ఆండ్రాయిడ్ ఫోన్‌లో Pre-Installed Appsను తొలగించటం ఎలా?

స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువుగా వినియోగించబడుతోన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఓపెన్ సోర్స్ కావటంతో అనేక సెక్యూరిటీ ప్రమాదాలు పొంచి ఉన్నాయని సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నాయి.

ఆండ్రాయిడ్ ఫోన్‌లో Pre-Installed Appsను తొలగించటం ఎలా?

Read More : 24 గంటల్లో 2,50,000, నోకియాకు క్రేజ్ తగ్గలేదు

ముఖ్యంగా Bloatware యాప్స్ నుంచి ఆండ్రాయిడ్ డివైస్‌లకు ముప్పు వాటిల్లే ప్రమాదాం ఎక్కువుగా ఉందని వీరు చెబుతున్నారు. Bloatware యాప్స్ అనేవి ముందుగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో పొందుపరచబడిన Pre-Installed Apps. ఈ యాప్స్ ద్వారా ఆండ్రాయిడ్ హ్యాకర్లు సునాయాశంగా ఫోన్‌లలోకి చొరబడి విధ్వంసం సృష్టించే వీలుంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పేరుకుపోయి ఉన్న Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ముఖ్యమైన సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ఫోన్‌లో ముందుగానే నిక్షిప్తమై ఉన్న కొన్ని స్టాక్ యాప్స్‌‌ను మీరు మాన్యువల్‌గా రిమూవ్ చేయటం సాధ్యపడదు. కాబట్టి, ముందుగా ఫోన్‌లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settings -> About Phone -> Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

స్టెప్ 2

ఇప్పుడు మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే developer option కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్‌ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేసుకోండి.

స్టెప్ 3

ఇప్పుడు మీ విండోస్ పీసీలో Debloater టూల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ టూల్ మీ ఆండ్రాయిడ్ డివైస్‌లోని సిస్టం యాప్స్‌ను రిమూవ్ చేయగలదు.

స్టెప్ 4

యూఎస్బీ కేబుల్ ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను పీసీకి కనెక్ట్ చేయండి. Debloater టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి.

స్టెప్ 5

డివైస్ డిటెక్ట్ అయిన వెంటనే మీ ఫోన్‌లోని యాప్స్ మొత్తం స్కాన్ కాబడతాయి. వాటిలో Pre-Installed Appsను మార్క్ చేసుకుని apply బటన్ పై క్లిక్ చేసినట్లయితే అవి రిమూవ్ కాబడతాయి.

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో..

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించేందుకు ఈ క్రింది మార్గాలను అనుసరించండి..

Rooted ఆండ్రాయిడ్ ఫోన్‌లో

స్టెప్ 1

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ root కాబడినదై ఉండాలి.

స్టెప్ 2

ఆ తరువాత System App Remover అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోండి.

 

స్టెప్ 3, స్టెప్ 4

స్టెప్ 3

డౌన్‌లోడ్ అయిన System App Remover యాప్‌ను ఫోన్ లో లాంచ్ చేయండి.

స్టెప్ 4

యాప్ లాంచ్ అయిన తరువాత మీరు రిమూవ్ చేయాలనుకుంటున్న యాప్ ను సెలక్ట్ చేసుకుని ‘Uninstall' పై టాప్ చేయండి. ఈ విధంగా రూట్ కాబడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లో Bloatware యాప్స్‌ను తొలగించవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Remove Bloatware From Android Device. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting