Android లేదా iOS డివైజ్ లలో నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేయండిలా!

|

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు కొన్ని సార్లు అకస్మాత్తుగా Wi-Fi కనెక్షన్ లో అంతరాయాలను ఎదుర్కొనవచ్చు. లేదా మీరు స్పీకర్ లేదా మీ హెడ్‌ఫోన్‌లతో మీ ఫోన్ ను పెయిర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ బ్లూటూత్ పని చేయకపోవచ్చు. ఇలా మీరు మీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొనడం జరుగుతుంది. అయితే, అలాంటప్పుడు ఓ చిన్న పని చేయడం ద్వారా సమస్యను పరిష్కారం చేసుకోవచ్చు.

 
Android

అదేంటంటే. మీ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా మీరు ఆయా సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. అయితే, ఇప్పుడు Android లేదా iOS డివైజ్ లలో మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఎలా రీసెట్ చేయవచ్చో ఇక్కడ అందిస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు కూడా ఓ లుక్కేయండి.

 

Androidలో నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి
Androidలో, ప్రతి డివైజ్ కు నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ ప్రక్రియ కొద్దిగా భిన్నంగా ఉంటుంది. కానీ మీరు Pixel లేదా Samsung పరికరాల కోసం ఉపయోగించే ప్రక్రియను అనుసరిస్తే, మీరు బ్రాండ్‌తో సంబంధం లేకుండా మీ Android ఫోన్‌లో నెట్‌వర్క్ సెట్టింగ్‌లను సులభంగా చేసుకోవచ్చు.

Android

శామ్సంగ్ మొబైల్ లో ఈ విధంగా నెట్ వర్క్ రీసెట్ చేయండి;
స్టెప్ 1: మీ Samsungలో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: జనరల్ మేనేజ్ మెంట్ సెక్షన్ పై నొక్కండి.
స్టెప్ 3: ఆ తర్వాత రెస్ట్ అనే ఆప్షన్ పై నొక్కండి.
స్టెప్ 4: అనంతరం రీసెట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లపై నొక్కండి.

Android

పిక్సెల్ మొబైల్ లో ఈ విధంగా నెట్ వర్క్ రీసెట్ చేయండి;
స్టెప్ 1: మీ Google Pixel ఫోన్‌లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: దిగువన ఉన్న సిస్టమ్‌ ఆప్షన్ పై నొక్కండి.
స్టెప్ 3: రీసెట్ ఎంపికలపై నొక్కండి.
స్టెప్ 4: Wi-Fi, మొబైల్ & బ్లూటూత్ రీసెట్ చేయి ఎంచుకోండి.
స్టెప్ 5: చివరగా, రీసెట్ సెట్టింగ్‌లను నొక్కండి.

Android

iPhone లేదా iPadలో నెట్‌వర్క్ సెట్టింగ్‌లను ఈ విధంగా రీసెట్ చేయండి;
స్టెప్ 1: మీ iPhoneలో సెట్టింగ్‌లను తెరవండి.
స్టెప్ 2: మీరు జనరల్‌ ఆప్షన్ ను కనుగొనడం కోసం కిందికి స్క్రోల్ చేయండి, ఆ తర్వాత, దానిపై నొక్కండి.
స్టెప్ 3: జనరల్ ట్యాబ్‌ను తెరిచిన తర్వాత, దిగువకు స్క్రోల్ చేయండి మరియు ఐఫోన్‌ను బదిలీ లేదా రీసెట్ చేయండి అనే ఆప్షన్ పై నొక్కండి.
స్టెప్ 4: అనంతరం, రెస్ట్ అనే ఆప్షన్ పై నొక్కండి.
స్టెప్ 5: చివరగా, రెస్ట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లపై క్లిక్ చేసి, మీ iPhone లేదా iPad పాస్‌కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ధృవీకరించండి.
మీరు పాస్‌కోడ్‌ను ఎంటర్ చేసి, నిర్ధారించిన తర్వాత, మీ iPhone నెట్‌వర్క్ సెట్టింగ్‌లు రీసెట్ చేయబడతాయి.

ఈ విధంగా మీరు మీ Android మరియు iOS పరికరాలలో నెట్‌వర్క్ సెట్టింగ్‌లను సులభంగా రీసెట్ చేయవచ్చు. మీరు రీసెట్ చేసిన తర్వాత, మీ అన్ని సేవ్ చేసిన నెట్‌వర్క్‌లు లేదా జత చేసిన పరికరాలు లేదా VPN కాన్ఫిగరేషన్‌లు డిసప్పియర్ అవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి రీసెట్ తర్వాత మీరు ప్రతిదీ కొత్తగా కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది.

Android

అదేవిధంగా, వాట్సాప్ లో బెస్ట్ క్వాలిటీతో ఫొటోలను సెండ్ చేసే ఫీచర్ గురించి తెలుసుకుందాం;

స్టెప్ 1; ముందుగా WhatsApp ఓపెన్ చేయాలి.
స్టెప్ 2; ఆ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లాలి.
స్టెప్ 3; ఇప్పుడు, స్టోరేజ్ మరియు డేటాకు వెళ్లి, "మీడియా అప్‌లోడ్ నాణ్యత" సెక్షన్ లోకి నావిగేట్ చేయండి
స్టెప్ 4; అనంతరం అక్కడ "ఫోటో అప్‌లోడ్ క్వాలిటీ" అనేది "ఆటో"కి సెట్ చేయబడి ఉంటుంది.
స్టెప్ 5; దాన్ని మీరు బెస్ట్ క్వాలిటీకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
స్టెప్ 6; అలా దాన్ని బెస్ట్ క్వాలిటీకి మార్చడం ద్వారా మీరు ఫొటోలను క్వాలిటీ తగ్గకుండా సెండ్ చేయడానికి అవకాశాన్ని పొందుతారు.

ఈ ప్రక్రియ మిమ్మల్ని మెరుగైన క్వాలిటీతో చిత్రాలను ఇతరులకు పంపేందుకు అనుమతిస్తుంది. కాబట్టి యూజర్లు ఈ ప్రక్రియను ఉపయోగించుకుని బెస్ట్ క్వాలిటీ ఇమేజ్ సెటింగ్స్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to reset Network settings on android or iphone smartphones. check here.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X