Microsoft Outlook 365లో ఇమెయిల్‌ను వర్డ్ ఫైల్‌గా సేవ్ చేయడం ఎలా?

|

మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ ని ఉపయోగించడం కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. ప్రత్యేకించి మొదటిసారి వినియోగించే వినియోగదారులకు మరింత కష్టంగా ఉంటుంది. కానీ ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా వినియోగదారులకు తమ యొక్క రోజువారీ పనులను మరింత సులభంగా చేయడానికి వీలుగా అనేక రకాల ఫీచర్లతో లోడ్ చేయబడి ఉంది. మీలో ఎవరైనా మొదటిసారి మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ ని ఉపయోగిస్తుంటే కనుక మీరు ఇతర వినియోగదారుల క్యాలెండర్ ఎంట్రీని తనిఖీ చేయడానికి వీలుగా ఉండే సులభమైన గైడ్ ని అనుసరించండి. అలాగే మీరు మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ నుండి ఇమెయిల్‌ను మీ PCలో ఫైల్‌గా ఎలా సేవ్ చేయాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద తెలిపే విధానాలను అనుసరించండి.

మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ నుండి ఇమెయిల్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా సేవ్ చేసే విధానం

మైక్రోసాఫ్ట్ ఔట్ లుక్ నుండి ఇమెయిల్‌ను వర్డ్ డాక్యుమెంట్‌గా సేవ్ చేసే విధానం

స్టెప్ 1: ముందుగా మీరు సేవ్ చేయాలనుకుంటున్న మెసేజ్ ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఆ తర్వాత ఫైల్ ట్యాబ్‌పై క్లిక్ చేసి 'సేవ్ యాజ్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్‌, సెలెక్ట్ ఫోల్డర్‌, ఆపై మీరు ఫైల్‌ను సేవ్ చేయాలనుకుంటున్న ఆ ఎంచుకున్న ఫోల్డర్‌లోని స్థానాన్ని ఎంచుకోండి.

స్టెప్ 4: ఫైల్ బాక్స్ లో ఫైల్ కోసం ఏదైనా పేరును టైప్ చేయండి.

స్టెప్ 5: సేవ్ యాజ్ టైప్ లిస్ట్‌లో HTMLని ఎంచుకుని ఆపై సేవ్ ఎంపికను క్లిక్ చేయండి.

స్టెప్ 6: వర్డ్‌ని ఓపెన్ చేసి తరువాత ఫైల్‌ని ఎంచుకుని ఓపెన్ ఆప్షన్‌ను నొక్కండి.

స్టెప్ 7: మీరు స్టెప్ 4లో సేవ్ చేసిన HTML ఫైల్‌ను ఎంచుకోండి.

స్టెప్ 8: ఇప్పుడు చూస్ ఫైల్ > సేవ్ యాజ్ ఎంపికను ఎంచుకోండి. ఆపై సేవ్ ఎంచుకునే ముందు ఫైల్ రకం డ్రాప్-డౌన్ నుండి వర్డ్ డాక్యుమెంట్‌ని ఎంచుకోండి.

 

PCలో Microsoft Outlook నుండి ఇమెయిల్‌ను ఫైల్‌గా సేవ్ చేసే విధానం

PCలో Microsoft Outlook నుండి ఇమెయిల్‌ను ఫైల్‌గా సేవ్ చేసే విధానం

స్టెప్ 1: మీరు సేవ్ చేయాలనుకుంటున్న మెసేజ్ ని ఓపెన్ చేయడానికి రెండుసార్లు క్లిక్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు ఫైల్ మెనుపై క్లిక్ చేసి ఆపై సేవ్ యాజ్ ఎంపికను క్లిక్ చేయండి.

స్టెప్ 3: సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్‌లో ఏదైనా ఫోల్డర్‌ను ఎంచుకోండి. ఆపై మీరు ఫైల్‌ను సేవ్ చేయాలనుకునే ఫోల్డర్‌ యొక్క స్థానాన్ని ఎంచుకోండి.

స్టెప్ 4: ఫైల్ కోసం బాక్స్ లో ఏదైనా పేరును టైప్ చేయండి.

స్టెప్ 5: సేవ్ యాజ్ టైప్ లిస్ట్‌లో అవసరాలకు అనుగుణంగా జాబితా నుండి ఫైల్ రకాన్ని ఎంచుకోండి.

స్టెప్ 6: మీ ఎంపికను నిర్ధారించండి.

 

Microsoft Outlook నుండి ఇమెయిల్‌ను బ్యాకప్ చేసే విధానం

Microsoft Outlook నుండి ఇమెయిల్‌ను బ్యాకప్ చేసే విధానం

స్టెప్ 1: Outlookని ఓపెన్ చేసి ఈ మార్గాన్ని అనుసరించండి: ఫైల్ > ఓపెన్ & ఎక్సపోర్ట్ > ఇంపోర్ట్ /ఎక్సపోర్ట్.

స్టెప్ 2: ఎక్సపోర్ట్ ఫైల్‌ ఎంపికని ఎంచుకోండి. తరువాత నెక్స్ట్ ఎంపికని ఎంచుకోండి.

స్టెప్ 3: Outlook డేటా ఫైల్ (.pst)ని ఎంచుకుని నెక్స్ట్ ఎంపికని ఎంచుకోండి.

స్టెప్ 4: మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న మెయిల్ ఫోల్డర్‌ను ఎంచుకుని తరువాత నెక్స్ట్ ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 5: మీ బ్యాకప్ ఫైల్ కోసం లొకేషన్ మరియు పేరును ఎంచుకుని ఆపై 'ఫినిష్' ఎంపికని ఎంచుకోండి.

స్టెప్ 6: మీరు మీ ఫైల్‌లకు ఎవరూ యాక్సెస్ చేయలేదని నిర్ధారించుకోవాలనుకుంటే పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, కంఫర్మ్ చేసి ఆపై 'Ok'ని ఎంచుకోండి.

 

Best Mobiles in India

English summary
How to Save an email as a Word File Document in Microsoft Outlook 365

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X