ఫేస్‌బుక్ ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకోవటం ఎలా..?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఉద్దేశించి సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఉద్దేశించి సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఓ సరికొత్త ఫీచర్‌ను మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని ఆండ్రాయిడ్ ఫేస్‌బుక్ యూజర్లు తమ ప్రీ-పెయిడ్ మొబైల్ నెంబర్‌లను రీఛార్జ్ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతానికి ప్రీపెయిడ్ రీఛార్జులను మాత్రమే ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తోంది. త్వరలోనే ఐఫోన్ యూజర్లకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఫేస్‌‌‌బుక్ తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఫేస్‌బుక్ యాప్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లు ఈ రీఛార్జ్ సదుపాయాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

 

మీరు వాడుతోన్న సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి Serial Keyలను తెలుసుకోవటం ఎలా..?మీరు వాడుతోన్న సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి Serial Keyలను తెలుసుకోవటం ఎలా..?

 'Mobile Recharge' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది..

'Mobile Recharge' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది..

ముందుగా మీ ఫోన్ నుంచి ఫేస్‌బుక్ పేజీలోకి లాగిన్ అయి నోటిఫికేషన్స్ పక్కగా కనిపించే హారిజంటల్ లైన్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీకు 'Mobile Recharge' అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఒకవేళ ఆప్షన్ కనిపించనట్లయితే 'See More' పై టాప్ ఇవ్వండి. ఇప్పడు మీకు ఓ మెసేజ్‌తో కూడిన స్ర్కీన్ ఒకటి కనిపిస్తుంది. "Choose a plan and pay with your debit or credit card, its fast, secure and free." అని ఆ మెసేజ్‌లో రాసి ఉంటుంది.

 

 

'Recharge Now' బటన్ పై క్లిక్ చేసి..

'Recharge Now' బటన్ పై క్లిక్ చేసి..

ఇప్పుడు 'Recharge Now' అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మొబైల్ రీఛార్జ్ స్ర్కీన్ పై మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఫేస్‌బుక్ ఆటోమెటిక్‌గా మీ ఆపరేటర్‌ను డిటెక్ట్ చేస్తుంది. అలా జరగని పక్షంలో మీరు మాన్యువల్‌గా ఆపరేటర్‌ను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆపరేటర్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత రీఛార్జ్ అమౌంట్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేయటం ద్వారా రీఛార్జ్ విజయవంతం..
 

ఓటీపీ కోడ్‌ను ఎంటర్ చేయటం ద్వారా రీఛార్జ్ విజయవంతం..

ఒకవేళ మీ ప్లాన్ పై మీకు అవగాహన లేకపోయినట్లయితే 'Browse Plans' పై టాప్ చేసి మీకు కావల్సిన ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. ప్లాన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత 'Review Order' పై టాప్ చేసి మీ డెబిట్ లేదా క్రెడిట్ వివరాలను ఎంటర్ చేసి 'Place Order' బటన్ పై క్లిక్ చేసినట్లయితే వన్ టైమ్ పాస్‌వర్డ్ మీ మొబైల్‌కు అందుతుంది. ఈ ఓటీపీ కోడ్‌ను సంబంధిత పేమెంట్ కాలమ్‌లో ఎంటర్ చేసినట్లయితే రీఛార్జ్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తవుతుంది.

దూసుకుపోతోన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్..

దూసుకుపోతోన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్..

వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, టెలీగ్రామ్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్‌‌ స్మార్ట్‌ఫోన్లలో తెగ సందడి చేస్తున్నాయి. కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్స్ ఆధునిక జీవితాల పై పెను ప్రభావం చూపుతున్నాయి. మెసేజింగ్ సౌకర్యంతో ఆవిర్భవించిన ఈ యాప్స్ ... వీడియో కాల్స్, వాయిస్ కాల్స్, GIF సపోర్ట్, ఫోటో ఎడిటింగ్ ఇలా కొత్తకొత్త సదుపాయాలను చేర్చుకుంటూ పోతున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ వీటిలో యాడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

 

 

Best Mobiles in India

English summary
Social networking giant Facebook has quietly rolled out a new feature for its Android users in India. Using this feature, Facebook users can recharge their prepaid mobile numbers of various mobile operators

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X