మీ పెన్‌డ్రైవ్‌లోని డేటా Corrupt అయ్యిందా..?
డేటాను స్టోర్ చేసే విషయంలో యూఎస్బీ డ్రైవ్ లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వైరస్ ఇంకా మాల్వేర్ల కారణంగా పలు సందర్భాల్లో డేటాతో నిండి ఉండే పెన్‌డ్రైవ్‌లు కరప్ట్ అవుతుంటాయి.
డేటాను స్టోర్ చేసే విషయంలో యూఎస్బీ డ్రైవ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వైరస్ ఇంకా మాల్వేర్ల కారణంగా పలు సందర్భాల్లో డేటాతో నిండి ఉండే పెన్‌డ్రైవ్‌లు కరప్ట్ అవుతుంటాయి. డేటా కరప్ట్ అయిన యూఎస్బీ స్టోరేజ్ డ్రైవ్‌లలో మెమరీ ఉన్నట్లు చూపించదు. ఇటువంటి పరిస్ధితుల్లో కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్ నుంచి డేటాను రికవర్ చేసేందుకు పలు ఉత్తమ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు మీ పోయిన డేటాను తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది. అలాంటి ఉత్తమమైన కొన్ని మార్గాలను మీకందిస్తున్నాం. వీటిపై ఓస్మార్ట్ లుక్కేయండి.

డిస్క్ మేనేజ్‌మెంట్ ఆప్షన్‌లోకి వెళ్లి...
కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్‌ను కంప్యూటర్ గుర్తించలేకపోతున్నట్లయితే కొత్త డ్రైవ్ లెటర్‌ను మీ స్టోరేజ్ మీడియాకు అసైన్ చేయవల్సి ఉంది. ఇలా చేయాలంటే, ముందుగా కరప్ట్ అయిన పెన్‌డ్రైవ్‌ను కంప్యూటర్ యూఎస్బీ స్లాట్ కు స్టిక్ చేయండి. ఇప్పుడు మై కంప్యూటర్‌ను సెలక్ట్ చేసుకుని మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వటం ద్వారా అనేక ఆప్షన్స్ తో కూడిన మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది. వాటిలో Manage ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు computer management ప్యానల్‌లోకి వెళతారు. అక్కడ కూడా అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Disk Management ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

డ్రైవ్ లెటర్‌ను మార్చటం ద్వారా...
Disk Management ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇవ్వటం ద్వారా అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి . వాటిలో Change Drive Letters and Pathsను సెలక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన లెటర్‌ను డ్రైవ్‌కు అసైన్ చేసి Ok బటన్ పై క్లిక్ చేసినట్లయితే డ్రైవ్ లెటర్ మారుపోతుంది. డ్రైవ్ లెటర్ మార్చినప్పటికి ఫలితం లేకపోయినట్లయితే ఈ క్రింద సూచించబోయే పద్ధతిని అనుసరించండి. రప్ట్ అయిన పెన్‌డ్రైవ్‌ను పీసీకి కనెక్ట్ అయిన తరువాత స్టార్ట్ మెనూలోని కంప్యూటర్స్‌లోకి వెళ్లి మీ స్టోరేజ్ డ్రైవ్ ఏ రిమూవబుల్ డిస్క్ క్రింద లిస్ట్ అయ్యిందో చూడండి. ఉదాహరణకు: Removable Disk (M:), Removable Disk (H:). డ్రైవర్ లెటర్‌ను గుర్తుపెట్టుకోండి.

స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..
ముందుగా కంప్యూటర్‌లో కమాండ్ ప్రాంప్ట్‌ను ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవ్వాలంటే. కీబోర్డ్ లోని (win +R) షార్ట్ కట్ ను ప్రెస్ చేసినట్లయితే Run డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ డైలాగ్ బాక్స్ లో cmd అని టైప్ చేసి ok బటన్ పై క్లిక్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్‌లో chkdsk m: /r, అని టైప్ చేయండి. ఇక్కడ ‘m' అక్షరం డ్రైవ్ లెటర్. మీ డ్రైవ్ ఏ లెటర్‌లో ఉంటే లెటర్‌ను ‘m' స్థానంలో రీప్లేస్ చేసి ఎంటర్‌ను ప్రెస్ చేసినట్లయితే మెమరీ కార్డ్‌లోని ఎర్రర్‌లను విండోస్ గుర్తించి వాటిని రిపేర్ చేసే ప్రయత్నం చేస్తుంది.

డేటా రికవరీ సాఫ్ట్ వేర్స్ ద్వారా ప్రయత్నించండి..
కరప్ట్ అయిన డేటాను రికవర్ చేసేందుకు డజన్లు కొలది ఉచిత డేటా రకవరీ సాప్ట్‌వేర్‌లు ఇంటర్నెట్‌లో లభ్యమవుతున్నాయి. మీ యూఎస్బీ డ్రైవ్‌లో పోగొట్టుకున్న డేటా ఫైళ్లను తిరిగి రాబట్టుకునేందుకు మీ వద్ద ఉండాల్సినవి..మీరు పోగొట్టుకున్న డేటాకు సంబంధించిన యూఎస్బీ డ్రైవ్, కంప్యూటర్, ఇంటర్నెట్, డేటా రకవరీ సాఫ్ట్‌వేర్ (మీరు ఎంపిక చేసుకున్న దాన్ని బట్టి).

డేటా రికవరీ సాఫ్ట్‌వేర్స్ ద్వారా ప్రయత్నించండి..
ముందుగా డేటా రికవర్ చేయవల్సిన యూఎస్బీ డ్రైవ్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. మీరు వాడుతున్నది విండోస్ పీసీ అయితే Recuva అనే ఉచిత డేటా రికవరీ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ తరువాత ఇన్‌స్టాల్ చేయండి. సెటప్ కాబడిన రికువా ప్రోగ్రామ్‌ను మౌస్‌తో డబల్ క్లిక్ చేయటం ద్వారా ఓపెన్ చేయండి.


Click it and Unblock the Notifications








