PDF ఫైల్‌ యొక్క పాస్‌వర్డ్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో తొలగించడం ఎలా?

|

మీకు ఎప్పుడైనా బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా ఫోన్ బిల్లు వంటివి PDF ఫైల్‌గా లభించాయా?? ఒక వేళ మీకు ఇటువంటి PDF ఫైల్‌ లభించి ఉంటే కనుక అది పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఎందుకంటే ఈ పిడిఎఫ్ ఫైళ్ళలో పాస్వర్డ్ రక్షణ అవసరమయ్యే ప్రైవేట్ మరియు సున్నితమైన సమాచారం ఉంటుంది.

పిడిఎఫ్ పాస్‌వర్డ్‌

పిడిఎఫ్ పాస్‌వర్డ్‌

ప్రతి పిడిఎఫ్ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవడం చాలా ఇబ్బంది. ప్రత్యేకించి మీరు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి మీ CAకు పంపడానికి ఈ పత్రాలను సేవ్ చేయాలనుకుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఈ ఇబ్బంది నుండి బయటపడడానికి మీరు PDF ఫైళ్ళ నుండి పాస్వర్డ్ను తొలగించడం ఒకటే మార్గం. పిడిఎఫ్ ఫైళ్ళ నుండి పాస్‌వర్డ్‌ను తొలగించడానికి మీరు మొదట పాస్‌వర్డ్‌ను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

 

Tata Sky Offers: రెండు నెలల సేవలను ఉచితంగా పొందే గొప్ప అవకాశం...Tata Sky Offers: రెండు నెలల సేవలను ఉచితంగా పొందే గొప్ప అవకాశం...

PDF ఫైల్‌ యాక్సెస్

PDF ఫైల్‌ యాక్సెస్

PDF ఫైల్ లను మనలో చాలా మంది ఎక్కువగా మన కంప్యూటర్లలో యాక్సెస్ చేస్తారు. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉండడం వలన వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా PDF ఫైల్‌లను యాక్సెస్ చేయవచ్చు. అలాంటప్పుడు మీరు పిడిఎఫ్ పాస్‌వర్డ్‌ను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సి వస్తే అది చాలా చికాకు కలిగిస్తుంది. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తుంటే కనుక PDF ఫైల్ నుండి పాస్‌వర్డ్‌ను తొలగించడానికి కింది దశలను అనుసరించండి.

PDF ఫైల్‌ యొక్క పాస్‌వర్డ్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో తొలగించే దశలు

PDF ఫైల్‌ యొక్క పాస్‌వర్డ్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో తొలగించే దశలు

1. Google Play నుండి PDF యుటిలిటీలను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

2. మీరు పాస్‌వర్డ్‌ను తొలగించాలనుకుంటున్న PDF ఫైల్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలి.

3. PDF యుటిలిటీ యాప్ ను ఓపెన్ చేసి PDF ని ఎంచుకోవడానికి "next" బటన్ ను నొక్కండి.

4. మీరు మీ ఫైల్‌ను గుర్తించిన తర్వాత దాన్ని ఎంచుకుని "స్టార్ట్" బటన్ ను నొక్కండి. మీరు PDF పాస్‌వర్డ్‌ను నమోదు చేయమని అడుగుతూ పాప్-అప్ పొందుతారు. దాన్ని ఎంటర్ చేసి "Ok" ను నొక్కండి.

5. పాస్వర్డ్ రక్షణ లేకుండా క్రొత్త పిడిఎఫ్ ఫైల్ను యాక్సెస్ చేయడానికి అసలు పిడిఎఫ్ ఫైల్ సేవ్ చేయబడిన అదే గమ్యస్థానానికి తిరిగి వెళ్ళండి.

 

Best Mobiles in India

English summary
How to Remove PDF Password on Android Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X