మొబైల్ పగిలిపోయినప్పుడు డేటాను కాపాడుకోవడం ఎలా ?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు చక్కర్లు కొడుతున్నాయి.

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లు వాడకంలో ఒక్కోసారి కొన్ని ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ పొరబాటున పగిలిపోతే గుండె పగిలినంతగా బాధపడి పోతారు. ఇక టచ్‌ పనిచేయకపోతే ఫోన్ నేలకేసి విసిరికొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఇలా ఉంటే స్క్రీన్‌ పగిలిపోయిన ప్పుడు, టచ్‌ పనిచేయనప్పుడు ఫోన్‌ లోని డేటాను ఎలా తీసుకోవాలో చాలా మందికి తెలియదు. ఈ చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే.. స్క్రీన్‌ పగిలినా.. టచ్‌ పనిచేయకపోయినా.. ఫోన్‌లోని డేటాను యాక్సిస్‌ చేయవచ్చు.

iPhone Xని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండిiPhone Xని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోండి

 Android Control Program

Android Control Program

ముందుగా Android Control Program సాఫ్ట్‌వేర్‌ను ఇంటర్నెట్‌ నుంచి మీ కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇప్పుడు మీ ధ్వంసమైన ఫోన్‌ ను కంప్యూటర్‌ కు యూఎస్‌బి కేబుల్‌ ద్వారా కనెక్ట్‌ చేయండి.

కీబోర్డ్‌ సహాయంతో

కీబోర్డ్‌ సహాయంతో

కీబోర్డ్‌ సహాయంతో తద్వారా ఆండ్రాయిడ్‌ కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ మీ ఫోన్‌కు సంబంధించి యాక్సిస్‌ను ఎనేబుల్‌ చేసి మౌస్‌ అలానే కీబోర్డ్‌ ద్వారా ఆపరేట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కీబోర్డ్‌ సహాయంతో ఫోన్‌ను అన్‌లాక్‌ చేసుకుని డేటా మొత్తాన్ని వేరొక డివైస్‌లోకి ట్రాన్స్‌ ఫర్‌ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌ డివైజ్‌ మేనేజర్‌ ద్వారా..

ఆండ్రాయిడ్‌ డివైజ్‌ మేనేజర్‌ ద్వారా..

ముందుగా మీ కంప్యూటర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ డివైజ్‌ మేనేజర్‌ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లండి. ధ్వంసమైన మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌లో గూగుల్‌ అకౌంట్‌ అలానే జిపిఎస్‌ ఫీచర్లు ఎనేబుల్‌ చేసి ఉన్నట్లయితే ఆ అకౌంట్‌లోకి లాగినై స్కాన్‌ చేయండి.

లాక్‌ ఆప్షన్‌

లాక్‌ ఆప్షన్‌

మీ డివైస్‌ కనెక్ట్‌ అయిన వెంటనే ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ పేజీలో Ring, Lock, Erase ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో లాక్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయండి. అప్పటికే, మీ ఫోన్‌ లాక్‌ అయి ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా అన్‌లాక్‌ అవుతుంది. అక్కడ మీరు డేటా రికవరీ చేసుకోవచ్చు.

Vysor అనే క్రోమ్‌

Vysor అనే క్రోమ్‌

Vysor అనే అప్లికేషన్‌ను ఉపయోగించుకుని కంప్యూటర్‌ ద్వారా మీ ఆండ్రాయిడ్‌ డివైస్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా యూఎస్‌బి సహాయంతో మీ ఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్‌ చేసి ఫోన్‌లో ఉన్న డేటాను తీసుకోవచ్చు. ఇలా మీకు అందుబాటులో ఉన్న పద్దతిలో ఫోన్‌ లోని డేటాను తీసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to Recover Lost Data from Broken or Damaged Android Phone more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X