Google Drive డిస్క్‌లో డెలిట్ చేసిన ఫైల్‌లను తిరిగి పొందడం ఎలా?

|

వినియోగదారులు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ అయిన గూగుల్ డ్రైవ్ లో మీకు సంబందించిన అన్నిరకాల ఫైల్‌లను ఆన్‌లైన్‌లో సేవ్ చేయవచ్చు మరియు యాక్సెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ సర్వీస్ మొబైల్ ఫోన్‌లు, టాబ్లెట్‌లు మరియు PCలతో సహా అన్ని రకాల పరికరాలను సమకాలీకరిస్తుంది. గూగుల్ డిస్క్ కేవలం ఫైల్ స్టోరేజ్ కంటే మరిన్ని ఫీచర్‌లను అందిస్తుంది. వినియోగదారులు ఏ డివైస్ నుండి అయినా తమ యొక్క ఫైల్‌లను పొందవచ్చు, సవరించవచ్చు మరియు వారు ఎంచుకున్న వారితో షేర్ కూడా చేయవచ్చు. మీరు డ్రైవ్ నుండి మీ ఫైల్‌లను అనుకోకుండా తొలగించినట్లయితే కనుక మీరు వాటిని 30 రోజులలోపు తిరిగి పొందవచ్చు. 30 రోజుల తర్వాత ట్రాష్‌లోని ఫైల్‌లు స్వయంచాలకంగా శాశ్వతంగా తొలగించబడతాయి. మీరు అనుకోకుండా తొలగించిన ఫైల్‌లను తిరిగి పొందడానికి కింద తెలిపే దశల వారీ గైడ్ ను అనుసరించండి.

డెస్క్‌టాప్ ఉపయోగించి గూగుల్ డిస్క్‌లో డెలిట్ చేసిన ఫైల్‌లను పొందే విధానం

డెస్క్‌టాప్ ఉపయోగించి గూగుల్ డిస్క్‌లో డెలిట్ చేసిన ఫైల్‌లను పొందే విధానం

స్టెప్ 1 - మీ కంప్యూటర్‌లో గూగుల్ డ్రైవ్ ని ఓపెన్ చేసి అందులో ట్రాష్‌ విభాగానికి వెళ్లండి. (తొలగించబడిన పాత లేదా సరికొత్త ఫైల్‌లను కనుగొనడానికి మీరు మీ ట్రాష్ చేసిన ఫైల్‌లను ట్రాష్ చేసిన తేదీ ద్వారా కూడా క్రమబద్ధీకరించవచ్చు).

స్టెప్ 2 - మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫైల్‌పై కుడి క్లిక్ చేయండి.

స్టెప్ 3 - రిస్టోర్ ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 4 - మీరు రిస్టోర్ చేసిన ఫైల్‌లను ముందు మీరు డెలిట్ చేసిన వాటి అసలు స్థానంలో కనుగొనవచ్చు. లేదా వాటి అసలు స్థానంలో లేకుంటే మై డిస్క్‌లో చూడండి.

 

ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ డిస్క్‌లో తొలగించబడిన ఫైల్‌లను రిస్టోర్ చేసే విధానం

ఆండ్రాయిడ్ ఫోన్ లోని గూగుల్ డిస్క్‌లో తొలగించబడిన ఫైల్‌లను రిస్టోర్ చేసే విధానం

స్టెప్ 1 - మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో 'Google Drive' యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2 - ఎడమవైపు ఎగువ మూలలో ఉన్న మూడు బార్‌లపై నొక్కండి.

స్టెప్ 3 - ఆపై బిన్/ట్రాష్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4 - ఆపై మీరు రిస్టోర్ చేయాలనుకుంటున్న ఫైల్ పక్కన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

స్టెప్ 5 - రిస్టోర్ ఎంపికపై నొక్కండి.

 

iOS ఉపయోగించి Google డిస్క్‌లో తొలగించబడిన ఫైల్‌లను రిస్టోర్ చేసే విధానం
 

iOS ఉపయోగించి Google డిస్క్‌లో తొలగించబడిన ఫైల్‌లను రిస్టోర్ చేసే విధానం

స్టెప్ 1 - మీ iOS ఫోన్‌లో గూగుల్ డిస్క్ యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2 - ఎడమవైపు ఎగువ మూలలో ఉన్న మూడు బార్‌లపై నొక్కండి.

స్టెప్ 3 - ఆపై బిన్/ట్రాష్ ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 4 - ఆపై మీరు తిరిగి పొందాలనుకుంటున్న ఫైల్ పక్కన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.

స్టెప్ 5 - తరువాత రిస్టోర్ ఎంపికపై నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Restore Deleted Files in Google Drive

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X