Home
How to

AC వినియోగిస్తున్నారా.. ఈ తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు..!

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చల్లదనం కోసం అనేక మంది ఎయిర్ కండిషనర్‌లు (AC) ఉపయోగిస్తున్నారు. AC లు ఉపయోగిస్తుంటే సాధారణం కంటే ఎక్కువ విద్యుత్‌ ఛార్జీలు వస్తాయి. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా విద్యుత్‌ ఛార్జీలను భారీగా తగ్గించుకొనేందుకు అవకాశం ఉంటుంది.

ఎయిర్‌ ఫిల్టర్‌ల తప్పకుండా క్లీన్ చేసుకోవాలి :
ఎయిర్‌ కండిషనర్‌ ఫిల్టర్‌ల్లోకి దుమ్ము, దూళి వెళ్తుంది. వీటిని శుభ్రం చేయకుంటే.. పనితీరుపై భారీగా ప్రభావం చూపిస్తుంది. కూలింగ్ కూడా తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో AC ను నిరంతరం వినియోగిస్తుంటే ఎక్కువ విద్యుత్‌ ఖర్చు అవుతుంది.

how to reduce electricity bills during AC usage

AC సరిగ్గా పనిచేయాలన్నా.. తక్కువ విద్యుత్‌తో మెరుగైన కూలింగ్‌ను అందించాలన్నా.. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి ఎయిర్‌ ఫిల్టర్‌లను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం ఫిల్టర్‌ను బయటకు తీసి, నీటితో శుభ్రం చేయాలి. తడి పూర్తిగా పోయాక తిరిగి అమర్చాలి. ఎయిర్‌ ఫిల్టర్‌లు శుభ్రంగా ఉంటే, తక్కువ విద్యుత్‌తోనే AC మెరుగైన కూలింగ్‌ను అందిస్తుంది.

అవుట్‌డోర్ యూనిట్‌ను అలానే వదిలేస్తున్నారా?
ఏసీలో రెండు యూనిట్లు ఉంటాయి. ఇన్‌డోర్‌, అవుట్‌డోర్‌. ఇండోర్‌ యూనిట్‌ గది లోపల ఉంటుంది. మరియు క్రమం తప్పకుండా ఏదో ఒక సందర్భంలో శుభ్రం చేస్తుంటాం. మరియు ఇతర జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే అవుట్‌డోర్‌ యూనిట్‌ ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

లేకుంటే దుమ్ము, దూళితోపాటు చెత్త తో పేరుకుపోతుంది. ఇలాంటి సమయాల్లో AC సరైన కూలింగ్‌ను అందించలేదు. మరియు ఎక్కువ విద్యుత్‌ ఖర్చు అవుతుంది. ఇండోర్ యూనిట్‌ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో.. అవుట్‌డోర్‌ యూనిట్‌ కోసం కూడా అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇది తప్పనిసరిగా పాటించాలి
చాలా మంది ఎక్కువ కూలింగ్ కోసం 18 డిగ్రీల వద్ద AC ఉపయోగిస్తుంటారు. దీని వల్ల AC కంప్రెషర్ పైన అధికంగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా విద్యుత్‌ ఛార్జీలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా AC ను 24 నుంచి 26 డిగ్రీల వద్ద ఉపయోగించుకోవచ్చు.

దీంతోపాటు కొంత మంది రాత్రంతా AC ఆన్‌ చేసి ఉపయోగిస్తుంటారు. దీని వల్ల విద్యుత్‌ బిల్లుల మోత మోగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకొనేందుకు టైమర్‌ లేదా స్లీప్‌ మోడ్‌ను ఉపయోగించాలి. అంటే మీరు నిద్రపోయిన కొంత సమయం తర్వాత AC ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

దీంతోపాటు సాధారణంగా అర్ధరాత్రి దాటాక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో AC నుంచి వచ్చే చల్లదనం కంటే బయట నుంచి వచ్చే గాలి మరింత చల్లగా ఉండేందుకు అవకాశం ఉంది. అందువల్ల అర్ధరాత్రి దాటాక AC ఆఫ్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

వెంటనే చర్యలు తీసుకోవాలి
కొన్నిసార్లు AC ఉపయోగిస్తున్న సమయంలో కొన్నిరకాల వాసనలు వస్తుంటాయి. మరియు చిన్న సౌండ్‌లు కూడా వినిపిస్తుంటుంది. చాలా మంది వీటిని సరిగ్గా పట్టించుకోరు. దీర్ఘ కాలంలో ఇవే తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. చెడు వాసనలు వచ్చినప్పుడు ఫిల్టర్‌లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది.

మరియు AC పనిచేస్తున్న సమయంలో కొన్నిసార్లు చిన్న చిన్న శబ్ధాలు వస్తుంటాయి. మెకానికల్‌ సమస్యలే ఇందుకు కారణం. ఇలాంటి సమయాల్లో అలసత్వం ప్రదర్శించకుండా, వెంటనే రిపేర్‌ చేయించేందుకు ప్రయత్నం చేయాలి. లేదంటే భవిష్యత్‌లో పెద్ద ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
how to reduce electricity bills during AC usage in summer here are the tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X