ఆధార్ కు సంబంధించి ఎలాంటి కంప్లైంట్ అయినా Online లో నే చేయడం, ఎలా ?

By Maheswara
|

ఇప్పుడు అన్ని ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డులు తప్పనిసరి.అలాంటి ఆధార్ కార్డు లో ఎటువంటి తప్పులు ఉన్నా లేదా సరైన సమయానికి ఆధార్ కార్డు మీకు చేరకపోయిన ,పొందకపోయిన మీరు గవర్నమెంట్ నుండి రావలసిన రాయితీలను మరియు కొన్ని స్కీం లను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఖచ్చితమైన సమాచారంతో మీ అందుబాటులో ఉంచుకోవాలి.

Online లోనే ఫిర్యాదు చేయవచ్చు
 

కానీ కొన్ని సార్లు అధికారుల నిర్లక్య్సం వల్లనో లేదా ఇతర సాంకేతిక కారణాల వల్లనో మీ ఆధార్ కార్డు డెలివరీ చేయడం ఆలస్యమవ్వడం మరియు అధికారులు మీతో అసభ్యం గా ప్రవర్తించడం ఇంకా ఏదైనా లంచం అడగటం వంటి విషయాలు మీకు ఎదురైతే మీరు నేరుగా ఆధార్ కేంద్రానికి Online లోనే ఫిర్యాదు చేయవచ్చు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశం తోనే UIDAI ఈ ఆన్లైన్ కంప్లైంట్ లను ప్రారంభించింది. ఆధార్ కార్డు సర్వీస్ లకు సంబంధించి యే కంప్లైంట్ అయినా మీరు ఇక్కడ రిజిస్టర్ చేయవచ్చు.

Also Read: Gmail కొత్త ఫీచర్ లు అందరి కంటే ముందే మీకు కావాలా ..? ఇలా చేయండి.

 email లేదా Phone call ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు

email లేదా Phone call ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు

ఇక్కడ ఫిర్యాదు లు రిజిస్టర్ చేసేటప్పుడు కొన్ని కంప్లైట్ లకు ఆధార్ ఎన్రోల్మెంట్ ID ఇవ్వాల్సి ఉంటుంది.మరికొన్ని వాటికి ID అవసరం ఉండదు.మరి కొన్ని కంప్లైన్ట్ లను మీరు email లేదా Phone call ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయాలనుకుంటే '1947 ' టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి మీ కంప్లైంట్ ను రిజిస్టర్ చేయవచ్చు. అలాగే email ద్వారా చేయాలనుకున్న వాళ్లు help@uidai.gov.in కు ఇమెయిల్ ద్వారా తమ ఫిర్యాదును పంపవచ్చు.

Online website లో కంప్లైంట్

Online website లో కంప్లైంట్

అలా కాకుండా Online website లో కంప్లైంట్ లను చేయనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

1. ఆధార్ వెబ్సైటు ' https://resident.uidai.gov.in/file-complaint' లింక్ ను సందర్శించండి

2. కిందకి స్క్రోల్ చేసి మీ ఎన్రోల్మెంట్ ID ,Date ,Time మరియు contact వివరాలు వంటి వాటిని పూరించండి.

3.మీ ఫిర్యాదు కు సంబందించిన క్యాటగిరీ టైపు మరియు వివరాలను అందించండి.

4.Captcha వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Submit చేయండి.

మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిందని గమనించండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
How To Register Aadhar Related Complaints Online, Via Phone Call  And Via Email. Know Here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X