Google Photosలో డెలిట్ చేసిన ఫోటోలను తిరిగి పొందడం ఎలా?
స్మార్ట్ ఫోన్‌లను వాడుతున్న వారు ఎక్కువగా ఫోటోలను లేదా వీడియోలను తీయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటి వారి కోసం తమ మెమొరీలను ఆన్‌లైన్ ద్వారా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా లభించే ఫోటో బ్యాకప్ సేవల్లో గూగుల్ ఫోటోస్ కూడా ఒకటి.

మీరు ఎప్పుడైనా గూగుల్ ఫోటోల నుండి అనుకోకుండా ఏదైనా ఫోటోలను తొలగించినట్లయితే దాన్ని తిరిగి పొందడానికి ఒక మార్గం ఉంది. క్రింద వివరించిన దశలను అనుసరించడం ద్వారా మీరు తొలగించిన ఫోటోలను గూగుల్ ఫోటోలలో సులభంగా తిరిగి పొందవచ్చు. ఫోన్‌లో మరియు వెబ్‌లో స్టోర్ చేసిన ఫోటోలను యాక్సెస్ చేయడానికి గూగుల్ ఫోటోస్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

మీరు అనుకోని కొన్ని ఫైళ్ళను అనుకోకుండా కొన్నిటిని తొలగిస్తే తరువాత మీరు వాటిని తిరిగి పొందాలనుకుంటున్నపుడు తిరిగి పొందవచ్చు. మీరు గూగుల్ ఫోటోస్ నుండి ఫైళ్లను తొలగించిన 60 రోజుల తర్వాత తిరిగి పొందాలనుకుంటే మాత్రం కొంచెం కష్టం. మొబైల్ ద్వారా గూగుల్ ఫోటోస్ నుండి తొలగించిన ఫోటోలను మీరు ఎలా తిరిగి పొందవచ్చో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లోని గూగుల్ ఫోటోస్ నుండి తొలగించిన ఫోటోలను తిరిగి పొందే దశలు
*** మీ Android స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ లను ఓపెన్ చేసి ఎడమవైపు ఎగువున గల హాంబర్గర్ చిహ్నాన్ని నొక్కండి. తరువాత అందులో గల ట్రాష్ ఎంపికను ఎంచుకోండి.
*** మీరు రిస్టోర్ చేయాలనుకుంటున్న ఫోటోల మీద ఎక్కువసేపు నొక్కడం ద్వారా వాటిని ఎంచుకోవచ్చు.
*** పూర్తయిన తర్వాత రిస్టోర్ మీద నొక్కండి.
*** మీరు ఫోటోలను తిరిగి పొందినప్పుడు మీ ఫోటోలు ఆటోమ్యాటిక్ గా ఫోటో లైబ్రరీలో సేవ్ చేయబడతాయి.


Click it and Unblock the Notifications








