WhatsApp వాయిస్ కాల్‌లను ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో రికార్డ్ చేయడం ఎలా?

|

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ప్రస్తుతం మెసేజ్ లను పంపడం కోసమే కాకుండా వాయిస్ మరియు వీడియో కాల్ లను చేయడానికి కూడా వినియోగిస్తారు. వాట్సాప్ కాల్‌లు అనేవి సాధారణ సెల్యులార్ కాల్‌ల వలె నేడు చాలా బాగా ప్రాచుర్యం పొందాయి. మీరు వాట్సాప్‌లో ఎవరికైనా తరచూగా మెసేజ్‌లు పంపుతుంటే కనుక మీరు వారికి మెసేజ్ లను పంపడానికి బదులుగా వాయిస్ కాల్‌లకు మారాలనుకున్నప్పుడు కేవలం ఒకే ఒక ట్యాప్ తో అనుమతిస్తుంది.

 

వాట్సాప్

డయలర్ యాప్‌లకు నావిగేట్ చేయడం మరియు వారికి కాల్ చేయగలిగేలా కాంటాక్ట్ కోసం శోధించడం కంటే ఇది సులభమైన మార్గంగా ఉంటుంది. అయితే సాధారణ సెల్యులార్ కాల్‌ల వలె సులభంగా కాల్‌లను రికార్డ్ చేయడానికి వాట్సాప్ మిమ్మల్ని అనుమతించదు. సాధారణ కాల్‌లను రికార్డ్ చేయడానికి మీకు కొన్ని ఎంపికలు ఉన్నప్పటికీ వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేయడానికి కొంచెం కష్టపడవలసిన అవసరం ఉంటుంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేసే విధానం

ఆండ్రాయిడ్‌లో వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేసే విధానం

మీరు ఉపయోగిస్తున్నది ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కనుక వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేయడం అనేది చాలా సులభం. క్యూబ్ ACR అనే కాల్ రికార్డర్ యాప్ వాట్సాప్ లో వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయడానికి మరియు ఫైల్‌లను మీ ఫోన్ లో సేవ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కానీ వాట్సాప్ కాల్స్ రికార్డింగ్ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పనిచేయదు. ఈ యాప్ యొక్క మద్దతు పేజీ యొక్క అనుకూల ఫోన్‌ల జాబితాలో మీ ఫోన్ ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత కింద ఉన్న దశలను అనుసరించండి.

Cube ACR
 

** గూగుల్ ప్లే స్టోర్ లో Cube ACR కోసం సెర్చ్ చేయండి. అలాగే దానిని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

** యాప్‌ని ఓపెన్ చేసి బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌గా ఉంచండి.

** తరువాత వాట్సాప్ ఓపెన్ చేసి ఎంచుకున్న కాంటాక్ట్ కి వాయిస్ కాల్ చేయండి.

** తరువాత క్యూబ్ ACR యాప్ స్వయంచాలకంగా మీ కాల్‌లను రికార్డ్ చేయడం ప్రారంభిస్తుంది.

** రికార్డింగ్ స్వయంచాలకంగా ప్రారంభం కాకపోతే కనుక మీరు Cube ACR యాప్‌ని ఓపెన్ చేసి "ఫోర్స్ VoiP కాల్ వాయిస్ కాల్" ఎంపికను ఎంచుకోవచ్చు.

** తరువాత మళ్లీ వాట్సాప్ కాల్ చేయండి.

 

ఐఫోన్‌లో వాట్సాప్ వాయిస్ కాల్‌లను రికార్డ్ చేసే విధానం

ఐఫోన్‌లో వాట్సాప్ వాయిస్ కాల్‌లను రికార్డ్ చేసే విధానం

మీరు మీ సాధారణ సెల్యులార్ కాల్‌ని కాల్‌ని రికార్డ్ చేయడానికి ఐఫోన్‌లో స్థానికంగా మద్దతు లేదు కావున రికార్డ్ చేయలేరు. వాట్సాప్ కాల్‌ను మాత్రమే కాకుండా సాధారణ కాల్‌లను రికార్డ్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే కొన్ని యాప్‌లు ఉన్నాయి. కానీ యాప్ పనితీరుపై కఠినమైన పరిమితుల కారణంగా అవి సమర్థవంతంగా పని చేయలేవు. కానీ అలా చేయడానికి ఇంకా ఒక మార్గం ఉంది. వాట్సాప్ వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

Mac

** ముందుగా కేబుల్‌ని ఉపయోగించి మీ ఐఫోన్‌ను మీ మ్యాక్‌కి కనెక్ట్ చేయండి. తరువాత మీ ఐఫోన్‌లో కనిపించే "ట్రస్ట్ థిస్ కంప్యూటర్‌" ఎంపికపై నొక్కండి.

** మీ Macలో స్పాట్‌లైట్‌ని ప్రారంభించడానికి CMD + Spacebar మీద నొక్కండి. తరువాత QuickTime Player ఎంపిక కోసం సెర్చ్ చేయండి.

** ఫైల్ ఎంపికకు నావిగేట్ చేయండి మరియు "కొత్త ఆడియో రికార్డింగ్" ఎంపికను ఎంచుకోండి.

** ఐఫోన్‌ను ఎంపికగా ఎంచుకుని యాప్‌లోని రికార్డ్ బటన్‌ను క్లిక్ చేయండి.

** ఇప్పుడు మీ ఐఫోన్‌ని ఉపయోగించి మీరు ఫోన్ చేయాలనుకునే కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ వాయిస్ కాల్ చేయండి.

** మీరు మాట్లాడడం పూర్తి చేసిన తర్వాత కాల్‌ని డిస్‌కనెక్ట్ చేసి QuickTimeలో స్టాప్ రికార్డింగ్ బటన్‌ను నొక్కండి.

** మీరు ఆడియో ఫైల్‌ను మీ Macలో సేవ్ చేయవచ్చు.

 

హెచ్చరిక

హెచ్చరిక

కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా మీరు మీ వాట్సాప్ వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయవచ్చు. అయితే మీరు ముందుకు కొనసాగడానికి ఒక హెచ్చరిక. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా కాల్‌లను రికార్డ్ చేయడం అనేది సిఫారసు చేయబడలేదు. కొన్ని దేశాల్లో ఇది చట్టవిరుద్ధం కాబట్టి రికార్డింగ్‌లో పాల్గొన్న వ్యక్తికి తెలియజేయకుండా లేదా అనుమతి తీసుకోకుండా కాల్‌లను రికార్డ్ చేయడం మానుకోవాలని మీకు మా యొక్క సలహా.

Best Mobiles in India

English summary
How to Record WhatsApp Voice Calls on Android and iPhone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X