గూగుల్‌లో నుంచి మీ వ్యక్తిగత సమాచారాన్ని తొలగించాలా.. అయితే ఇలా దరఖాస్తు చేయండి..!
ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి సమాచారం అయినా సులభంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటోంది. ఫోన్ నంబర్, అడ్రస్ సహా సోషల్ మీడియా అకౌంట్లు వంటి వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్‌లో ఉండడం కొన్నిసార్లు ఇబ్బందులకు గురిచేస్తుంది. మరియు వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అయితే ఈ సమాచారాన్ని తొలగించేందుకు (How to Remove Personal Information From Google) అవకాశం ఉంది.
గూగులో ఇందుకోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ పేరు "Results About You". ఈ ఫీచర్ ద్వారా నేరుగా గూగుల్‌కు దరఖాస్తు చేయవచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని సంబంధిత వెబ్‌సైట్‌ల నుంచి తొలగించమని అభ్యర్థించవచ్చు. ఇందుకోసం పూర్తి వివరాలు మీకోసం.

స్టెప్ 1 : తొలుత గూగుల్ సపోర్టు పేజీలోకి వెళ్లాలి.
స్టెప్ 2 : గూగుల్ సపోర్టు పేజీలో మీ వ్యక్తిగత వివరాల తొలగింపునకు సంబంధించిన ఫారమ్ ను పొందవచ్చు. అందులో మీ వ్యక్తిగత వివరాలు ఉన్న URL లను పొందపరచాలి.
స్టెప్ 3 : ఒకే ఫారమ్‌లో అనేక URL లను జతచేయవచ్చు. ఫలితంగా అన్నింటిని ఒకేసారి తొలిగించేందుకు అవకాశం ఉంటుంది.
స్టెప్ 4 : అనంతరం గూగుల్ మీ విజ్ఞప్తిని పరిశీలించి చర్యలు తీసుకుంటుంది. మీరు సమర్పించిన వివరాలు సరైనవి అయితే ఆయా వివరాలను తొలిగిస్తుంది. అయితే ఇందుకు సమయం పడుతుందని గుర్తుపెట్టుకోవాలి.
దీంతోపాటు నేరుగా ఆయా వెబ్ సైట్ లకు కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వ్యక్తిగత వివరాలను తొలగించాలని కోరవచ్చు. దీనిపై ఆయా వెబ్ సైట్ నిర్వహకులు నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం ఈ కింది చెప్పినట్లు చేయవలసి ఉంటుంది. పూర్తి వివరాలు మీకోసం.
స్టెప్ 1 : మీ వ్యక్తిగత వివరాలు ఉన్న వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2 : బ్రౌజర్ URL పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
స్టెప్ 3 : అనంతరం డ్రాప్‌డౌన్ మెనూ వద్ద About this Result ను ఎంచుకోవాలి.
స్టెప్ 4 : అక్కడున్న Remove result ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
వెబ్‌సైట్‌ల నుంచి మీ వ్యక్తిగత సమాచారం తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్న తర్వాత గూగుల్ యాప్ ద్వారా ట్రాక్ చేసేందుకు అవకాశం ఉంది. అంటే మీ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు. గూగుల్ యాప్ ఓపెన్ చేసి Result About You ట్యాబ్ వద్దకు వెళ్లాలి. అనంతరం మీ ప్రొఫైల్ ఫోటో పైన క్లిక్ చేసి, మీ దరఖాస్తును ట్రాక్ చేయవచ్చు.
గూగుల్‌కు మీరు పంపిన దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలన చేస్తుంది. మీ వ్యక్తిగత వివరాలను తొలగించేందుకు చేసిన దరఖాస్తు అర్హతలను నిర్ధారణ చేస్తుంది. అనంతరం గూగుల్ వ్యక్తిగత భద్రత నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇందుకు నిర్ణీత సమయం తీసుకొనే అవకాశం ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








