ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేయడం ఎలా?

|

ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ యాజమాన్యంలో గల ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల తన యొక్క వినియోగదారులకు లైవ్ స్ట్రీమ్‌లను షెడ్యూల్ చేసే సామర్థ్యాన్ని పరిచయం చేసింది. లైవ్ షెడ్యూలింగ్ అని పిలువబడే ఈ ఫీచర్ మీ స్ట్రీమ్‌ను 90 రోజుల ముందుగానే షెడ్యూల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని సాయంతో మీ యొక్క ఫాలోవర్‌లు ట్యూన్ చేయడానికి రిమైండర్‌లను సెట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల ద్వారా లైవ్ వీడియోను ప్రారంభించే సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇది వినియోగదారులు వారి అనుచరులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.

 
How to Schedule Future Live Video Event Program on Instagram: Here are Full Details

లైవ్ షెడ్యూలింగ్‌తో క్రియేటర్‌లు 90 రోజుల ముందుగానే బజ్‌ని పెంచగలరు మరియు అనుచరులకు ఎటువంటి ప్రకటన చేయకుండానే రాబోయే ఈవెంట్ లేదా లాంచ్ కోసం ఎదురుచూసేలా చేయగలరు. అనుచరులు పోస్ట్, వివరణ మరియు లైవ్ లింక్‌ను కలిగి ఉన్న ప్రాంప్ట్‌ను చూడగలరు. లైవ్ షెడ్యూలింగ్‌తో క్రియేటర్‌లు కౌంట్‌డౌన్ స్టోరీలు మరియు మరిన్నింటిని కూడా పోస్ట్ చేయవచ్చు.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను ఎలా షెడ్యూల్ చేయాలి

ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగదారు ఎవరు అయినా లైవ్ వీడియోని షెడ్యూల్ చేయవచ్చు. ఇది కేవలం సృష్టికర్తలకు మాత్రమే పరిమితం కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో ప్రారంభించడం చాలా సులభం. అయితే భవిష్యత్తులో లైవ్ వీడియోను షెడ్యూల్ చేయడం కూడా చాలా సులభమైన పని. లైవ్ వీడియోలో ఇతర అనుచరులను జోడించడానికి ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులను అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియోను షెడ్యూల్ చేయడానికి ఈ సాధారణ దశలను అనుసరించండి.

How to Schedule Future Live Video Event Program on Instagram: Here are Full Details

*** ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి కెమెరాను తెరవడానికి ఎడమవైపుకు స్వైప్ చేయండి.

*** కెమెరా ఓపెన్ అయిన తర్వాత దిగువ అంచు నుండి కుడివైపుకి స్వైప్ చేసి లైవ్ స్ట్రీమ్ ఎంపికను ఎంచుకోండి.

*** షెడ్యూల్ అనే ఎంపిక స్క్రీన్ కుడి వైపున చూపబడాలి. షెడ్యూల్‌ని ఎంచుకుని ఈవెంట్ పేరును 'వీడియో శీర్షిక'లో సెట్ చేయండి.

*** స్టార్ట్ సమయంపై క్లిక్ చేసి షెడ్యూల్ చేయడం కోసం భవిష్యత్తులో ఎప్పుడైనా తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి.

*** షెడ్యూల్ లైవ్ వీడియోపై క్లిక్ చేయండి.

*** వినియోగదారులు షెడ్యూల్ చేసిన లైవ్‌ను వారి అనుచరుల కోసం పోస్ట్‌గా షేర్ చేయవచ్చు. దీని ద్వారా మీరు లైవ్ స్ట్రీమ్ చేయడానికి ముందు వారు రిమైండర్‌లను కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
How to Schedule Future Live Video Event Program on Instagram: Here are Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X