మీ ఫోన్‌పై గీతలు పడ్డాయా, ఈ ట్రిక్స్‌తో మళ్లీ కొత్తగా చేసుకోవచ్చు

మీరు ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌పై గీత‌లు ప‌డితే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది.

|

మీరు ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీ స్క్రీన్‌పై గీత‌లు ప‌డితే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. అత్యంత ఖరీదైన ఫోన్ అయితే ఇక చెప్పనే అవసరం లేదు. అందుకుని చాలామంది తమ ఫోన్లను చాలా జాగ్రత్తగా వాడుతుంటారు. అయినప్పటికీ మనకు తెలియకుండానే కొన్ని గీతలు పడి ఫోన్ చూసేందుకు ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే దీన్నించి ఫోన్ రక్షించుకోవడానికి ఏవైనా మార్గాలున్నాయా అని చాలామంది తెగ ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. మ‌న ఇంట్లో ఉండే కొన్ని ర‌కాల ప‌దార్థాల‌తోనే మొబైల్ స్క్రీన్‌పై ప‌డిన గీత‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

షియోమికి అసలైన సవాల్, నాలుగు స్మార్ట్‌ఫోన్లతో శాంసంగ్ వార్ !షియోమికి అసలైన సవాల్, నాలుగు స్మార్ట్‌ఫోన్లతో శాంసంగ్ వార్ !

Toothpaste

Toothpaste

ఇంట్లో ఉండే టూత్‌పేస్ట్ స‌హాయంతో మొబైల్ స్క్రీన్‌పై ప‌డిన గీత‌ల‌ను సుల‌భంగా తొల‌గించ‌వ‌చ్చు. ఒక మెత్త‌ని కాట‌న్ క్లాత్‌ను తీసుకుని దానిపై కొద్దిగా టూత్‌పేస్ట్‌ను రాయాలి. ఆ పేస్ట్‌ను డివైస్ తెర‌పై అంత‌టా అప్లై చేయాలి. అనంత‌రం మ‌ళ్లీ ఓ పొడి కాట‌న్ క్లాత్‌ను తీసుకుని స్క్రీన్‌ను శుభ్రం చేయాలి. దీంతో స్క్రీన్‌పై ప‌డిన స్క్రాచ్‌లు, గీత‌లు పోతాయి.

Baking soda

Baking soda

బేకింగ్ సోడా కూడా స్క్రాచ్‌ల‌ను తొల‌గించ‌డంలో బాగానే ప‌నిచేస్తుంది. సింపుల్‌గా కొంత బేకింగ్ సోడాను తీసుకుని అందులో కొంత నీటిని క‌లిపి మెత్త‌ని, చిక్క‌ని పేస్ట్‌లా త‌యారు చేయాలి. అనంత‌రం పైన చెప్పిన విధంగా డివైస్ స్క్రీన్‌ను క్లీన్ చేస్తే చాలు.

Vegetable oil

Vegetable oil

కొన్ని చుక్క‌ల వెజిట‌బుల్ ఆయిల్‌ను తీసుకుని ఆ డ్రాప్స్‌ను ఒక కాట‌న్ క్లాత్ స‌హాయంతో డివైస్ స్క్రీన్‌పై రాయాలి. మ‌ళ్లీ పొడి క్లాత్‌తో స్క్రీన్‌ను శుభ్రం చేయాలి. దీంతో స్క్రాచ్‌లు తొల‌గిపోతాయి. అయితే ఈ ఆయిల్‌ను మ‌రీ ఎక్కువ‌గా ఉప‌యోగించ‌కూడ‌దు. లేదంటే స్క్రీన్‌పైనంతా జిడ్డు జిడ్డుగా మారుతుంది.

Egg and potassium aluminum sulfate

Egg and potassium aluminum sulfate

యాహూ చెప్పిన వివరాల ప్రకారం ఎగ్ లో ఉండే తెల్లని సొన potassium aluminum sulfate కలిపి స్క్రాచ్‌ల‌పై రాయడం ద్వారా అవి తొలగిపోతాయి. దీనికి మీరు microfiber clothని ఉపయోగించాల్సి ఉంటుంది.

Baby powder

Baby powder

పిల్లలకు వాడే బేబీ పౌడర్ ని నీటిలో కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. ఆ తర్వాత మీ ఫోన్ మీద ఎక్కడైతే స్క్రాచ్‌ల‌ు ఉన్నాయో వాటి పైన దాన్ని అప్లయి చేయాలి. అప్పుడు ఆ గీతలు పోయి మీ ఫోన్ పాతరూపును సంతరించుకునే అవకాశం ఉంది.

వాజ‌లిన్

వాజ‌లిన్

శ‌రీరానికి రాసుకునే వాజ‌లిన్ కూడా పైన చెప్పిన వెజిట‌బుల్ ఆయిల్‌లాగే ప‌నిచేస్తుంది. విధానం కూడా సేమ్ అంతే. ఇది కూడా డివైస్ స్క్రీన్‌పై ప‌డిన గీత‌ల‌ను తొల‌గిస్తుంది.

ఎరేజ‌ర్‌

ఎరేజ‌ర్‌

పిల్ల‌లు వాడే ఎరేజ‌ర్‌తో కూడా మొబైల్ స్క్రీన్ గీత‌ల‌ను, స్క్రాచ్‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. కొంత త‌డిగా ఉన్న కాట‌న్ క్లాత్‌ను తీసుకుని డివైస్ స్క్రీన్‌పై తుడ‌వాలి. అది ఆరిపోగానే ఎరేజ‌ర్‌తో సున్నితంగా గీత‌ల‌ను చెరిపివేసిన‌ట్టు రాయాలి. దీంతో ఆ గీత‌లు తొల‌గిపోతాయి.

Best Mobiles in India

English summary
How to Remove Scratches From Your Phone More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X