ఫేస్‌బుక్‌ను వాడుతున్నపుడు మొబైల్ డేటాను ఆదా చేసుకోవటం ఎలా..?

ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మనలో చాలా మంది యూజర్లు నిత్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కనెక్ట్ అయి ఉంటున్నారు.

By GizBot Bureau
|

ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మనలో చాలా మంది యూజర్లు నిత్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కనెక్ట్ అయి ఉంటున్నారు. ఈ క్రమంలో బోలెడంత మొబైల్ డేటాను వాళ్లు రోజు ఖర్చుచేస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాపాచాట్ వంటి యాప్‌లను వినియోగించుకునేటపుడు కొన్ని స్మార్ట్ ట్రిక్స్‌ను ఉపయోగించినట్లయితే మీ మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి చాలా వరకు డేటా ఆదా అవుతుంది. ఆ టిప్స్ అండ్ ట్రిక్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఫేస్‌బుక్ యాప్‌ను వినియోగించుకునేటపుడు...

ఫేస్‌బుక్ యాప్‌ను వినియోగించుకునేటపుడు...

ఫేస్‌బుక్ యాప్‌ను వినియోగించుకునేటపుడు మొబైల్ డేటాను మీరు ఆదా చేయాలనుకుంటున్నట్లయితే స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు లైన్ల ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్‌లో సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత అందులో Data saver అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని టర్న్ ఆన్ చేసినట్లయితే డేటా సేవింగ్ మోడ్ ఎనేబుల్ అవుతుంది.

 

 

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వినియోగించుకునేటపుడు...

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వినియోగించుకునేటపుడు...

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను వినియోగించుకునేటపుడు మొబైల్ డేటాను మీరు ఆదా చేయాలనుకుంటున్నట్లయితే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Mobile/Cellular Data Use అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తరువాత Use Less Data పేరుతో మరో ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే డేటా సేవింగ్ మోడ్ ఎనేబుల్ అవుతుంది.

 

 

స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను వినియోగించుకునేటపుడు..
 

స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను వినియోగించుకునేటపుడు..

స్నాప్‌చాట్ అప్లికేషన్‌ను వినియోగించుకునేటపుడు మొబైల్ డేటాను మీరు ఆదా చేయాలనుకుంటున్నట్లయితే యాప్ మెయిన్ స్ర్కీన్ పై టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే cog ఐకాన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే ఆప్షన్స్‌లో సెట్టింగ్స్ పేజీని సెలక్ట్ చేసుకుని అందులో Additional Services ఆప్షన్ కోసం చూడండి. అడిషనల్ సర్వీసెస్‌లోకి వెళ్లిన తరువాత మేనేజ్ ఆప్షన్ పై క్లిక్ చేసి Travel Modeను టర్న్ ఆన్ చేసుకున్నట్లయితే డేటా సేవింగ్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది.

 

 

అందుబాటులోకి లైటర్ వెర్షన్ యాప్స్..

అందుబాటులోకి లైటర్ వెర్షన్ యాప్స్..

మరొక పద్థతిలో భాగంగా ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి యాప్‌లకు సంబంధించి లైటర్ వెర్షన్ యాప్‌లను వినియోగించుకోవటం ద్వారా మొబైల్ డేటా మరింతగా ఆదా అవుతుంది. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు Facebook Lite, Messenger Lite, Twitter Lite ఇంకా YouTube Go యాప్‌ను నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచే తీసుకోవచ్చు. 15 ఎంబి తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకోగలిగే ఈ యాప్స్ 2జీ, 3జీ నెట్‌వర్క్‌లలోనూ వేగంగా స్పందిస్తాయి. మొబైల్ డేటాను ఆదా చేయటంలో ఈ యాప్స్ కీలక పాత్ర పోషిస్తాయి.

 

 

 

Best Mobiles in India

English summary
How to Save Data When Using Your Favorite Social Media Apps.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X