PhonePe ఉపయోగించి FASTag అకౌంటును రీఛార్జ్ చేయడం ఎలా??
ఇండియాలో ఉంటూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ చక్రాలు గల వాహనం ఉండి ఏదైనా ఒక ప్రాంతంలోని ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తుంటే కనుక టోల్ గేట్ దాటడం కోసం ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. వివిధ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ ను రీఛార్జ్ చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఫోన్‌పే ఆన్‌లైన్ పేమెంట్ కూడా ఫాస్ట్‌ట్యాగ్ ను రీఛార్జ్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ఇప్పటి వరకు దేశంలోని మిలియన్ల మంది వినియోగదారుల కోసం FASTag రీఛార్జ్‌లను ప్రాసెస్ చేసినట్లు పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిటీ యూనియన్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, ఇండస్ల్యాండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బిఎల్ మరియు స్టేట్ బ్యాంక్‌తో సహా అన్ని ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంకులకు రీఛార్జ్ చేయడం కోసం ఫోన్‌పే మద్దతు ఇస్తుంది.

ఫోన్‌పేను ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ అకౌంటును రీఛార్జ్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా ఫోన్‌పే యాప్‌ని ఓపెన్ చేసి ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేసే బ్యాంక్‌ని ఎంచుకుని, మీ ఫాస్ట్‌ట్యాగ్ ను రీఛార్జ్ చేయడానికి మీ యొక్క వాహన నెంబర్ ను నమోదు చేయండి. PhonePe ఉపయోగించి మీ FASTag ను ఎలా రీఛార్జ్ చేయాలో వంటి వివరాలు తెలుసుకోవడానికి కింద గల దశల వారీ మార్గదర్శిని తనిఖీ చేయండి.
PhonePe ద్వారా FASTag రీఛార్జ్ చేయడం ఎలా
స్టెప్ 1: ఫోన్‌పే యాప్‌ని ఓపెన్ చేయండి. మీకు యాప్ లేకపోతే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా iPhone లో Google Play స్టోర్ లేదా Apple యాప్ స్టోర్ ద్వారా ఇన్‌స్టాల్ చేయండి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో రీఛార్జ్ & పే బిల్లుల విభాగంలో చాలా ఎంపికలు ఉంటాయి. వాటి మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3: రీఛార్జ్ విభాగం కింద FASTag రీఛార్జ్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఫోన్‌పే యాప్‌లో మీ ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే బ్యాంక్ కోసం చూడండి.
స్టెప్ 5: మీ బ్యాంక్ పేరుపై క్లిక్ చేసి, ఆపై మీ వెహికల్ రిజిస్టర్ నెంబర్ ను నమోదు చేయండి.
స్టెప్ 6: కన్ఫర్మ్ బటన్‌పై నొక్కండి. మీరు ఖాతాదారుడి పేరు మరియు ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌తో సహా మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ వివరాలను కనుగొంటారు.
స్టెప్ 7: మీ పేరు మరియు వాహన అకౌంట్ నంబర్‌ను తిరిగి ధృవీకరించండి. మీరు మీ FASTag అకౌంటును రీఛార్జ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి.
స్టెప్ 8: మీరు ఉపయోగించాలనుకుంటున్న బ్యాంక్ అకౌంటును ఎంచుకోండి లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ వివరాలను జోడించండి.
స్టెప్ 9: తరువాత పే బిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 10: విజయవంతంగా రీఛార్జ్ చేయడానికి మీరు UPI PIN నమోదు చేయాలి.
FASTag రీఛార్జ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత లావాదేవీని నిర్ధారించే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు మీ బ్యాంక్ నుండి SMS పంపబడుతుంది.


Click it and Unblock the Notifications