WhatsApp గ్రూపులో ఇతరులకు తెలియకుండా ప్రైవేట్‌గా ప్రత్యుత్తరం ఇవ్వడం ఎలా?

|

వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడటం మరియు వారితో చాట్ చేయడం మరింత సులభం అయింది. వాట్సాప్ గ్రూప్ ఫీచర్ అనేది ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి సమయంలో స్నేహితులు మరియు ప్రియమైనవారితో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి బాగానే సహాయపడుతున్నది. ఈ వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను జోడిస్తూనే ఉంది.

How to Reply Privately Without know Others in the WhatsApp group?

వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం ఇటీవల తన వినియోగదారులకు కొత్తగా గ్రూపులోని ఏదైనా చాట్‌కు ప్రైవేట్‌గా రిప్లయ్ ఇచ్చే మార్గాన్ని జోడించింది. ఈ ఫీచర్ సాయంతో గ్రూపులోని సభ్యులతో వ్యక్తిగత స్థాయిలో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వవచ్చు. వాట్సాప్‌లోని గ్రూపులోని ఏదైనా మెసేజ్ కు మరొకరికి తెలియకుండా ప్రైవేట్‌గా వారికి మాత్రమే ప్రత్యుత్తరం ఎలా ఇవ్వవచ్చో చెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

వాట్సాప్‌ గ్రూపులో ఎవరికైనా ప్రైవేట్‌గా ప్రత్యుత్తరం ఇచ్చే మార్గాలు

How to Reply Privately Without know Others in the WhatsApp group?

*** మొదట వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి ఆపై గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేయండి.

*** తరువాత గ్రూప్ చాట్‌లో ప్రైవేట్‌గా స్పందించాలనుకుంటున్న మెసేజ్ మీద ఎక్కువసేపు నొక్కి ఉంచాలి.

*** తరువాత కుడి వైపున కనిపించే మూడు చుక్కలను ఎంచుకోండి.

*** తరువాత అందులో కనిపించే 'రిప్లయ్ ప్రైవేట్' ఎంపికపై క్లిక్ చేయండి.

*** మీరు ప్రైవేట్ గా ప్రత్యుత్తరం ఇవ్వాలనుకునే మెసేజ్ యొక్క కాంటాక్ట్ నెంబర్ విండోలో కనిపిస్తుంది.

*** మీరు మెసేజ్ ను టైప్ చేసి 'సెండ్' ఎంపిక మీద నొక్కండి

Best Mobiles in India

English summary
How to Reply Privately Without know Others in the WhatsApp group?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X