Google మ్యాప్స్‌లో ఇష్టమైన స్థలాలను సేవ్ చేయడం ఎలా?

|

ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ఫోన్లను వాడుతున్న వారికి గూగుల్ మ్యాప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనకు తెలియని ప్రదేశాలలో తెలియని చోటు గురించి వెతకడానికి గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడతాయి. వీటిలో ముఖ్యంగా మీ సమీప ప్రాంతంలో సినిమా థియేటర్, ATM వంటి వాటిని కనుగొనడానికి ఎక్కువ మంది గూగుల్ మ్యాప్స్ ను వాడుతూ ఉంటారు. గూగుల్ మ్యాప్స్ అనేది అంతిమ సమయంలో సహాయంగా ఉంటుంది అని రుజువు కూడా అయింది. గూగుల్ యొక్క నావిగేషన్ యాప్ మాకు చాలా సహాయపడింది అని చాలా మంది అంగీకరించారు కూడా. గూగుల్ మ్యాప్స్ లోని వివిధ రకాల ఫీచర్లు మీరు తరుచు వెళ్లే లేదా మీకు నచ్చిన కొన్ని ప్రదేశాలను ఇష్టమైనవిగా సేవ్ చేయడానికి మీకు అనుమతిని ఇస్తుంది. తద్వారా వాటిని మళ్లీ వెతకడంలో ఇబ్బంది ఉండదు. ఈ సులభమైన ప్రక్రియను ఎలా చేయాలో వంటి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Save Your Favorite places in Google Maps?

Google మ్యాప్స్‌లో ఇష్టమైన స్థలాలను సేవ్ చేసే విధానం

స్టెప్ 1: మొదట మీ ఆండ్రాయిడ్ లేదా iOS డివైస్ లో గూగుల్ మ్యాప్స్ యాప్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: మీరు నావిగేట్ చేయదలిచిన ప్రదేశం కోసం సెర్చ్ చేయండి మరియు దానిని మీకు ఇష్టమైన ప్రదేశంగా సేవ్ చేయండి.

స్టెప్ 3: లొకేషన్ మీద నొక్కండి.

స్టెప్ 4: స్క్రీన్ మీద మెరుస్తున్న వివిధ ఎంపికలలో 'సేవ్' ఎంపిక ఉంటుంది. దాని మీద నొక్కండి.

How to Save Your Favorite places in Google Maps?

స్టెప్ 5: తరువాత ఫ్యావరేట్, వాంట్ టు గో, మరియు స్టార్‌డ్ ప్లేసెస్ వంటి వర్గాల జాబితా కనిపిస్తుంది. ఇందులో ఫ్యావరేట్ ఎంపికను ఎంచుకోండి. కుడివైపు ఎగువ మూలలోని ఫినిష్ ఎంపికను నొక్కండి. ఇప్పుడు మీకు ఇష్టమైన ప్లేస్ ను గూగుల్ మ్యాప్స్‌లో సేవ్ చేసారు.

స్టెప్ 6: గూగుల్ మ్యాప్స్‌లో మీకు ఇష్టమైన ప్రదేశాలను యాక్సెస్ చేయడానికి యాప్ ను ఓపెన్ చేసి సేవ్ చేసిన విభాగానికి వెళ్ళండి.

Best Mobiles in India

English summary
How to Save Your Favorite places in Google Maps?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X