ్చినా ఈ unseen అప్లికేషన్ sync చేసి మీకు చూపిస్తుంది.

 

మరలా వాట్సాప్ ఓపెన్ చేస్తే..

ఈ అప్లికేషన్ వాడడం వలన , మరలా వాట్సాప్ ఓపెన్ చేస్తే రీడ్ రిసీప్ట్స్ కనిపిస్తాయి అన్న ఆలోచనే ఉండదు. మీరు అది పనిగా చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే తప్ప. ఆడ్స్ రిమూవ్ చేసుకోవాలి అనుకున్నవారికి పెయిడ్ వర్షన్ అందుబాటులో ఉంది. కాని ఫ్రీ వెర్షన్ లో కూడా అన్నీ ఫీచర్లు ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to read WhatsApp messages without the sender knowing More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot