యాంటీవైరస్‌తో పనిలేకుండా ఫైల్స్‌ను స్కాన్ చేసుకోవటం ఎలా..?

|

ప్రస్తుత పరిస్థితులను మనం పరిశీలించినట్లయితే వైరస్ దాడులనేవి రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మాల్వేర్లను అడ్డుకునే క్రమంలో చాలా మంది తమ కంప్యూటర్లలో యూజర్లు యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. ఈ వైరస్ లేనేవి ప్రధానంగా పెన్‌డ్రైవ్స్ ఇంకా డౌన్‌లోడెడ్ ఫైల్స్ ద్వారా కంప్యూటర్లలలోకి చొరబడుతున్నాయి. పెన్‌డ్రైవ్స్ ద్వారా వ్యాపించే వైరస్‌లను స్కాన్ చేసుకునేందుకు కంప్యూటర్‌లో వీలునప్పటికి డౌన్‌లోడెడ్ ఫైల్స్ విషయంలో మాత్రం అవకాశం లేకుండా పోయింది. మనలో చాలా మంది యూజర్లు రకరకాల వెబ్‌సైట్‌ల నుంచి అన్‌అఫీషియల్ సాఫ్ట్‌వేర్‌లను వివిధ సందర్భాల్లో డౌన్‌లోడ్ చేసుకోవటం జరుగుతోంది.

 

ఇండియాకు షియోమి బెస్ట్ సెల్పీ స్మార్ట్‌ఫోన్‌,ధర, ఫీచర్లపై పూర్తి వివరాలు !ఇండియాకు షియోమి బెస్ట్ సెల్పీ స్మార్ట్‌ఫోన్‌,ధర, ఫీచర్లపై పూర్తి వివరాలు !

స్కాన్ చేసేటప్పటికి ఫలితం లేకుండా పోతోంది...

స్కాన్ చేసేటప్పటికి ఫలితం లేకుండా పోతోంది...

వైరస్‌లనేవి అన్‌అఫీషియల్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా కంప్యూటర్‌లోకి చేరిపోతుండటంతో యాంటీవైరస్ ప్రోగ్రామ్ ద్వారా వాటి స్కాన్ చేసేటప్పటికి ఫలితం లేకుండా పోతోంది. ఇక పై అలా జరగకుండా ఏదైనా ఫైల్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆ ఫైల్ మంచిది కాదా అన్న విషయాన్ని తెలుసుకుంటే చాలా బాగుంటుంది.

 

 

60 రకాల యాంటీ‌వైరస్ ఇంజిన్‌ల సహాయంతో..

60 రకాల యాంటీ‌వైరస్ ఇంజిన్‌ల సహాయంతో..

ఈ బాధ్యతను తీసుకునేందుకు Virustotal.com అనే వెబ్‌సైట్‌ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉంది. 2012లో గూగుల్ సొంతమైన ఈ వెబ్‌సైట్, ఫైల్స్ ఇంకా యూఆర్ఎల్స్‌ను స్కాన్ చేసే సమయంలో 60 రకాల యాంటీ‌వైరస్ ఇంజిన్‌లను ఉపయోగించుకుంటుంది. ఈ సైట్‌ను ఉపయోగించుకుని ఫైల్స్ లేదా యూఆర్ఎల్స్‌ను ఏ విధంగా స్కాన్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి...
 

వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి...

ముందుగా మీకు నచ్చిన బ్రౌజర్ నుంచి www.virustotal.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. లోపలికి వెళ్లిన తరువాత మీరు స్కాన్ చేయాలనుకుంటోన్న ఫైల్ లేదా యూఆర్ఎల్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి స్కాన్‌ఇట్ బటన్ పై క్లిక్ చేయవల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా ఫైల్‌ను అప్‌లోడ్ చేయదలచినట్లయితే, అప్‌లోడ్ చేసే ఫైల్ సైజు 128MBకి మించ కూడదు. virustotal వెబ్‌సైట్‌లో ఒక్క యూఆర్‌ఎల్‌ను మాత్రమే కాకుండా పూర్తి వెబ్‌సైట్‌ను కూడా స్కాన్ చేసుకునే వీలుంటుంది. ఈ వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా వినియోగించుకోవటం ద్వారా ఇన్‌ఫిక్టెడ్ ఫైల్స్‌కు పూర్తిగా దూరంగా ఉండొచ్చు.

అందుబాటులో అనేక వెబ్‌సైట్స్..

అందుబాటులో అనేక వెబ్‌సైట్స్..

వైరస్‌టోటల్ తరహాలోనే జొట్టీస్ మాల్వేర్ స్కాన్ (Jotti's Malware Scan), మెటా‌డిఫెండర్ (Metadefender), వైర్‌స్కాన్ (VirSCAN), ఎఫ్-సెక్యూర్ ఆన్‌లైన్ స్కానర్ (F-Secure Online Scanner), నో డిస్ట్రిబ్యూట్ (NoDistribute), హైబ్రీడ్ అనాలిసిస్ (Hybrid Analysis) పేర్లతో అనేక వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో కొలువు తీరి ఉన్నాయి. ఈ ఉచిత ఆన్‌లైన్ స్కానర్ టూల్స్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా అన్ని రకాల ఫైల్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కాన్ చేసుకుంటూ మాల్వేర్ దాడుల నుంచి బయటపడవచ్చు.

ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి వెబ్‌లింక్ సురక్షితం కాదు..

ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి వెబ్‌లింక్ సురక్షితం కాదు..

ఆన్‌లైన్‌లో కనిపించే అన్ని వెబ్ లింక్స్ సురక్షితమైనవి కావు.. పొరపాటున వాటిని క్లిక్ చేసినట్లయితే సిస్టం వైరస్ బారిన పడటం ఖాయం. ఈ సమస్య తలెత్తకు ముందే అప్రమత్తంగా వ్యవహరించటం మంచిది. ఆన్‌లైన్ హ్యాకర్లు వైరస్‌ను వ్యాపింపజేసే క్రమంలో రకరకాల వ్యూహాలను అనుసరిస్తుంటారు. వీటిలో భాగంగానే ఆసక్తికరమైన వీడియోలు, షాకింగ్ స్టోరీస్ ఇంకా ఆసక్తికర డీల్స్ ముసుగులో వైరస్ లింక్‌లను ప్రమోట్ చేస్తుంటారు. పలువురు నెటిజనులు వీటికి ఆకర్షితులై మోసపోతుంటారు. కాబట్టి, ఏదైనా లింక్ పై క్లిక్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం మంచిది.

Best Mobiles in India

English summary
Today we are going you to share useful method to scan suspected URL file online for virus and trojan

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X