డిలీట్ అయిన మెసెజ్‌లను తిరిగి పొందటం ఎలా..?
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీలీట్ అయిన ఎస్‌ఎంఎస్‌లను రికవర్ చేసుకునేందుకు అనేక పోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి.
పొరపాటున మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని టెక్స్ట్ మెసేజ్‌లను డిలీట్ చేసేసారా..? కంగారుపడుకండి 99% వరకు వాటిని రికవర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఎందుకంటే డీలట్ కాబడిన డేటాలో కొంత మొత్తం మెమరీ మాత్రమే తిరిగి వ్రాయబడుతుంది. కాబట్టి, మెసేజ్‌లు డిలీట్ అయిన వెంటనే రకవరీకి సిద్ధంకండి...
Read More : కూల్‌ప్యాడ్ ఫోన్ కొంటే జియో సిమ్, మార్చి 31 వరకు ఫ్రీ కాల్స్, ఫ్రీ నెట్

టిప్ 1
ఫోన్‌లో డిలీటైన్ డేటాను రకవరీ చేసేందుకు అనేక సాఫ్ట్‌వేర్స్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో యూజర్ రివ్యూలను బట్టి నమ్మకమైన ప్రోగ్రామ్‌ను ఎంపిక చేసుకోండి.

టిప్ 2
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో డీలీట్ అయిన ఎస్‌ఎంఎస్‌లను రికవర్ చేసుకునేందుకు కూల్‌మాస్టర్ ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్ + కాంటాక్ట్స్ రికవరీ, వండర్ షేర్ ఆండ్రాయిడ్ డేటా రికవరీ వంటి యాప్స్ అందుబాటులో ఉన్నాయి. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కోల్పొయిన ఎస్ఎంఎస్ డేటాను రికవర్ చేసుకునే క్రమంలో వీటిలో ఏదో ఒక ప్రోగ్రామ్‌ను ముందుగా మీ కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేయండి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 3
ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత స్మార్ట్‌ఫోన్‌ను యూఎస్బీ కేబుల్ సహాయంతో పీసీకి కనెక్ట్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్‌లో యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయండి.

టిప్ 4
యూఎస్బీ డీబగ్గింగ్‌ను ఎనేబుల్ చేయటానికిఫోన్ ప్రధాన సెట్టింగ్స్‌లోని డెవలపర్ ఆప్షన్స్‌ను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. డీబగ్గింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ డివైస్ డిటెక్ట్ కాబడుతుంది.

టిప్ 5
ఆ తరువాత రికవరీ ప్రోగ్రామ్‌లోని సూచనలను అనసరిస్తూ మీ ఆండ్రాయిడ్ ఫోన్ మెమరీని స్కాన్‌కు సిద్ధమవుతుంది. స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఫోన్‌లో రికవర్ కాబడిన డేటా, ప్రివ్యూ రూపంలో డెస్క్‌టాప్ పై మీకు కనిపిస్తుంది.

టిప్ 6
వాటిలో మీకు అవసరమైన మెసేజ్ ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని రికవర్ యాక్షన్ పై క్లిక్ చేసినట్లయితే సంబంధిత ఫోల్డర్ మీ పీసిలోకి సేవ్ కాబడుతుంది. ఈ విధంగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పోగొట్టుకున్న ఎస్ఎంఎస్‌లను రికవర్ చేసుకోవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








