Metro రైల్ స్మార్ట్‌కార్డ్‌కి రీఛార్జ్ చేయడం ఎలా..? అరగంట దాటితే..

హైదరాబాద్ వాసుల కలల ప్రాజెక్ట్ మెట్రో రైలు రావడంతో నగరవాసులు ఇప్పుడు ఆ మెట్రో రైలు మత్తులో జోగుతున్నారు.

By Hazarath
|

హైదరాబాద్ వాసుల కలల ప్రాజెక్ట్ మెట్రో రైలు రావడంతో నగరవాసులు ఇప్పుడు ఆ మెట్రో రైలు మత్తులో జోగుతున్నారు. తొలి ప్రయాణం కోసం ఉవ్విళ్లూరుతున్నారు. టికెట్ల కోసం ఎగబడుతున్నారు. స్టేషన్‌కు చేరుకున్న వెంటనే మొత్తం కలియదిరుగుతూ మెట్రో అందాలను వీక్షిస్తున్నారు. మెట్రో కార్డు చేతిలో ఉండటంతో పుల్లు ఖుషీగా ఉన్నారు. అయితే అందులో డబ్బులు అయిపోతే రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చాలామందికి సందేహం రావచ్చు. దానికి ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.

 

షియోమి Desh ka Smartphone, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్షియోమి Desh ka Smartphone, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి..

గూగుల్ ప్లే స్టోర్ నుంచి..

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి Hyderabad Metro Rail Smart Card application డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ యూజర్లు కొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.

గో ఆన్ లైన్ రీ చార్జ్

గో ఆన్ లైన్ రీ చార్జ్

అప్లికేషన్ ఇన్‌స్టాల్ అయిన తరువాత అక్కడ గో ఆన్ లైన్ రీ చార్జ్ ఆఫ్సన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.

8 Digit Number

8 Digit Number

క్లిక్ చేయగానే అక్కడ మీకు 8 Digit Number అని అడుగుతుంది. మీ మెట్రో కార్డు వెనుక వైపు ఉన్న నంబర్స్ ని అక్కడ ఎంటర్ చేయాలి.

డెబిట్ /క్రెడిట్ కార్డు వివరాలు
 

డెబిట్ /క్రెడిట్ కార్డు వివరాలు

ఆ తరువాత అమౌంట్ ఎంటర్ చేసి మీ డెబిట్ /క్రెడిట్ కార్డు వివరాలు ఎంటర్ చేస్తే మీ కార్డుకి సంబంధించిన పర్సనల్ వివరాలు Name, Address, Email Id, Phone Number, Aadhaar Card వంటివి అడుగుతుంది.

రీఛార్జ్ విజయవంతం..

రీఛార్జ్ విజయవంతం..

ఇవి ఎంటర్ చేసిన తరువాత మీ Hyderabad Metro Rail Smart Card వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి అయితే మీ రీఛార్జ్ విజయవంతంగా పూర్తి అయినట్లు మెసేజ్ వస్తుంది.

మెట్రో స్టేషన్లో ఎక్కువ సమయం గడిపితే

మెట్రో స్టేషన్లో ఎక్కువ సమయం గడిపితే

కార్డు ఉంది కదా అని మెట్రో స్టేషన్లో ఎక్కువ సమయం గడిపితే మీ కార్డులోని డబ్బులు స్వాహ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

పెయిడ్ ఏరియా నుంచి అరగంట లోపే..

పెయిడ్ ఏరియా నుంచి అరగంట లోపే..

ప్రయాణం కోసం స్టేషన్‌లోకి ప్రవేశించాక పెయిడ్ ఏరియా నుంచి అరగంట లోపే బయటకు రాకుంటే మీ కార్డు నుంచి డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది.

రూ.200 చెల్లిస్తే

రూ.200 చెల్లిస్తే

స్మార్ట్‌కార్డు కోసం రూ.200 చెల్లిస్తే అందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే స్టేషన్‌లోకి ప్రవేశించాక రైలు ఎక్కకుండా అన్ని ప్రాంతాలు అలా చూసొద్దామని ఓ గంటసేపు అక్కడే తిరిగితే స్మార్ట్‌కార్డులోని సొమ్ము కరిగిపోతుంది.

స్టేషన్‌లో ఉన్నంత సేపు ..

స్టేషన్‌లో ఉన్నంత సేపు ..

ఓ ప్రయాణికుడికి ఇలా జరిగిందని సమాచారం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సో స్టేషన్‌లో ఉన్నంత సేపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనవి.

రూ. 10 నుంచి 60 మధ్యలో

రూ. 10 నుంచి 60 మధ్యలో

మెట్రో రైలు ధరలు రూ. 10 నుంచి 60 మధ్యలో కిలో మీటర్ పరిధిని బట్టి నిర్ణయించారు. 

మెట్రో రైలు ఏయే రూట్లలో..

మెట్రో రైలు ఏయే రూట్లలో..

మెట్రో రైలు ఏయే రూట్లలో ప్రయానిస్తుందో తెలిపే మ్యాప్ ఇది. 

Best Mobiles in India

English summary
How To Recharge Hyderabad Metro Rail Smart Card Online Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X