Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలను ఎలా షెడ్యూల్‌ చేయాలి.. పూర్తి వివరాలు..!

మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ అనేక మందికి ఫేవరెట్ ప్లాట్‌ఫాంగా ఉంది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఫోటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటారు. యూజర్ల భద్రత, సౌకర్యం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక ఫీచర్‌లు ఉన్నాయి. అయితే ఇన్‌స్టాలో ఫోటోలు లేదా రీల్స్‌ను షెడ్యూల్‌ చేసుకొనేందుకు అవకాశం (Instagram Posts Schedule Guide) ఉంటుంది. ఈ ఫీచర్‌ ఇన్‌బిల్ట్‌గా అందుబాటులో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్ షెడ్యూల్ ఫీచర్‌ కేవలం బిజినెస్, క్రియేటర్‌ అకౌంట్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. మీరు ప్రైవేట్‌ (పర్సనల్‌) అకౌంట్‌ను ఉపయోగిస్తుంటే మాత్రం పోస్ట్‌లు, రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో నేరుగా షెడ్యూల్‌ చేసేందుకు అవకాశం లేదు. అయితే కొన్ని థర్డ్ పార్టీ టూల్స్‌ ద్వారా ప్రైవేట్‌ అకౌంట్స్‌ కూడా పోస్ట్‌లు షెడ్యూల్‌ చేయవచ్చు.

how to Schedule instagram posts in business  private  creator accounts

ఇన్‌స్టాగ్రామ్ బిజినెస్‌ లేదా క్రియేటర్‌ అకౌంట్స్ యూజర్లు ఇన్‌స్టా ఇన్‌బిల్ట్‌ టూల్స్‌ లేదా మెటా బిజినెస్‌ సూట్ ద్వారా షెడ్యూల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఫోటోలు, వీడియోలు, రీల్స్‌ను షెడ్యూల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంది.

* ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ ద్వారా షెడ్యూల్‌ ఎలా చేయాలి?
స్టెప్ 1 : ఇన్‌స్టాగ్రామ్‌లో షెడ్యూల్‌ చేసేందుకు ఫోటో, రీల్స్‌ను అప్‌లోడ్‌ చేయండి.
స్టెప్‌ 2 : అనంతరం ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో More Options అదే iOS లో Advanced Settings పైన క్లిక్‌ చేయండి.
స్టెప్‌ 3 : ఆ తర్వాత Schedule This Post అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : అనంతరం డేట్‌, టైమ్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి.
స్టెప్‌ 5 : చివరిగా Schedule ఆప్షన్‌ పైన క్లిక్ చేయాలి.

how to Schedule instagram posts in business  private  creator accounts

* మెటా బిజినెస్‌ సూట్‌ ద్వారా పోస్టులు ఎలా షెడ్యూల్‌ చేయాలి?
స్టెప్‌ 1 : మెటా బిజినెస్ సూట్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ బిజినెస్ లేదా క్రియేటర్‌ అకౌంట్‌కు కనెక్ట్‌ కావాలి.
స్టెప్‌ 3 : ఆ తర్వాత క్రియేట్‌ పోస్ట్‌ లేదా క్రియేట్‌ రీల్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : ఫోటో, వీడియో, రీల్‌ వంటివి అప్‌లోడ్‌ చేయాలి.
స్టెప్‌ 5 : క్యాప్షన్‌, హ్యాష్‌ట్యాగ్స్‌ సహా ఇతర వివరాలు జోడించాలి.
స్టెప్‌ 6 : తర్వాత షెడ్యూల్‌ చేయాల్సిన డేట్‌, టైమ్‌ను ఎంచుకోవాలి.
స్టెప్‌ 7 : చివరిగా Schedule ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.

Take a Poll

కొన్ని థర్డ్ పార్టీ యాప్స్‌ ద్వారా ప్రైవేట్‌ అకౌంట్స్‌ నుంచి కూడా షెడ్యూల్‌ చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం Buffer, Hootsuite, later వంటి ప్లాట్‌ఫామ్స్ లోకి లాగిన్‌ కావాలి. అయితే కొన్ని ప్లాట్‌ఫామ్స్‌ ఉచితంగా కొన్ని సర్వీసులను అందిస్తుంటాయి. అదే మరికొన్నింటి కోసం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్‌ 1 : పైన తెలిపిన ఏదైనా థర్డ్‌ పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
స్టెప్‌ 2 : ఆ ప్లాట్‌ఫాంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రైవేట్/పర్సనల్‌ అకౌంట్‌ లాగిన్‌ కావాలి.
స్టెప్‌ 3 : మీరు పోస్ట్‌ చేయాలని భావిస్తున్న వీడియో, ఫోటోను అప్‌లోడ్‌ చేయాలి.
స్టెప్ 4 : ఆ ప్లాట్‌ఫాం కంటెంట్‌ క్యాలెండర్‌ను ఎంచుకోవాలి.
స్టెప్‌ 5 : ఫోటో, వీడియో కోసం క్యాప్షన్, హ్యాష్‌ట్యాగ్‌ తోపాటు తేదీ, టైం కూడా యాడ్‌ చేసుకోవాలి.
స్టెప్‌ 6 : అనంతరం షెడ్యూల్‌ పైన క్లిక్‌ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
how to Schedule instagram posts in business, private, creator accounts, stepwise guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X