IRCTC పాస్‌వర్డ్ మర్చిపోయారా.. ఈ పద్ధతిలో సులభంగా కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు..!!
భారతీయ రైల్వేలో గతంతో పోలిస్తే గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. స్టేషన్ ల అభివృద్ధి సహా రైళ్లలో ప్రయాణికుల కోసం సౌకర్యాలను మెరుగుపరిచారు. టికెటింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేసుకున్నాయి. ముఖ్యంగా IRCTC ద్వారా టికెట్ల బుకింగ్ ఎంతో సౌకర్యవంతగా మారింది. దీంతోపాటు ఇతర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాం ల ద్వారా కూడా బుకింగ్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే అవసరమైన సందర్భాల్లో ( How to Reset IRCTC password ) ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో IRCTC అకౌంట్‌ను క్రియేట్ చేసుకుంటాం.
ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ :
అయితే కొన్ని సందర్భాల్లో యూజర్ నేమ్, పాస్ వర్డ్‌ను మర్చిపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు పాస్‌వర్డ్ కాలపరిమితి ముగిసిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో IRCTC ఆన్‌లైన్ ద్వారా పాస్‌వర్డ్‌ను మళ్లీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్ చేయబడిన ఈమెయిల్ ఐడీ లేదా మొబైల్ నంబర్ అవసరం అవుతాయి. కొత్త పాస్ట్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

పాస్‌వర్డ్ ఎలా మార్చడం :
తొలుత IRCTC వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం లాగిన్ సెక్షన్ వద్ద Forgot Password పైన క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ యూజర్ నేమ్ నమోదు చేయాలి. అనంతరం Next పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అక్కడ కనిపించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలి :
ఈ ప్రశ్నలు, జవాబులను అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో నమోదు చేసి ఉంటారు. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన తర్వాత.. IRCTC వెబ్ సైట్ తో రిజిస్టర్ అయిన మెయిల్ కు కొన్ని సూచనలు వస్తాయి. ఆ లింక్‌పైన క్లి్క్ చేసి పాస్‌వర్డ్ ను మళ్లీ క్రియేట్ చేసుకోవచ్చు.
ఫోన్ నంబర్ ద్వారా కూడా మార్చుకోవచ్చు :
మొబైల్ నంబర్ ద్వారా కూడా IRCTC పాస్‌వర్డ్ ను క్రియేట్ చేసుకోవచ్చు. అనంతరం మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని నమోదు చేయాలి. ఆ తర్వాత కొత్త పాస్‌వర్డ్ ను నమోదు చేయాలి. అక్కడ కనిపించిన Captcha ను నమోదు చేసి submit చెయ్యాలి. కొద్ది క్షణాల్లోనే మీ కొత్త పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ కావచ్చు.
అయితే పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసిన సమయంలో బలమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్‌లతో బలమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. యూజర్‌ల ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ల ద్వారా పాస్‌వర్డ్‌ను మార్చేందుకు వీలుకాకుంటే IRCTC కస్టమర్ కేర్ సిబ్బందితో మాట్లాడి, సమస్య పరిష్కరించుకోవచ్చు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications