తప్పుడు వ్యక్తులకు UPI ద్వారా నగదు బదిలీ చేశారా... అయితే వెంటనే ఏం చేయాలో తెలుసా?
భారత్‌లో డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. UPI వ్యవస్థ.. ఆర్థిక లావాదేవీల్లో గణనీయ మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా నగదు బదిలీ సులభతం అయింది. బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్ ద్వారా లావాదేవీలను నిర్వహిస్తున్నాం. అయితే పొరపాటున ఇతరులకు UPI ద్వారా నగదు బదిలీ చేస్తే.. ఆ నగదును తిరిగి తమ బ్యాంకు ఖాతాలకు ఎలా తీసుకురావాలో (Wrong UPI Transaction) తెలియక అనేక మంది ఆందోళన చెందుతున్నారు. అయితే ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.
వెంటనే అప్రమత్తం కావాలి :
అయితే UPI ద్వారా నగదు తప్పుడు ఖాతాలకు బదిలీ అయినప్పుడు.. వెంటనే అప్రమత్తం కావాల్సి ఉంటుంది. లేకుంటే మీరు శాశ్వతంగా ఆ నగదును కోల్పోవాల్సి రావచ్చు. బ్యాంకింగ్ ప్రతినిధులు సహా మీరు ఎవరికైతే నగదు బదిలీ చేశారో వారిని నేరుగా సంప్రదించడం కూడా ఒక మార్గం.

నేరుగా సంప్రదించడం లేదా బ్యాంకింగ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేయడం :
UPI ద్వారా తప్పుడు వ్యక్తికి నగదు బదిలీ చేస్తే... ఆ విషయాన్ని మీరు గుర్తించిన వెంటనే ఆందోళన చెందకుండా ఆ వ్యక్తితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఆ పొరపాటు జరిగిందో వారికి వివరించాలి. మీ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయమని కోరాలి. అందుకు అవసరం అయిన బ్యాంకింగ్ వివరాలు అందించాలి.
వ్యక్తి సరిగ్గా స్పందించకుంటే :
మీరు పొరపాటున నగదు బదిలీ చేసిన వ్యక్తి సరిగ్గా స్పందించకుంటే వెంటనే UPI యాప్ కస్టమర్ కేర్ ప్రతినిధులతో మాట్లాడాలి. మీ సమస్యను వారికి తెలియజేయాలి. మరియు అందుకు సంబంధించిన వివరాలను అందించాలి. కస్టమర్ కేర్ ప్రతినిధులు రిఫండ్ విధానానికి సంబంధించిన వివరాలను అందిస్తారు.
అప్పటికీ మీ సమస్యకు పరిష్కారం లభించకుంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. NPCI ఫిర్యాదుల పరిష్కార వేదికను కలిగి ఉంటుంది. వారి వెబ్‌సైట్ నుంచి నేరుగా ఫిర్యాదులు చేయవచ్చు. ఈ దశలో కూడా మీ నగదు మీ ఖాతాకు జమకాకుంటే తర్వాత స్థాయిలో బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ సాయం కోరవచ్చు.
ఫోలీసులకు ఫిర్యాదు :
అనుమానాస్పద లావాదేవీల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అయితే అందుకు సంబంధించిన వివరాలను పోలీసులకు అందించాల్సి ఉంటుంది. మీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు. అయితే అందుకు మీవద్ద ఉన్న వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఇలాంటి తప్పులు జరగకూడదంటే UPI లావాదేవీల సమయంలో పేరు, UPI ఐడీ సహా ఇతర వివరాలను పూర్తిగా ధ్రువీకరణ చేసుకోవాలి. మీరు తరచూ UPI లావాదేవీలు నిర్వహిస్తున్న వారి వివరాలు సేవ్ చేసి పెట్టుకోవాలి. తెలియని లేదా కొత్త UPI ఐడీలకు నగదు బదిలీ చేసే సందర్భాల్లో నేరుగా ఆయా వ్యక్తులతో మాట్లాడి ధ్రువీకరణ చేసుకోవాల్సి ఉంటుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








