Home
How to

మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా..?

ఫోన్ హ్యాంగ్ అవటానికి అనేక కారణాలు ఉన్నాయి.

By Sivanjaneyulu Bommu

అది సామ్‌సంగ్ ఫోన్ కావొచ్చు, యాపిల్ ఫోన్ అయి ఉండొచ్చు. గంటల తరబడి నిరంతరాయంగా వాడుతూ ఉంటే ఏ ఫోన్ అయినా సరే ఏదో ఒక సందర్భాల్లో హ్యాంగ్ అవ్వక తప్పదు. ర్యామ్ పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావటం వల్ల ఫోన్ హ్యాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. ఏదేమైనప్పటికి ఫోన్ ఫ్రీజ్ లేదా హ్యాంగ్ అవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అవెంటనేది వెంటనే చెప్పలేం. స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవటానికి గల 10 ప్రధాన కారణాలు అదే సమయంలో వాటిని నివారించే చిట్కాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టిప్ 1

టిప్ 1

ర్యామ్ పై అధిక ఒత్తిడి ఏర్పడటం వల్ల హ్యాంగింగ్ సమస్య తలెత్తే అవకాశముంది. కాబట్టి, ర్యామ్ స్పేస్‌ను చెక్ చేసుకోకుండా ఎలాంటి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోకుండి. ఒకవేళ మీ ఫోన్ తక్కువ ర్యామ్ మెమరీతో రన్ అవుతున్నట్లయితే అన్ని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేసేయండి.

టిప్ 2

టిప్ 2

ఫోన్ బ్యాక్ గ్రౌండ్‌లో నిరుపయోగంగా రన్ అవుతోన్న యాప్స్‌ను టాస్క్ మేనేజర్ సహాయంతో క్లోజ్ చేయటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

టిప్ 3

టిప్ 3

ఫోన్ ఇంటర్నల్ మెమరీలోని డేటాను ఎప్పటికప్పుడు ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేసుకోవటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

టిప్ 4

టిప్ 4

 బ్రౌజ్ చేస్తున్న సమయంలో మల్టిపుల్ టాబ్స్‌ను ఓపెన్ చేయకండి. ఒత్తిడితో కూడిన మల్టీ టాస్కింగ్ ప్రాసెసర్ వేగాన్ని తగ్గించివేసి ర్యామ్ పై ఒత్తిడిని పెంచుతుంది. ఈ కారణంగా మీ ఫోన్ హ్యాంగ్ అయ్యే ప్రమాదముంది.

టిప్ 5

టిప్ 5

మీరు తక్కువ ఖరీదు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నట్లయితే ఒకేసారి మల్టిపుల్ యాప్స్‌ను మీ ఫోన్‌లో రన్ చేయకండి.

టిప్ 6

టిప్ 6

ఫోన్‌లోని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోండి. మాల్వేర్లు స్మార్ట్‌ఫోన్ పనితీరును నెమ్మదింప చేసి, ఆ తరువాత హ్యాంగింగ్ కు దారీతీసే అవకాశముంది.

టిప్ 7

టిప్ 7

మీ ఫోన్‌లో యాప్స్ సృష్టించే cacheని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

టిప్ 8

టిప్ 8

మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతున్నట్లయితే సమస్య ఫోన్ సాఫ్ట్‌వేర్‌ది అయి ఉండొచ్చు. కాబట్టి ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

టిప్ 9

టిప్ 9

ఫోన్‌లో పనికిరాని ఫైళ్లను ఎప్పటికప్పుడు తొలగించటం ద్వారా హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

టిప్ 10

టిప్ 10

ఇవన్ని పాటించినప్పటికి హ్యాంగింగ్ సమస్య నుంచి బయటపడనట్లయితే ఫోన్‌ను సర్వీసింగ్ సెంటర్‌కు తరలించండి. 

Best Mobiles in India

English summary
How to resolve the hanging problems of an Android SmartPhone. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X