Home
How to

వారంటీ దెబ్బతినకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను Root చేయటం ఎలా?

మీరో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేసినట్లయితే, ఆ ఫోన్‌కు మీరే అడ్మిన్‌గా వ్యవహరించవచ్చు.

By Sivanjaneyulu Bommu

రూటింగ్ అనే పదాన్ని తరచూ మనం వింటుంటాం. ఆండ్రాయిడ్ రూటింగ్ అనే ప్రాసెస్ ద్వారా యూజర్ తన స్మార్ట్‌ఫోన్‌లోని ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పూర్తి నియంత్రణ సాధించే వీలుంటుంది. మీరో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేసినట్లయితే, ఆ ఫోన్‌కు మీరే అడ్మిన్‌గా వ్యవహరించవచ్చు. మరింత క్లియర్ కట్‌గా చెప్పాలంటే...

వారంటీ దెబ్బతినకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను Root చేయటం ఎలా?

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో Pre-Installed Appsను తొలగించటం ఎలా?

ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో కూడా రెండు అకౌంట్‌లు ఉంటాయి. వాటిలో ఒకటి అడ్మినిస్ట్రేటర్‌ది అయితే మరొకటి గెస్ట్ అకౌంట్. ఫోన్ తయారీదారుడు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌ను లాక్ చేసి గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే యూజర్‌కు అందుబాటులో ఉంచుతాడు. అంటే మనం గెస్ట్ అకౌంట్‌ను మాత్రమే వినియోగించుకోగలం. ఇక్కడ రూటింగ్ అంటే ఫోన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్‌లోకి ప్రవేశించటమే. ఫోన్‌ను రూటింగ్ చేయటం వలన ఆపరేటింగ్ సిస్టంను మార్చేయవచ్చు. అయితే, ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూట్ చేయటం ద్వారా వారంటీని మనం కొల్పోవల్సి వస్తుంది. ఆండ్రాయిడ్ మిమ్మల్ని జెన్యున్ యూజర్‌గా గుర్తించదు. అయితే, ఓ థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించటం ద్వారా, ఎలాంటి వారంటీ దెబ్బతినకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేసుకోవచ్చు. ఆ ప్రక్రియను ఇప్పుడు తెలుసుకుందాం...

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా iRoot అనే ఆండ్రాయిడ్ రూటింగ్ సాఫ్ట్‌వేర్‌ను మీ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ఒక్క ప్రోగ్రామ్ మాత్రమే వారంటీ దెబ్బతినకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేయగలదు.

స్టెప్ 2

స్టెప్ 2

పీసీలోకి సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిన తరువాత ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే పోగ్రామ్‌ను లాంచ్ చేయండి. ఈ స్ర్కీన్ షాట్ మీకు కనిపిస్తుంది.

స్టెప్ 3

స్టెప్ 3

ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లో USB debuggingను ఎనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు ముందుగా, మీరు మీ ఫోన్ లోని developer optionను ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది. ఫోన్ Settings -> About Phone -> Build Number పై 7 నుంచి 10 సార్లు టాప్ చేయటం ద్వారా developer option ఎనేబుల్ అవుతుంది.

స్టెప్ 4

స్టెప్ 4

ఇప్పుడు మరోసారి ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసినట్లయితే developer option మీకు కనిపిస్తుంది. డెవలపర్ ఆప్షన్‌ ఓపెన్ చేసినట్లయితే, మీకు USB Debugging పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఎనేబుల్ చేసుకోండి.

స్టెప్ 5

స్టెప్ 5

ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను యూఎస్బీ కేబుల్ ద్వారా పీసీకి కనెక్ట్ చేయండి. iRoot టూల్ మీ డివైస్‌ను డిటెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయండి.

స్టెప్ 6

స్టెప్ 6

మీ ఫోన్ డిటెక్ట్ అయిన వెంటనే iRoot సాఫ్ట్‌వేర్ పేజీలోని Root button యాక్టివేట్ అవుతుంది. అంటే, మీ ఫోన్ రూటింగ్‌కు సిద్దంగా ఉన్నట్లన్నమాట. యాక్టివేట్ అయిన రూట్ బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 7

స్టెప్ 7

రూటింగ్ ప్రక్రియ ముగిసేందుకు కొద్ది నిమిషాల పడుతుంది. ఈ సమయంలో రెండు మూడు సార్లు ఫోన్ రీస్టార్ట్ అవుతుంది.

Best Mobiles in India

English summary
How To Root Android Without Risking Android Warranty. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X