COVID-19 బూస్టర్ షాట్ డోస్‌లకు నమోదు చేసుకోవడం, అర్హతను తనిఖీ చేయడం ఎలా??

|

భారతదేశంలో కరోనా యొక్క Omicron వేరియంట్ అత్యంత వేగవంతంగా వ్యాప్తి చెందుతుండడంతో భారతదేశంలో COVID కేసులు పెరుగుతున్నందున దేశం కొత్త బూస్టర్ డ్రైవ్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతోంది. కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడంలో బూస్టర్ సహాయపడవచ్చని కొన్ని అధ్యయనాలు సూచించడంతో ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి మరియు ఫ్రంట్‌లైన్ కార్మికులకు బూస్టర్ షాట్‌లను అందించడం ప్రారంభించింది.

 
COVID-19 బూస్టర్ షాట్ డోస్‌లకు నమోదు చేసుకోవడం,అర్హతను తనిఖీ చేయడం ఎలా

బూస్టర్ షాట్ డోస్‌లకు అర్హులైన వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా నేరుగా తీసుకోవచ్చు. అయితే అవాంతరాలను నివారించడానికి కౌవిన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది అని సూచించబడింది. బూస్టర్ షాట్ డోస్‌లను కోసం అర్హత మరియు డాక్యూమెంట్స్ మరియు స్లాట్‌ను ఎలా పొందాలి వంటి ఇతర వివరాల యొక్క సాధారణ గైడ్ గురించి తెలుసుకోవడానికి కింద సూచించే పద్దతులను అనుసరించండి.

Cowin పోర్టల్‌లో బూస్టర్ షాట్ డోస్‌ల కోసం నమోదు చేసుకునే విధానం

స్టెప్ 1: Cowin వెబ్‌సైట్- cowin.gov.inని ఓపెన్ చేసి, Cowin ట్యాబ్‌కు నావిగేట్ చేసి, టీకా ఎంపికపై నొక్కండి.

స్టెప్ 2: కింది పేజీలో మీ రిజిస్టర్డ్ మొబైల్ (మీరు మునుపటి రెండు వ్యాక్సిన్ షాట్‌ల కోసం ఉపయోగించినది) నమోదు చేయమని అడగబడతారు. హోమ్ స్క్రీన్‌పై OTP పాప్ అప్ అవుతుంది. లాగిన్ చేయడానికి అంకెలను నమోదు చేయండి.

స్టెప్ 3 : లాగిన్ అయిన తర్వాత అపాయింట్‌మెంట్‌ల మాడ్యూల్‌లో మీరు బూస్టర్ షాట్ డోస్‌లకు అర్హులు కాదా అని సైట్ చూపుతుంది.

స్టెప్ 4: బూస్టర్ షాట్ డోస్‌ ట్యాబ్‌పై నొక్కండి. ఆపై మీ లొకేషన్ ఆధారంగా అపాయింట్‌మెంట్‌ను ఎంచుకోండి. ఆపై బుక్ అపాయింట్‌మెంట్‌పై క్లిక్ చేయండి. ఇది ధృవీకరించబడిన తర్వాత మీరు యాప్ నుండి వివరాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

COVID-19 బూస్టర్ షాట్ డోస్‌లకు నమోదు చేసుకోవడం,అర్హతను తనిఖీ చేయడం ఎలా

అర్హత

Cowin బూస్టర్ షాట్ డోస్‌ను తీసుకోవడానికి దానికి సంబందించిన అర్హత గురించి చెప్పాలంటే కోవిన్ రిజిస్టర్డ్ హెల్త్ కేర్ వర్కర్ (HWC) లేదా ఫ్రంట్ లైన్ వర్కర్ (FLW) లేదా 60 ఏళ్లు పైబడిన పౌరుడు మాత్రమే ప్రస్తుతం ఈ బూస్టర్ డోస్‌ని పొందగలుగుతారు. అయితే కొత్త డోస్ ఎంపిక తొమ్మిది నెలలు లేదా 39 వారాల క్రితం రెండవ వ్యాక్సిన్ షాట్ తీసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుందని కూడా గమనించాలి. నివేదికల ప్రకారం దేశంలోని అర్హులైన జనాభాలో 90 శాతం మంది కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదుతో టీకాలు వేసినట్లు చెబుతున్నారు.

అవసరమైన డాక్యూమెంట్స్

అవాంతరాలను నివారించడానికి టీకా బూట్ వద్ద అపాయింట్‌మెంట్‌కు ఫోటో IDని మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను తీసుకెళ్లాలని కోవిన్ సిఫార్సు చేస్తున్నారు. సెషన్‌ను బుక్ చేసిన తర్వాత మీరు దానిని రద్దు చేయలేరు. అయితే సైట్ దాన్ని రీషెడ్యూల్ చేసే ఎంపికను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Register For COVID-19 Precaution or Booster New Dose: Check Eligibility and Required Documents

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X