రోజంతా కంప్యూటర్ ముందే కూర్చుంటున్నారా..?
మన శరీరంలో కళ్లు ఎంతో ముఖ్యమైనవి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవల్సిన అవసరం మనకు చాలా ఉంది. మన రోజువారి కార్యకలాపాల్లో భాగంగా కళ్లకు కలిగే నిరంతర శ్రమను మనం ఏమాత్రం అంచనా వేయలేం.

Read More : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ : స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ డిస్కౌంట్స్
కొంత మంది తమతమ ఉద్యోగాల రిత్యా రోజస్తమానం కంప్యూటర్ ముందే కూర్చుంటారు. ఈ క్రమంలో వీళ్లు కంటి సంరక్షణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. ముఖ్యంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే వాళ్లు తమ కంటి ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఈ జాగ్రత్తలు పాటించక తప్పదంటున్నారు వైద్యులు.

టిప్ 1
నిరంతరం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు కంటి వైద్యుల సమక్షంలో రెగ్యులర్ చెకప్‌లకు హాజరవటం మంచిది.

టిప్ 2
కంప్యూటర్ గదిలో ఇంటీరియర్ లైటింగ్ కూడా ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

టిప్ 3
మీ మానిటర్‌కు యాంటీ గ్లేర్ స్ర్కీన్‌ను ఏర్పాటు చేయటం ద్వారా కంటి ఒత్తిడి నుంచి కాస్తంత ఉపశమనం పొందవచ్చు.

టిప్ 4
మానిటర్ బ్రెట్‌నెస్ స్థాయిను సౌకర్యవంతంగా అమర్చుకోవటం వల్ల కళ్ల పై ఒత్తిడిని కొంత మేర తగ్గించుకోవచ్చు. ఫోన్ బ్రెట్‌నెస్ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం కళ్ల పై కచ్చితంగా ఉంటుంది.

టిప్ 5
టెక్స్ట్ సైజ్ ఇంకా క్రాంటాస్ట్ స్థాయిని అడ్జస్ట్ చేసుకోవటం వల్ల కంటెంట్‌ను సౌకర్యవంతంగా వీక్షించవచ్చు. అంతే కాకుండా, కళ్ల పై పడే ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుంది.

టిప్ 6
మీరు కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువ సేపు పని చేస్తున్నట్లైతే, కంప్యూటర్ నుంచి దాదాపు 30 సెంటీమీటర్ల దూరంలో కూర్చోని పనిచేయండి.

టిప్ 7
గంటకొకసారి లేచి నడవడం అలవాటు చేసుకోండి. కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అరగంటకు ఒకసారి మీ దృష్టిని కాసేపు మరల్చండి, లేదా నీటితో శుభ్రం చేసుకోండి.

టిప్ 8
క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామం చేయండి. వీలైనంత ఎక్కువ సమయం నిద్రపొండి. అలాగే మంచి పౌష్టికరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చలాకీగాకూడా ఉంటారంటున్నారు వైద్యులు.

టిప్ 9
వైద్యుల సూచన మేరకు కళ్లద్దాలను ధరించండి.


Click it and Unblock the Notifications








