Home
How to

Tata Neo సూపర్ యాప్‌లో రిజిస్టర్ అవ్వడం & నాణేలను సంపాదించడం ఎలా?

టాటా గ్రూప్స్ సంస్థ ఎట్టకేలకు ఆండ్రాయిడ్ మరియు iOS ఎకోసిస్టమ్‌లోని వినియోగదారులందరికీ తన యొక్క కొత్త సూపర్ యాప్ Tata Neo ని విడుదల చేసింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా విస్తృత శ్రేణి సేవలు ఉన్నందున ఈ కొత్త అప్లికేషన్ ను సూపర్ యాప్‌గా వర్ణించబడుతున్నది. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం నుండి షాపింగ్ మరియు ఎయిర్‌టికెట్‌లను కొనుగోలు చేయడం వరకు దాదాపు అన్ని అవసరాలను ఒకే చోట అందించాలని లక్ష్యంతో Tata Neu ని అందుబాటులోకి తీసుకొనివచ్చారు.

How to Register and Earn Coins on Tata Neo Super App

Tata Neu సూపర్ యాప్ ఇప్పటికే iOS మరియు ఆండ్రాయిడ్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది. యాప్ స్టోర్‌లలో ఇప్పటి నుండి జాబితా చేయబడినప్పటికీ దీనిని అందరూ వినియోగించలేరు. టాటా సంస్థ దీనిని మొదట్లో తన ఉద్యోగులకు ఈ సేవలను ఉపయోగించుకోవడానికి మాత్రమే అనుమతించింది. కావున మీరు టాటా సంస్థ యొక్క ఉద్యోగులు అయితే కనుక దీన్ని డౌన్‌లోడ్ చేసి నమోదు చేసుకొని సంస్థ అందించే అన్ని రకాల ప్రయోజనాలను వినియోగించవచ్చు.

Tata Neu యాప్‌లో రిజిస్టర్ చేసుకోనే విధానం

How to Register and Earn Coins on Tata Neo Super App

** Tata Neu యాప్‌ను సులభంగా గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

** తర్వాత మీరు రిజిస్టర్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
** తరువాత ఈ యాప్ అదే నంబర్‌కు OTPని పంపుతుంది. OTPని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
** తరువాత అన్నిటికంటే ముందుగా మీరు మీ పూర్తి పేరును పూరించాలి.
** తరువాత మీరు కొత్త యాప్ యొక్క హోమ్ పేజీకి చేరుకుంటారు. అక్కడ మీరు అన్ని సేవలను యాక్సెస్ చేయగలరు.
**యాప్ హోమ్ పేజీలో టాటా సంస్థ ప్రస్తుతం వినియోగదారులకు గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, ఫ్యాషన్, బ్యూటీ, లగ్జరీ, హోటళ్లు, విమానాలు, ఈట్ & డ్రింక్, హెల్త్, ఎంటర్టైన్మెంట్ వంటి అన్ని రకాల సేవలు మరియు విభాగాలను జాబితా చేసింది.
** Tata Neu దాని స్వంత UPI ఆధారిత పేమెంట్ సర్వీస్ మరియు Neu డిజిటల్ వాలెట్‌ను కూడా అందిస్తోంది. QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా అన్ని రకాల పేమెంట్లను Tata UPI అడ్రస్ ద్వారా చేయడానికి ఉపయోగించవచ్చు.

Tata Neu యాప్‌ ప్రయోజనాలు

టాటా గ్రూప్స్ సంస్థ Tata Neu యాప్‌ ద్వారా కొన్ని రకాల ఉత్పత్తుల కొనుగోలు మీద తగ్గింపు ఆఫర్లను అందించబడుతున్నప్పటికీ యాప్ అందించే సూపర్ నాణేలను ఉపయోగించడం ద్వారా అధికంగా ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి లావాదేవీ మీద వినియోగదారులకు రివార్డ్‌ని అందిస్తుంది. మీరు Tata Neuలో షాపింగ్ చేస్తే మీరు కనీసం 5 శాతం NeuCoinsని పొందుతారు. ప్రతి NeuCoin 1రూపాయికి సమానంగా ఉంటుంది.

How to Register and Earn Coins on Tata Neo Super App

NeuCoins సంపాదించే మార్గాలు

** మీరు ఆన్‌లైన్‌లో చెక్అవుట్ చేసినప్పుడు టాటా పేని ఎంచుకోండి.
** మీరు స్టోర్‌లో సేవలను పొందుతున్నట్లయితే బిల్లింగ్ పూర్తయ్యే ముందు మీరు క్యాషియర్‌కు తెలియజేయాలి.

Best Mobiles in India

English summary
How to Register and Earn Coins on Tata Neo Super App
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X