YouTube వీడియోను ఆఫ్‌లైన్ వీక్షణ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఎలా సేవ్ చేయాలి?

|

కరోనా వైరస్ (కోవిడ్ -19) ను దేశంలో అరికట్టడానికి భారత ప్రభుత్వం దేశం మొత్తం లాక్‌డౌన్ ను అమలు చేసింది. ఈ లాక్‌డౌన్ ఫలితంగా మొబైల్ డేటా వినియోగం అకస్మాత్తుగా పెరిగిందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) గత నెలలో నివేదించింది.

 

యూట్యూబ్‌ వీడియో

స్మార్ట్‌ఫోన్‌లలో అధికంగా వీడియోలను చూడటం వలన ఇంటర్నెట్‌లో అధిక మొత్తంలో డేటాను ఉపయోగించవలసి ఉంటుంది. యూట్యూబ్‌తో సహా డిఫాల్ట్ స్ట్రీమింగ్ రిజల్యూషన్‌ను SD కు తగ్గించమని పలు వీడియో సర్వీసు ప్రొవైడర్లు ఇప్పటికే వినియోగదారులకు విజ్ఞప్తి చేసారు. కొంత మంది తమకు నచ్చిన సినిమా లేదా వీడియోలను పదే పదే చుస్తూఉంటారు.

యూట్యూబ్ వీడియోను రిపీట్‌లో చూడటం

యూట్యూబ్ వీడియోను రిపీట్‌లో చూడటం

ఏదేమైనా యూట్యూబ్ వీడియోను రిపీట్‌లో చూడటం వలన మళ్ళి మళ్ళి అధిక మొత్తంలో డేటాను వినియోగించవలసి ఉంటుంది. అదే వీడియోను తిరిగి చూడడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ వీడియోను సేవ్ చేయడం ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా కూడా మీకు కావలసినప్పుడు చూడవచ్చు మరియు వినవచ్చు. ఇందుకోసం యూట్యూబ్ డౌన్‌లోడ్ ఫీచర్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాకపోతే కొన్ని వీడియోలను సేవ్ చేయడం కోసం మీరు YouTube ప్రీమియం సభ్యత్వాన్ని పొందవలసి ఉంటుందని గమనించండి.

ఆవశ్యకతలు
 

ఆవశ్యకతలు

*** ఇంటర్నెట్ కనెక్షన్ (వీడియోను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు మాత్రమే)

*** YouTube మొబైల్ యాప్ యొక్క తాజా వెర్షన్

*** YouTube ప్రీమియం సభ్యత్వం(ఆప్షనల్)

 

YouTube వీడియోను ఆఫ్‌లైన్ వీక్షణ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఎలా సేవ్ చేయాలి?

YouTube వీడియోను ఆఫ్‌లైన్ వీక్షణ కోసం స్మార్ట్‌ఫోన్‌లో ఎలా సేవ్ చేయాలి?

** మీ స్మార్ట్‌ఫోన్‌లో YouTube యాప్ ను ఓపెన్ చేయండి.

** మీకు నచ్చిన మరియు కావలసిన ఏదైనా వీడియో కోసం సెర్చ్ చేసి దానిపై నొక్కండి.

** పోర్ట్రెయిట్ మోడ్‌లోని ప్లేబ్యాక్ స్క్రీన్ నుండి డౌన్‌లోడ్ బటన్‌పై నొక్కండి.

** తరువాత మీరు వీడియోను సేవ్ చేయదలిచిన రిజల్యూషన్‌ను ఎంచుకొని 'OK' బటన్ మీద నొక్కండి.

** యూట్యూబ్ ఇప్పుడు వీడియోను డౌన్‌లోడ్ చేస్తుంది మరియు ఫోన్ మెమొరీలో నిల్వ చేస్తుంది.


సేవ్ చేసిన వీడియోను చూడటానికి యూట్యూబ్ వీడియో యాప్ దిగువన గల లైబ్రరీ ట్యాబ్‌పై నొక్కండి. దాని తరువాత డౌన్‌లోడ్‌లను ఎంచుకోండి. అందులో మీరు చూడాలనుకునే వీడియో మీద నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to save YouTube videos for offline viewing in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X