Home
How to

ఫోన్‌ను పోగొట్టుకున్నారా.. వెంటనే ఇలా చేస్తే దొరికే అవకాశం ఉంది.. పూర్తి వివరాలు..!

భారత్‌ లో స్మార్ట్‌ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగింది. తక్కువ ధరకు అందుబాటులోకి రావడం సహా ఇతర అవసరాల దృష్ట్యా స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే గతంలో స్మార్ట్‌ఫోన్‌ పోగొట్టుకుంటే, యజమానికి తిరిగి చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. అయితే ప్రస్తుతం పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లలో అత్యధిక శాతం తిరిగి యజమానులకు చేరుతున్నాయి.

* సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌, యాప్‌ :
గతంలో మొబైల్స్‌ను పొగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలా మంది అవగాహన ఉండేది కాదు. కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌, యాప్‌ను (Sanchar Saathi Portal) అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్‌ను సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (C-DOT) అభివృద్ధి చేసింది.

how to recover stolen phone via sanchar saathi portal here is the guide

* ట్రాక్‌ చేసి, రికవరీ చేస్తారు?
ఈ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా పొగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌లను తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. మీరు ఫిర్యాదు చేసిన వెంటనే మీ ఫోన్‌ను ఇతరులు వినియోగించేందుకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేస్తారు. అనంతరం ఆ డివైజ్‌ను ట్రాక్‌ చేస్తారు. రికవరీ చేసి యజమానులకు చేరవేస్తారు.

* పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి ఎలా పొందవచ్చు :
మొబైల్‌ను దొంగిలించబడినట్లు మీకు గుర్తించిన వెంటనే, సిమ్‌ కార్డును బ్లాక్‌ చేయాలి. మీ నెట్‌వర్క్‌ కు సంబంధించిన కస్టమర్‌ కేర్‌ యూనిట్‌కు కాల్‌ చేసి బ్లాక్‌ చేయవచ్చు. అనంతరం అదే నంబర్‌తో మరో సిమ్‌ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

* ఫిర్యాదు చేయాలి :
అనంతరం మీకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసేందుకు ఫోన్‌ IMEI నంబర్‌ సహా ఇతర వివరాలు అందించాల్సి ఉంటుంది. అనంతరం FIR కాపీని వారి నుంచి తీసుకోవాలి. ఈ FIR ను సంచార్‌ సాథీ పోర్టల్‌ లో ఫిర్యాదు చేసే సమయంలో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

* IMEI సహా ఇతర వివరాలు అందించాలి :
అనంతరం సంచార్‌ సాథీ వెబ్‌సైట్‌/ యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ కనిపించే హోం పేజీలో Block Stolen/ Lost Mobile ఆప్షన్‌ పైన క్లి్‌క్‌ చేయాలి. అనంతరం అక్కడ IMEI నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్‌ సాధారణంగా ఫోన్‌ బాక్స్‌ పైన రాసి ఉంటుంది.

IMEI వివరాలు నమోదు చేసిన తర్వాత, మీ వద్ద FIR కాపీ ఉండే అప్‌లోడ్‌ చేయవచ్చు. దీంతోపాటు అడ్రస్‌, పనిచేస్తున్న ఫోన్‌ నంబర్‌ను కూడా నమోదు చేయాలి. ఫిర్యాదు చేశాక, వచ్చిన ID నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. భవిష్యత్‌లో ఈ వివరాలు అవసరం అవుతాయి.

Take a Poll

సంచార్‌ సాథీ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేసిన అనంతరం ఫోన్‌ ను ఇతరులు వినియోగించకుండా బ్లాక్‌ చేయాలని టెలికాం నెట్‌వర్క్‌లకు సంబంధిత అధికారులు సూచిస్తారు. దీంతోపాటు మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు, సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లకు పంపుతారు.

మీ ఫోన్‌లో ఇతరులు ఎవరైనా సిమ్ కార్డు వేసి, ఉపయోగించేందుకు ప్రయత్నం చేస్తే, ఆ సమాచారం అధికారులకు చేరుతుంది. ఈ వివరాలు అందిన అనంతరం మీ ఫోన్‌ లొకేషన్‌ను ట్రాక్‌ చేయడం ప్రారంభిస్తారు. అనంతరం మీ ఫోన్ రికవరీ చేసి, ధ్రువీకరణ పూర్తిచేసి మీకు అందిస్తారు.

Best Mobiles in India

English summary
how to recover stolen phone via sanchar saathi portal here is the guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X