Home
How to

రాంగ్‌ UPI ఐడీకి పేమెంట్‌ చేశారా? ఇలా చేస్తే 48 గంటల్లోనే మీ డబ్బులు రికవరీ చేయవచ్చు..!

భారత్‌ లో డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ భారీగా అందుబాటులోకి వచ్చింది. చిన్న దుకాణాల్లోనూ UPI చెల్లింపుల వ్యవస్థ ఉంది. ఫలితంగా క్యాష్‌ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. షాపింగ్ దగ్గర నుంచి చిరు దుకాణాల్లోనూ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. చిల్లర సమస్యను కూడా చాలా వరకు చెక్‌ పెట్టింది.

అయితే కొన్ని సందర్భాల్లో తప్పుడు UPI ID లకు చెల్లింపులు చేస్తుంటాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నగదును ఎలా రికవరీ చేయాలో చాలా మందికి అవగాహన లేదు. RBI (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాల ఆధారంగా.. UPI ద్వారా తప్పుడు ఖాతాలకు బదిలీ అయిన నగదును 24 గంటల నుంచి 48 గంటల్లో తిరిగి పొందేందుకు అవకాశం ఉంది.

how to get refund money which was sent to wrong UPI ID

మీరు కూడా ఇలా రాంగ్‌ పేమెంట్‌లు చేసినట్లు అయితే వెంటనే సదరు వ్యక్తితో నేరుగా మాట్లాడండి. జరిగిన తప్పును గురించి వివరించి, మీకు రావాల్సిన నగదును వెనక్కి ఇవ్వమని కోరండి. ఏదైనా సందర్భంలో సదరు వ్యక్తి అందుబాటులోకి రాకపోయినా, నగదు వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించకపోయినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇలాంటి సందర్భాల్లో మీ UPI యాప్‌ కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేయాలి. మరియు మీ ట్రాన్సాక్షన్‌ ఐడీ సహా ఇతర వివరాలను వారికి అందించాలి. మరియు వారు అడిగిన పూర్తి వివరాలు సమర్ఫించాలి. అనంతరం నగదు రికవరీ కోసం చర్యలు తీసుకోవాలని కోరాల్సి ఉంటుంది.

యూపీఐ యాప్‌ కస్టమర్‌ కేర్‌ నుంచి మీరు ఆశించిన సమాధానం లేదా ఫలితాలు రాకుంటే.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. అందుకు ట్రాన్సాక్షన్‌ ఐడీ, నగదు వివరాలు సహా ఇతర సమాచారం అందించాల్సి ఉంటుంది. నగదు రికవరీ చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.

మీ బ్యాంక్‌ నుంచి కూడా సాయం పొందవచ్చు. బ్యాంకు సిబ్బంది అడిగిన పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. మీ నుంచి పూర్తి వివరాలు అందిన వెంటనే ఛార్జ్‌బ్యాక్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. ఫలితంగా నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు చివరగా RBI కి కూడా ఫిర్యాదు చేయవచ్చు.

మీరు ఇద్దరికి ఒకే బ్యాంకు అయిన 48 గంటల్లోగా నగదు రికవరీ అయ్యే అవకాశం ఉంది. అదే వేర్వేరు బ్యాంకులు అయితే మాత్రం.. సమస్య పరిష్కారానికి అధిక సమయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే మీ దగ్గరున్న ట్రాన్సాక్షన్‌ వివరాలను బ్యాంకులకు అందించాల్సి ఉంటుంది.

గతంతో పోలిస్తే భారత్‌తో డిజిటల్‌ పేమెంట్‌ల వ్యవస్థ భారీగా పుంజుకుంది. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌లు, డేటా అందుబాటులోకి రావడం సహా అవగాహన పెరగడం కూడా ఇందుకు కారణం. ఈ పద్ధతి వల్ల చిల్లర సమస్యకు చాలా వరకు పరిష్కారం లభించింది. మరియు యూపీఐ యాప్‌ల ఇంటర్‌ఫేస్‌ కూడా సులభంగా ఉండడం వల్ల చాలా మంది సౌకర్యవంతంగా వినియోగించుకోగలుగుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to recover Money sent to wrong UPI ID here is the detailed guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X