మీ IRCTC పాస్‌వర్డ్ మర్చిపోయారా.. అయితే ఈ విధంగా కొత్త పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోండి..!
రైల్వే టికెట్ ల రిజర్వేషన్ కోసం గతంలో రైల్వే కౌంటర్‌లలో గంటల తరబడి క్యూ లో నిల్చోవాల్చి వచ్చేది. అయితే IRCTC పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. ఈ పరిస్థితితో కొంత మార్పు వచ్చింది. రైల్వే టికెట్లు కోసం నేరుగా ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకొనే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. IRCTC యాప్, వెబ్‌సైట్ ద్వారా ప్రస్తుతం టికెట్ల బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అనేక మంది సోషల్ మీడియా సహా వివిధ రకాల అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. ఫలితంగా పాస్ట్‌వర్డ్‌లు మర్చిపోతున్నారు.
IRCTC అకౌంట్ పాస్‌వర్డ్ లను ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ద్వారా Reset చేసుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఐఆర్‌సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసే సమయంలో ఉపయోగించిన ఫోన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ యాక్టివ్‌గా ఉండాలి. వాటికి వచ్చిన OTP ద్వారా కొత్త పాస్ట్‌వర్డ్ ను ఏర్పాటు చేసుకోవాలి.

ఈ-మెయిల్ ఐడీ ద్వారా IRCTC పాస్‌వర్డ్ ను ఎలా మార్చుకోవాలి :
IRCTC వెబ్‌సైట్‌లోకి వెళ్లి Forgot Password పైన క్లిక్ చేయాలి. అనంతరం యూజర్ నేమ్ ఎంటర్ చేసి Next step పైన క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ప్రశ్నాలకు సరైన సమాధానం ఇవ్వడం ద్వారా, మీ అకౌంట్‌ను రికవరీ చేయవచ్చు. అనంతరం కొత్త పాస్‌వర్డ్ ను క్రియేట్ చేసుకోవచ్చు.
రిజస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ద్వారా అకౌంట్‌ను ఎలా రికవరీ చేయాలి?
IRCTC వెబ్‌సైట్‌లోకి వెళ్లి Forgot Password పైన క్లిక్ చేయాలి. అనంతరం యూజర్‌నేమ్ మరియు captcha కోడ్‌ను ఎంటర్ చేయాలి. అనంతరం పాస్‌వర్డ్ రికవరీ పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. మీ మొబైల్ కు OTP వస్తుంది. OTP ధ్రువీకరణ అనంతరం కొత్త పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.
ఇటీవల రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 120 రోజులు ముందుగా రైల్వే టికెట్ లు బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉండగా.. ఆ గడువును 60 రోజులకు తగ్గించింది. ఈ కొత్త నిర్ణయం నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం వెనుక కారణాలను కూడా IRCTC వెల్లడించింది.
120 రోజుల ముందు టికెట్లను రిజర్వ్ చేసుకున్న వారిలో 21 శాతం మంది తమ టికెట్ లను క్యాన్సిల్ చేసుకుంటున్నారని తెలిపింది. దీంతోపాటు మరో 5 శాతం మంది టికెట్లు ఉన్నా.. ప్రయాణాలు చేయడం లేదని వెల్లడించింది. ఈ కొత్త నిర్ణయంతో అవసరం అయిన వారికి మాత్రమే టికెట్లు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపింది.
దీంతోపాటు లగేజీ పైనా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై అక్టోబర్ 31న రైల్వే శాఖ నుంచి ప్రకటన వచ్చింది. పరిమితికి మించి లగేజీ తీసుకువస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. దీంతోపాటు ఉచిత లగేజీ విషయంలోనూ అనుమతించిన దాని కంటే ఎక్కువ తీసుకొస్తే జరిమానా విధిస్తామని ప్రయాణికులకు హెచ్చరించింది.


Click it and Unblock the Notifications








