YouTubeలో కాపీరైట్ క్లెయిమ్స్ తీసివేయడం ఎలా ! ఇది చదవండి!

|

ఇటీవ‌లి కాలంలో ప్ర‌జ‌లు త‌మ‌ నిత్య కృత్యాలను వివిధ సామాజిక మాధ్య‌మాల ద్వారా ఇత‌రుల‌కు చూపించేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్ వినియోగం కూడా భారీగా పెరిగింది. ప్ర‌తి ఒక్క‌రూ తాము ఎప్పుడు, ఎక్క‌డ‌, ఏం చేస్తున్నాం అనే విష‌యాల్ని వీడియోలుగా చిత్రీక‌రించి Youtubeలో అప్‌లోడ్ చేయ‌డం ప‌రిపాటిగా మారింది. ఒక వ్య‌క్తిగ‌త విష‌యాలే కాకుండా త‌మ‌కు న‌చ్చిన ఇత‌ర‌త్రా ఆస‌క్తిక‌ర అంశాల‌ను కూడా వీడియోలుగా చిత్రీక‌ర‌ణ చేయ‌డం మొద‌లైంది.

 
YouTubeలో కాపీరైట్ క్లెయిమ్స్ తీసివేయడం ఎలా ! ఇది చదవండి!

అయితే , ఈ వీడియోలు విషయంలో మీరు YouTube కాపీరైట్ క్లెయిమ్‌లతో విసిగిపోయారా? మీరు YouTubeలో కాపీరైట్ క్లెయిమ్‌లను తీసివేయాలనుకుంటే, అందుకు సంబంధించిన విషయాలని మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. మీరు కూడా చదవండి.

YouTube కాపీరైట్ క్లెయిమ్‌ అంటే ఏమిటి

YouTube కాపీరైట్ క్లెయిమ్‌ అంటే ఏమిటి

మీరు మీ వీడియోలో వేరొకరి కంటెంట్‌ను ఉపయోగించినట్లయితే, ఈ హెచ్చరిక మీకు వస్తుంది. కొన్నిసార్లు కాపీరైట్ మిమ్మల్ని చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టగలదని మీరు తెలుసుకోవాలి. కాబట్టి, మీరు అలాంటి మూడు కాపీ రైట్ క్లెయిమ్స్ 'పొందినట్లయితే, YouTube మీ ఛానెల్‌ని క్లోజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాపీరైట్ క్లెయిమ్‌ జరిగితే మీకు యూట్యూబ్ నుంచి వచ్చే రెవిన్యూ పైన కూడా ప్రభావం పడుతుంది. కాపీరైట్ క్లెయిమ్‌లకు సులభంగా దారితీసే కొన్ని మార్గాలు ఉన్నాయి.

YouTubeలో కాపీరైట్ దావాను ఎలా తీసివేయాలి?
 

YouTubeలో కాపీరైట్ దావాను ఎలా తీసివేయాలి?

YouTubeలో కాపీరైట్ క్లెయిమ్‌ను తీసివేయడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.
* YouTube ఛానల్ సైన్-ఇన్ చేయండి.
* ఛానల్ లోకి సైన్-ఇన్ అయినా తర్వాత కస్టమైజ్ ఛానల్ సెక్షన్ ఎంచుకోవాలి.
* ఆ తర్వాత కంటెంట్‌ సెక్షన్ ని ఎంచుకోండి.
* అందులో అన్ని వీడియోల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితా లో కాపీరైట్ క్లెయిమ్ వున్న కంటెంట్ ను క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత ఆ వీడియో కి సంబంధించి ఏ అంశం పై కాపీ రైట్ ఉందనే వివరాల్ని మనకి చూపిస్తుంది.
* మీ వీడియోలో ఆడియో కాపీరైట్ క్లెయిమ్‌ చేయబడితే, మీరు YouTube పాటను మ్యూట్ చేసి ఆడియోని భర్తీ చేయవచ్చు.
* మీ వీడియోలో కొంత భాగం కాపీరైట్ క్లెయిమ్‌ చేయబడితే, ఆ భాగాన్ని కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ వీడియో మొత్తం youtube మళ్లి పరిశోధించి కాపీ రైట్ క్లెయిమ్ ను తొలగించి వీడియో తిరిగి ప్రచురించ బడుతుంది.
* ఈ రకంగా మీరు యూట్యూబ్ lo మీ వీడియోల పై వచ్చిన కాపీ రైట్ క్లెయిమ్ ని తొలగించు కోవచ్చు.

అదేవిధంగా, యూట్యూబ్‌లో క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ గురించి, ఆ ఫీచ‌ర్‌ను సాధించాలంటే ఏం చేయాలో అనే విష‌యాల్ని ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం:

అదేవిధంగా, యూట్యూబ్‌లో క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ గురించి, ఆ ఫీచ‌ర్‌ను సాధించాలంటే ఏం చేయాలో అనే విష‌యాల్ని ఇప్పుడు వివ‌రంగా తెలుసుకుందాం:

సాధారణంగా Youtube అంటే వీడియో మాత్ర‌మే పోస్టులు చేస్తార‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మ‌న ఛానెల్‌లో మ‌రో రెండు ర‌కాల పోస్టులు చేయ‌వ‌చ్చు. అవేంటంటే.. ఫేస్‌బుక్ స‌హా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల మాదిరి హెడ్‌లైన్ డిస్క్రిప్ష‌న్‌తో ఫోటో పోస్టులు చేయ‌వ‌చ్చు. దాంతో పాటుగా పోల్స్ (క్విజ్ మాదిరి) పోటీలు కూడా ఈ Community Tab Feature ద్వారా మ‌న ఛానెల్‌పై నిర్వ‌హ‌ణ చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. అనే ప్ర‌శ్న ఇచ్చి దానికి నాలుగు ఆప్ష‌న్ల‌ను జ‌త చేయ‌వ‌చ్చు. త‌ద్వారా మీ స‌బ్‌స్క్రైబ‌ర్ల అభిప్రాయాల‌ను ఈ పోల్‌లో మీరు తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా క‌మ్యూనిటీ ట్యాబ్ Youtube క్రియేట‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఈ ఫీచ‌ర్ సాధించాలంటే ముందుగా మ‌న స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 దాటాలి. ఆ త‌ర్వాత మ‌నం క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్‌ను కోరుతూ యూట్యూబ్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి.

క‌మ్యూనిటీ ట్యాబ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

క‌మ్యూనిటీ ట్యాబ్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.


* ముందుగా Youtube ఛానెల్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత ఎడ‌మ‌వైపు మీకు వివిధ ర‌కాల ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిని స్క్రోల్ డౌన్ చేస్తే చివ‌ర‌న సెండ్ Feedback అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
* సెండ్ ఫీడ్ బ్యాక్ (Send Feedback) ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకున్న వెంట‌నే మీకు ఒక న్యూ టేబుల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యూట్యూబ్‌కు ఓ చిన్న డిస్క్రిప్ష‌న్ రాయాలి. "మా ఛానెల్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 చేరుకుంది. కాబ‌ట్టి మాకు క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ అందించ‌గ‌ల‌రు." అని ఇంగ్లీష్‌లో రాసి సెండ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన త‌ర్వాత మీ ఛానెల్ కంపెనీ గైడ్‌లైన్స్ అన్ని స‌క్ర‌మంగా పాటిస్తున్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా వారం లేదా ప‌ది రోజుల్లో క‌మ్యూనిటీ ట్యాబ్ అందుబాటులోకి వ‌స్తుంది.

Best Mobiles in India

English summary
How to remove copy right claim on your youtube video

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X