Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌లో డిలీట్‌ చేసిన పోస్టులు, స్టోరీస్‌ను ఎలా రికవరీ చేయాలి..?

మెటాకు (Meta) చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ ను (Instagram) ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ప్రముఖ ఫోటో షేరింగ్‌ ప్లాట్‌ఫాంగా గుర్తింపు పొందింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవలే అనేక ఫీచర్లను తీసుకొచ్చింది. స్థానిక భాషల్లో రీల్స్‌ ను ట్రాన్స్‌లేషన్‌ చేసుకొనే ఫీచర్‌ ను కూడా ఇటీవలే విడుదల చేసింది. అయితే యూజర్ల ప్రైవసీ, సౌకర్యం కోసం ఇన్‌స్టాలో ప్రస్తుతం అనేక ఫీచర్లు ఉన్నాయి.

యూజర్లను మరింత ఆకట్టుకొనేందుకు, మెరుగైన భద్రత కల్పించేందుకు వీలుగా ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టా యూజర్లకు అందుబాటులో ఉన్న ఓ ఫీచర్‌ యూజర్లను ఆకట్టుకొనే అవకాశం ఉంది.

How to recover deleted posts and stories in instagram

డిలీట్‌ చేసిన పోస్టులను రికవరీ చేయవచ్చు :
ఇన్‌స్టాగ్రామ్‌ లో అనేక ఫోటోలు, వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాం. దీంతోపాటు రీల్స్‌ ను కూడా షేర్‌ చేస్తుంటాం. కొన్ని సార్లు తెలిసో లేదా తెలియకో పోస్టులను డిలీట్‌ చేస్తుంటాం. ఈ ఫీచర్‌ ద్వారా అలాంటి పోస్ట్‌లు, స్టోరీలను రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌ లో డిలీట్ చేసిన పోస్టులను ఎలా రికవరీ చేయాలి?
ఇన్‌స్టాగ్రామ్‌ లో డిలీట్‌ చేసిన పోస్ట్‌ లేదా స్టోరీస్‌ ను రికవరీ చేయవచ్చు. అయితే డిలీట్‌ చేసిన 30 రోజుల్లో మాత్రమే ఇందుకు అవకాశం ఉంటుంది. అనంతరం ఆయా పోస్ట్‌లు, స్టోరీస్‌ శాశ్వతంగా తొలగిపోతాయి.

స్టెప్‌ 1 : ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసి, యాక్టివిటీ (Activity) పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం Recently Deleted సెక్షన్‌ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : మీరు ఇటీవల కాలంలో డిలీట్ చేసి పోస్ట్‌లు, స్టోరీస్‌ అక్కడ కనిపిస్తాయి.
స్టెప్‌ 4 : మీరు రికవరీ చేయాలని భావిస్తున్న పోస్ట్‌ లేదా స్టోరీ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 5 : ఆ తర్వాత అక్కడ కనిపించే Three Dot Menu పైన క్లిక్ చేసి, Restore ను ఎంపిక చేసుకోవాలి.
స్టెప్‌ 6 : రికవరీ అయిన పోస్ట్‌లు మీ ప్రొఫైల్‌ లో తిరిగి కనిపిస్తాయి. అదే స్టోరీస్‌ అయితే 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తెలిసి లేదా పొరపాటున డిలీట్‌ అయిన పోస్ట్‌లు, స్టోరీస్‌ ను తిరిగి పొందేందుకు ఈ ఫీచర్‌ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే డిలీట్‌ చేసిన 30 రోజుల వరకు మాత్రమే రికవరీ చేసేందుకు అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అనంతరం శాశ్వతంగా తొలగిపోతాయి.

గతంలో కంటెంట్‌ తో సంబంధం లేకుండా అనేక మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు తమ ఫోటోలు, వీడియోలు, రీల్స్‌కు ఇష్టం వచ్చిన రీతిలో హ్యాష్‌ట్యాగ్‌ లు వినియోగించేవారు. అలాంటి వాటికి చెక్‌ పెడుతూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ లపై పనిమితి విధించింది. రీల్స్‌, పోస్ట్‌ కు గరిష్ఠంగా ఐదింటికే అనుమతిచ్చింది. గతంలో గరిష్ఠంగా 30 వరకు హ్యాష్‌ట్యాగ్‌ లను వినియోగించేందుకు అవకాశం ఉండేది.

More from GizBot

Best Mobiles in India

English summary
How to recover deleted posts and stories in instagram here is the stepwise guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X