స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని సేవ్ చేయడానికి 5 చిట్కాలు

|

ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసిన తర్వాత దాని యొక్క బ్యాటరీ ఎక్కువసేపు ఉండాలని కోరుకుంటారు. ఫోన్లను కొనుగోలు చేసిన చాలా రోజుల తరువాత పాతవయ్యాక బ్యాటరీలు త్వరగా ఛార్జ్ అయిపోవడం జరుగుతాయి. అయితే ఇది ఎంత వేగంగా ఛార్జింగ్ అయిపోతున్నాదొ అన్నది మన యొక్క వాడకం మరియు ఛార్జింగ్ సైకిల్స్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

బ్యాటరీలు

ఫోన్ బ్యాటరీలు సాధారణంగా లిథియం-అయాన్‌తో తయారు చేయబడి ఉంటాయి. ఫోన్ ఛార్జీల సమయాన్ని ఎక్కువగా నిల్వ చేయడానికి బ్యాటరీల సామర్థ్యం మరియు వాటి క్షీణతపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ ఎంత వేగంగా క్షీణించింది అనేది మన నియంత్రణలో లేనప్పటికీ కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీని సేవ్ చేయవచ్చు. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

గూగుల్ డుయో ద్వారా డూడుల్‌ మెసేజ్,నోట్స్ లను పంపడం ఎలా?గూగుల్ డుయో ద్వారా డూడుల్‌ మెసేజ్,నోట్స్ లను పంపడం ఎలా?

step1

1. 3G లేదా 4G వంటి ఇంటర్నెట్ డేటాకు బదులుగా Wi-Fi ను వాడడం చాలా ఉత్తమం. ఇంటర్నెట్ డేటా Wi-Fi కంటే 40% ఎక్కువ ఎనర్జీని వినియోగిస్తుంది. కాబట్టి Wi-Fiని ఉపయోగించడం ద్వారా ఖచ్చితంగా మీ బ్యాటరీ వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

step2

2. బ్యాటరీ సేవింగ్స్ మోడ్ ఫీచర్ ను ఎంచుకోవడం. ఇది ఆండ్రాయిడ్ మరియు iOS డివైస్ లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ లో మీరు పవర్ సేవింగ్ మోడ్ అనే ఫీచర్ ను, iOS డివైస్ లలో దీనిని Low పవర్ మోడ్ అనే ఫీచర్ లతో కనుగొనవచ్చు.

ఈ మోడ్‌లో స్మార్ట్‌ఫోన్ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ (CPU) బ్యాటరీ వినియోగాన్ని తగ్గించడానికి వివిధ యాప్ లు, నోటిఫికేషన్‌లు, బ్రైట్ నెస్ మరియు వివిధ హార్డ్‌వేర్ ఎంపికల వాడకాన్ని సవరించుకుంటుంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

 

step3

3. వీడియో కంటెంట్ వినియోగాన్ని పరిమితం చేయడం. మీ ఫోన్ యొక్క బ్యాటరీని అధిక మొత్తంలో ఆదా చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది. వీడియో ప్రాసెసింగ్ అనేది అధిక మొత్తంలో బ్యాటరీ యొక్క శక్తిని వినియోగించుకుంటుంది.

 

BSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు... రోజువారి 5GB డేటాBSNL ప్రీపెయిడ్ ప్లాన్‌లు... రోజువారి 5GB డేటా

బ్రైట్ నెస్

4. ఫోన్ యొక్క బ్రైట్ నెస్ ను తగ్గించడం. ఈ ఫీచర్ ఫోన్ యొక్క ఒక ఫంక్షనల్ అంశంలో రాజీపడకుండా బ్యాటరీని ఆదా చేయడానికి గల సులభమైన మార్గాలలో ఒకటి. ఆండ్రాయిడ్ 10 మరియు iOS 13 తో రన్ అవుతున్న డివైస్ లు డార్క్ మోడ్ లేదా నైట్ మోడ్ యొక్క సదుపాయానికి మద్దతు ఇవ్వడం ప్రారంభించాయి. ఇది బ్యాటరీని అధిక మొత్తంలో పొదుపు చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

 

 

5W ఛార్జింగ్ వేగంతో రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్... త్వరలోనే ప్రారంభం5W ఛార్జింగ్ వేగంతో రియల్‌మి వైర్‌లెస్ ఛార్జర్... త్వరలోనే ప్రారంభం

airplane మోడ్‌

5. airplane (విమానం) మోడ్‌లో ఉంచినప్పుడు ఫోన్ కేవలం కనీస బ్యాటరీని మాత్రమే వినియోగిస్తుంది. ఫోన్ ను ఈ మోడ్‌లో ఉంచినప్పుడు GSM, Wi-Fi, బ్లూటూత్ మరియు GPS వంటి సౌకర్యాలు ఆటోమ్యాటిక్ గా నిలిపివేయబడతాయి. ఈ మోడ్‌లో ఉన్నప్పుడు ఫోన్ స్క్రీన్ ఆఫ్‌తో దాని సాధారణ శక్తి వినియోగంలో 5% వరకు మాత్రమే ఉపయోగించుకుంటుంది.

Best Mobiles in India

English summary
How to Save Your Smartphone Battery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X