గూగుల్ మ్యాప్స్‌లో మీ పార్కింగ్ లొకేషన్‌ను సేవ్ చేసుకోవచ్చు... ఎలాగో తెలుసుకోండి!
పట్టణాలు లేదా నగరాల్లో వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్య గా ఉంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. కార్యాలయాలు సహా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హడావిడిగా వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లిపోతాం. అయితే పనిపూర్తయ్యాక.. పార్కింగ్ చేసిన వాహనాన్ని గుర్తించడం కొన్నిసార్లు చాలా కష్టం. ముఖ్యంగా ఎక్కువ వాహనాల పార్కింగ్ చేసిన చోట.. మన వాహనాన్ని గుర్తించడం అత్యంత సులువు కాదు. అయితే గూగుల్ మ్యాప్స్‌లో (Google Maps) ఈ సమస్య పరిష్కారం ఉంది.
గూగుల్ మ్యాప్స్‌లో మీరు పార్కింగ్ చేసిన వాహన లోకేషన్‌ను సేవ్ చేసుకొనే అవకాశం ఉంది. ఫలితంగా గూగుల్ నావిగేషన్ వ్యవస్థ ద్వారా సులభంగా ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు. ఫలితంగా భారీ సంఖ్యలో వాహనాలు పార్కింగ్ ఉన్న చోటైనా గానీ.. మీ వెహికల్ లోకేషన్‌ను సులభంగా గుర్తించవచ్చు. పూర్తి వివరాలతో కథనం మీకోసం.

గూగుల్ మ్యాప్స్ పార్కింగ్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి?
స్టెప్ 1 : స్మార్ట్‌ఫోన్లో గూగుల్ మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2 : హోమ్ స్క్రీన్ నుంచి Explore ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : అక్కడ కనిపించిన బ్లూ డాట్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 4 : అనంతరం స్క్రీన్ పైన అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. అక్కడ కనిపించిన Save Parking ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
అయితే అనంతరం మీ వాహనం లోకేషన్ గుర్తించేందుకు గూగుల్ మ్యాప్స్‌లోని You Parked Here అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. గూగుల్ మ్యాప్స్‌లో పార్కింగ్ లొకేషన్‌ను గుర్తించాలి. అనంతరం డైరెక్షన్ కోసం నావిగేషన్ ట్యా్బ్ పైన క్లిక్ చేయాలి. ఫలితంగా సులభంగా మీ వాహనం పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవచ్చు.
గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తున్న వారికి ఇటీవల సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ క్లౌడ్‌లో ప్రైవసీ సమస్యలు కారణంగా గోప్యత నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు పేర్కొంది. గూగుల్ మ్యాప్స్ డేటాను క్లౌ్డ్‌లో కాకుండా యూజర్ల మొబైల్‌లోనే భద్రపరచనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది.
దీనిపై గతంలోనే యూజర్లకు గూగుల్ ఈమెయిల్ పంపింది. పాత ప్రయాణాలకు సంబంధించిన డేటాను యూజర్ల మొబైళ్లలో భద్రపరిచేందుకు కేవలం డిసెంబర్ 1 వరకు మాత్రమే సమయం ఉందని తెలిపింది. అనంతరం పాత డేటాను తొలగించడం ప్రారంభం అవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ మరియు iOS వెర్షన్ గూగుల్ మ్యాప్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, వెబ్ వెర్షన్‌లో ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








