స్మార్ట్‌ఫోన్‌(ఐఫోన్&ఆండ్రాయిడ్‌) లో ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం ఎలా?

|

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ ను అధికంగా వినియోగిస్తున్నారు. తమకు కావలసిన మరియు తెలియని విషయాల గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ని ఆశ్రయిస్తున్నారు. మీరు వెబ్‌లో మీరు బుక్ చేసుకున్న టిక్కెట్‌లు, దేని గురించి అయినా సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు అవసరమైన మరియు ఆసక్తికరమైన కథనాన్ని చూడవచ్చు లేదా మీరు ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆసక్తికరమైన స్టోరీని ఎవరైనా మీకు పంపి ఉండవచ్చు. దీనిని ప్రస్తుతం చదవడానికి సమయం లేక తర్వాత చదవాలనుకుంటే కనుక దానిని PDFగా సేవ్ చేసుకోవచ్చు. వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో గొప్ప విషయమేమిటంటే మీరు PDFని సేవ్ చేసుకున్న తరువాత ఇంటర్నెట్ లేకుండా కూడా ఎప్పుడైనా దాన్ని చదవవచ్చు. అయితే మీరు మీ వెబ్ బ్రౌజర్‌లో చూసే ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయలేకపోతున్నారా? అయితే కింద ఉన్న దశలను అనుసరించడం ద్వారా సులభంగా సేవ్ చేయవచ్చు.

 
స్మార్ట్‌ఫోన్‌ లో ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం ఎలా?

ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్‌లో వెబ్‌పేజీని PDFగా సేవ్ చేసే విధానం

ఐఫోన్‌లో

1. మీరు PDFగా సేవ్ చేయాలనుకుంటున్న వెబ్‌పేజీని ఓపెన్ చేయండి.

2. దిగువన ఉన్న షేర్ బటన్‌పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మీరు షేర్ పాప్-అప్ విండో ఎగువన ఉన్న "ఆప్షన్" బటన్‌ మీద క్లిక్ చేయండి.

4. ఇందులో PDF ఎంపికని ఎంచుకుని 'Done' బటన్‌పై నొక్కండి.

5. చివరగా "Save it to Files" ఎంపికపై క్లిక్ చేయండి.

స్మార్ట్‌ఫోన్‌ లో ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం ఎలా?

ఈ పద్ధతితో మీరు మొత్తం వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయగలరు. ఆలా కాకుండా వెబ్‌పేజీలోని కొన్ని పేజీలను మాత్రమే PDFగా సేవ్ చేయాలనుకుంటే కనుక కింద ఉన్న దశలను అనుసరించండి.

1. మీరు PDFగా సేవ్ చేయాలనుకుంటున్న వెబ్‌పేజీని ఓపెన్ చేయండి.

2. దిగువన ఉన్న షేర్ బటన్‌పై క్లిక్ చేయండి.

3. మీరు షేర్ పాప్-అప్ విండోలో ఉన్నప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి "ప్రింట్" బటన్‌పై క్లిక్ చేయండి.

4. ఇప్పుడు మీరు వ్యక్తిగత పేజీలను ఎంచుకోవడం, బహుళ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవడం మరియు పరిమాణం లేదా ధోరణిని మార్చడం వంటి వివిధ రకాల ఎంపికలను చూస్తారు. ఇందులో మీకు కావలసిన ఎంపికని ఎంచుకోండి.

3. మీరు అన్ని వివరాలను ఎంచుకున్న తర్వాత ప్రింట్ > డ్రాఫ్ట్‌ టూ సేవ్ ఎంపికలను క్లిక్ చేయండి.

Android ఫోన్‌లలో

స్మార్ట్‌ఫోన్‌ లో ఏదైనా వెబ్‌పేజీని PDFగా సేవ్ చేయడం ఎలా?

Android ఫోన్‌లలో మేము గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఉపయోగించి ఈ విధానాన్ని అనుసరించాము. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తున్న బ్రౌజర్ లలో ఇది ముందు వరుసలో ఉంది.

1. మీరు PDFగా సేవ్ చేయాలనుకుంటున్న వెబ్‌పేజీని ఓపెన్ చేయండి.

2. కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేయండి.

3. తరువాత ఇందులో కనిపించే షేర్ బటన్‌ను నొక్కండి.

4. ఇప్పుడు ప్రింట్‌పై క్లిక్ చేసి అవసరమైన అన్ని వివరాలను జోడించండి.

5. చివరగా దానిని PDFగా సేవ్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Save Any Web Page as PDF on Smartphone (iPhone and Android)

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X