YouTube ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ యొక్క కోడ్‌ను రీడీమ్ చేసుకోవడం ఎలా?
ప్రస్తుత స్మార్ట్ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఫోన్ లలో వినోదం కోసం యాప్‌లను వినియోగిస్తున్నారు. అన్ని రకాల యాప్‌ల మాదిరిగానే యూట్యూబ్ ప్రీమియం కూడా తన యొక్క వినియోగదారుల కోసం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ యాడ్-ఫ్రీ వీడియో స్ట్రీమింగ్, యూట్యూబ్ ఒరిజినల్స్ మరియు వీడియో డౌన్‌లోడ్ వంటి ప్రయోజనాలను మెరుగైన వీక్షణ అనుభవంతో అందిస్తుంది. ఈ ప్రీమియం యాక్సెస్‌ను ఉచితంగా పొందడానికి వినియోగదారులకు యూట్యూబ్ కొన్ని గిఫ్ట్ కార్డ్‌లు మరియు కోడ్‌లను కూడా అందిస్తుంది.

YouTube ప్రీమియం యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ని యాక్టివేట్ చేయడానికి యూట్యూబ్ అందించే కోడ్ లేదా గిఫ్ట్ కార్డ్‌ని రీడీమ్ చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ కార్డ్ ని వినియోగదారుని అకౌంటుకు జోడించబడిన తరువాత లింక్ చేయబడిన యూజర్ల అకౌంటుకు గూగుల్ ప్లే బ్యాలెన్స్‌గా క్రెడిట్ చేయబడుతుంది. ఈ బ్యాలెన్స్‌ని యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం, యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ సినిమాలు మరియు TV షోలు మరియు ఇతర గూగుల్ ప్లే డిజిటల్ కంటెంట్ వంటి సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.
యూట్యూబ్ ప్రీమియం కోడ్ లేదా గిఫ్ట్ కార్డ్‌ని రీడీమ్ చేసుకునే విధానం
యూట్యూబ్ ప్రీమియం యొక్క ఉచిత యాక్సిస్ ని కోడ్ లేదా గిఫ్ట్ కార్డ్‌ని ఉపయోగించి మీ యొక్క లింక్ అకౌంటుకు రీడీమ్ చేసుకోవడానికి కింద ఉన్న ఈ సాధారణ దశలను అనుసరించండి.

** బ్రౌజర్‌లో మీ గూగుల్ అకౌంటును ఓపెన్ చేయండి.
** తర్వాత గిఫ్ట్ కార్డ్‌ని రీడీమ్ చేసుకోవడం కోసం ఈ లింక్‌పై నొక్కండి.
** ఇప్పుడు ప్రాంప్ట్ చేయబడిన కోడ్‌ని నమోదు చేసి "నెక్స్ట్" ఎంపికపై క్లిక్ చేయండి.
** 'యూట్యూబ్ ప్రీమియం' ఎంపికపై నొక్కండి మరియు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ప్లాన్‌ను ఎంచుకోండి.
** పేమెంట్ చేస్తున్నప్పుడు "గూగుల్ పే"ని మీ మోడ్‌గా ఎంచుకుని "కొనుగోలు"పై క్లిక్ చేయండి.
** ఈ విధంగా మీ యూట్యూబ్ ప్రీమియం అకౌంట్ యాక్టివేట్ చేయబడుతుంది మరియు కోడ్ రీడీమ్ చేయబడుతుంది.

కొన్ని యూట్యూబ్ కోడ్‌లు యూట్యూబ్ ప్రీమియం కొత్త సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని గుర్తుంచుకోండి. అయితే చాలా మంది ఇప్పటికే ఉన్న వినియోగదారులకు కూడా అర్హులు అవుతారు. ఈ కోడ్‌లు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ఆధారంగా కూడా క్రమబద్ధీకరించబడ్డాయి. ముఖ్యంగా యూట్యూబ్ వినియోగదారులందరికీ ఇప్పటికే ఒక నెల ఉచిత ట్రయల్‌ని అందిస్తోంది. సాంసంగ్ సంస్థ తన వినియోగదారులందరికీ 2 నుండి 3 నెలల యూట్యూబ్ ప్రీమియం యొక్క సబ్‌స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.


Click it and Unblock the Notifications








