స్మార్ట్‌ఫోన్ పాస్‌వర్డ్ మర్చిపోయారా.. గూగుల్ అకౌంట్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు..!!
స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చాలా మంది జీవితాల్లో ఒక భాగమైపోయింది. బ్యాంకింగ్ సహా ఇతర అనేక పనులను స్మార్ట్ ఫోన్ (Smartphone Recovery Tips) ద్వారా పూర్తి చేసేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ మరియు అందులోని ఫోటోలు, వీడియోలు సహా ఇతర డాక్యుమెంట్ల భద్రత కోసం పాస్‌వర్ట్ ను ఉపయోగిస్తాం. అయితే ఏదైనా సందర్భంలో పాస్‌వర్డ్ ను మర్చిపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ సాయం చేస్తుంది.
ఆండ్రాయిడ్ యూజర్ల కు ఈ అవకాశం ఉంది. ఇందుకు స్మార్ట్ ఫోన్ లో లాగిన్ అయిన గూగుల్ అకౌంట్ ఐడీ, పాస్‌వర్డ్ తెలిసి ఉండాలి. దీంతోపాటు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ను కలిగి ఉండాలి. ఈ పద్దతి ద్వారా సులభంగా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు (Smartphone Factory Reset Tips). పూర్తి వివరాలు.

స్టెప్ 1 : ఇతర స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ లో వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి.
స్టెప్ 2 : అనంతరం అడ్రస్ బార్‌లో Android.com/find అని టైప్ చేసి, ఎంటర్ చేయాలి.
స్టెప్ 3 : అనంతరం గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
స్టెప్ 4 : అక్కడ మీరు Reset చేయాలని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 5 : అనంతరం 'ఫ్యాక్టరీ రీసెట్ డివైస్' ఆప్షన్ పైన క్లిక్ చేయాలి,
స్టెప్ 6 : ఆ తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ ప్రాసెస్ ప్రారంభం కానుంది.
స్మార్ట్‌ఫోన్ పాస్‌వర్డ్ ను మర్చిపోయిన సందర్భంలో పైన తెలిపిన విధంగా గూగుల్ అకౌంట్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. అయితే సాధారణంగా స్మార్ట్‌ఫోన్ ను రీసెట్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మీ ఫోన్‌ను ఇతరులకు విక్రయించినప్పుడు లేదా ఇతర కారణాలతో ఫ్యాక్టరీ రీసెట్ చేయాలని భావించినప్పుడు ఈ క్రింది చెప్పినట్లుగా చేయాలి.
స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఎలా ?
స్టెప్ 1 : స్మార్ట్‌ఫోన్ లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయాలి. అనంతరం సిస్టమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 2 : సిస్టమ్ ఆప్షన్ ను క్లిక్ చేసిన అనంతరం కిందకు స్క్రోల్ చేసి రీసెట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 3 : అక్కడ Erase all data లేదా Factory reset ఆప్షన్ ను క్లిక్ చేయాలి.
స్టెప్ 4 : అనంతరం మీ స్మార్ట్ ఫోన్ పిన్ కోడ్ ను ఎంటర్ చేసి, ఫ్యాక్టరీ రీసెట్ కు అనుమతి ఇవ్వాలి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








