Home
How to

Smartphone Hanging : మీ స్మార్ట్‌ఫోన్ తరచూ హ్యాంగ్‌ అవుతోందా.. ఈ టిప్స్‌ పాటించండి..!

స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతం అనేక మంది వినియోగిస్తున్నారు. అయితే కొన్ని సార్లు స్మార్ట్‌ఫోన్‌లు హ్యంగ్‌ అవుతుంటాయి. అంటే ఏదైనా యాప్‌ ఓపెన్‌ చేయడం లేదా ఇతర టాస్క్‌లు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటాయి. అత్యవసరంగా ఫోన్‌ లేదా మెసేజ్‌ చేయడం, ముఖ్యమైన పనులను పూర్తి చేసే సమయాల్లో ఫోన్‌ హ్యాంగ్ (Smartphone Hanging) కావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం.

ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? :
స్మార్ట్‌ఫోన్ నెమ్మదిగా స్పందిస్తున్నా ఇబ్బంది పడుతుంటాం. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కొంత మందికి సరైన అవగాహన లేకపోవడంతో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. అయితే స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు హ్యాంగ్‌ అవుతుంటాయి. మరియు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి.

smartphone hanging

ర్యామ్ కూడా కారణం :
స్మా్ర్ట్‌ఫోన్‌ హ్యాంగ్‌ అయ్యేందుకు అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ర్యామ్ కారణంగా ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. స్మార్ట్‌ఫోన్ మెరుగైన పనితీరు కనబరిచేందుకు సరిపడా ర్యామ్ లేకుంటే ఫోన్‌ ఎక్కువసార్లు హ్యాంగ్‌ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ లో 4GB లేదా అంతకంటే తక్కువ ర్యామ్ ఉన్న సందర్భాల్లో మల్టీ టాస్కింగ్‌ కోసం ఉపయోగిస్తుంటే.. స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్‌ మెమొరీని క్లీయర్‌ చేస్తుండాలి. ఫలితంగా ఫోన్ పనితీరులో కొంత మార్పు వస్తుంది.

స్టోరేజీ ఫుల్‌ అయితే :
స్మార్ట్‌ఫోన్‌ హ్యంగ్‌ అయ్యేందుకు ఫోన్ స్టోరేజీ కూడా ఒక కారణంగా. ఫోన్‌ అంతర్గత స్టోరేజీ ఫుల్‌ అయితే.. తరచూ ఫోన్‌ హ్యాంగ్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఫోన్‌ స్టోరేజీలో అవసరం లేని యాప్స్‌, ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు తొలగించాలి.

ఇలా చేయండి :
ఫోన్‌ స్టోరేజీలో డిలీట్‌ చేయలేని ఫైల్స్ ఉంటే.. గూగుల్‌ డ్రైవ్‌, icloud వంటి క్లౌడ్‌ స్టోరేజీ ప్లాట్‌ఫాంలో సేవ్‌ చేసుకోవాలి. ఫలితంగా ఫోన్‌ స్టోరేజీ చాలా ఖాళీ అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు చేస్తుంటే ఫోన్‌ Hang కాకుండా మెరుగైన పనితీరును అందిస్తుంది.

దీంతోపాటు యాప్‌ Cache తోపాటు Temp ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్‌ చేసుకోవాలి. ఫలితంగా ఫోన్‌ పనితీరు మెరుగుపడుతుంది. దీంతోపాటు స్టోరేజీని అవసరం లేని ఫైల్స్‌ను కూడా తొలగించాలి. ఇలా చేయడం వల్ల ఫోన్‌ స్టోరేజీ చాలా వరకు ఖాళీ అవుతుంది.

బగ్స్ కూడా కారణం :
స్మార్ట్‌ఫోన్ బగ్స్ కారణంగా కూడా ఫోన్ హ్యాంగ్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బగ్స్‌ సమస్య పరిష్కారం కోసం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు స్మార్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ను అందిస్తున్నాయి. ఈ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా కూడా ఫోన్‌ హ్యాంగ్‌ కాకుండా చూడవచ్చు.

* దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కొన్ని సంవత్సరాల వరకు ఆండ్రాయిడ్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా ఇన్‌స్టాల్‌ చేయడం ద్వారా స్మార్ట్‌ఫోన్ మెరుగైన పనితీరు అందించేలా చూడవచ్చు.

* కనీసం వారానికి ఒకసారి అయిన స్మార్ట్‌ఫోన్ ఆఫ్‌ చేసి ఆన్‌ చేయాలి. ఇలా చేయడం ద్వారా కొన్ని సమస్యలు ఆటోమేటిక్‌గా పరిష్కారం అవుతాయి.

* స్మార్ట్‌ఫోన్‌లో అవసరాలకు అనుగుణంగా అనేక రకాల యాప్స్‌ను ఉపయోగిస్తుంటాం. అనంతరం వాటిని ఇన్‌స్టాల్‌ చేయడం మర్చిపోతుంటాం. స్మార్ట్‌ఫోన్‌లోని అవసరం లేని యాప్స్‌ కొన్నిసార్లు బ్యాగ్రౌండ్‌లో పనిచేస్తుంటాయి. దీని వల్ల డేటాతోపాటు ఫోన్‌ పనితీరుపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఫోన్‌లోని వినియోగించని యాప్స్‌ను డిలీట్‌ చేయాలి.

Best Mobiles in India

English summary
how to resolve when your smartphone hanging regularly here are the best tips in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X