Apple డివైజ్‌ల‌లోనూ మెయిల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇది చ‌ద‌వండి!

|

Apple కంపెనీ ఇటీవ‌ల ఐఫోన్ 14 విడుద‌ల అనంత‌రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజ‌ర్ల‌కు iOS 16 ను కూడా అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. iOS 16 ఐఫోన్‌లకు అనేక కొత్త ఫీచ‌ర్ల‌తో పాటు, గొప్ప ఆప్ష‌న్ల‌ను తీసుకువచ్చింది. అందులో మెసేజ్‌ల‌ను పంపడం, డెలీట్ చేయ‌డం, ఫొటోల్లో బ్యాక్‌గ్రౌండ్ తీసివేయడం మరియు బ్యాటరీ ప‌ర్సంటేజీ ఇండికేట‌ర్ వంటి ఫీచ‌ర్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇవేకాకుండా, ఇంకా అనేక కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫీచ‌ర్ల‌లో చాలా మందికి ఉపయోగపడే అంశం iOS 16 యొక్క సెండ్ లేటర్ ఫీచర్.

 
Apple డివైజ్‌ల‌లోనూ మెయిల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇది చ‌ద‌వండి!

తాజా ఐఓఎస్ అప్‌డేట్‌తో యాపిల్ మెయిల్ యాప్‌లో ఇప్పుడు Gmail యొక్క మెయిల్ షెడ్యూల్ ఫీచర్‌కు సమానమైన షెడ్యూలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. సెండ్ లేటర్ ఫీచర్‌తో, యూజ‌ర్లు ముఖ్యమైన రోజుని మ‌ర‌చిపోతామ‌నే చింత లేకుండా ఏ రోజైతే మెయిల్ పంపాల‌నుకుంటున్నారో.. స‌రిగ్గా ఆరోజుకు ఇమెయిల్‌లను సులభంగా షెడ్యూలింగ్ సెట్ చేయవచ్చు. అంతేకాకుండా, భవిష్యత్తులో తోటి వారికి ఏవైనా ముఖ్యమైన అప్‌డేట్‌లు పంపాలనుకునే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండవచ్చు.

Apple డివైజ్‌ల‌లోనూ మెయిల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇది చ‌ద‌వండి!

మీరు iOS 16లో ఇమెయిల్‌లను ఎలా షెడ్యూల్ చేయవచ్చో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
మీ iPhoneలో iOS 16 అప్‌డేట్ త‌ర్వాత‌ Send later ఫీచర్‌ని ఎలా ఉపయోగించాలి
* ముందుగా, iOS 16 అప్‌డేట్ అయి ఉన్న మీ iPhoneలో మెయిల్ యాప్‌ను తెరవండి.
* కింది భాగంలో కుడి మూలలో ఉన్న కంపోజ్ బటన్‌పై నొక్కడం ద్వారా మెయిల్‌ను కంపోజ్ చేయండి.
* మీరు మెసేజ్ యొక్క‌ సబ్జెక్ట్ మరియు రిసీవర్ ఇమెయిల్ ఐడిని జోడించాలి. మెయిల్ డ్రాఫ్ట్ చేసిన తర్వాత, పై భాగంలో కుడి మూలలో ఉన్న సెండ్ బటన్‌పై ఎక్కువసేపు నొక్కండి. ఇది బాణంలా ​​కనిపిస్తుంది.
* మీరు సెండ్‌ బటన్‌ను ఎక్కువసేపు నొక్కిన తర్వాత, మెయిల్‌ను ఎప్పుడు షెడ్యూల్ చేయాల‌నుకుంటున్నార‌నే విష‌యంపై ఆప్ష‌న్ల‌ను అడుగుతుంది. ఆ త‌ర్వాత ఈ మెయిల్ ను షెడ్యూల్ చేయడం కోసం సెండ్ లేట‌ర్ అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు, తేదీ, సమయం, నెల మరియు సంవత్సరాన్ని చూపే క్యాలెండర్ మీ ముందు ఉంటుంది.
* ఆ త‌ర్వాత మీరు ఇమెయిల్‌ను ఎప్పుడు పంపాలనుకుంటున్నారో క్యాలెండ‌ర్‌లో తేదీ మ‌రియు టైమ్‌లైన్‌ని ఎంచుకోండి.
* ఆ త‌ర్వాత చివరగా, స‌బ్‌మిట్ బ‌ట‌న్ నొక్కండి.
* ఇప్పుడు మీ మెయిల్ విజ‌య‌వంతం షెడ్యూల్ చేయ‌బ‌డిన‌ట్లు నిర్దారించుకోవాలి.

ఇప్పుడు, ఇమెయిల్ భవిష్యత్తు తేదీకి షెడ్యూల్ చేయబడుతుంది. ఈ ప‌ద్ద‌తిని ఉప‌యోగించి భ‌విష్య‌త్తులో కూడా మెయిల్స్ షెడ్యూల్ చేసుకోవ‌చ్చు. ఈ ఫీచ‌ర్ ద్వారా మ‌న‌కు క‌లిసి వ‌చ్చే గొప్ప విష‌యం ఏమిటంటే, మీరు ఎవరి పుట్టినరోజును లేదా ముఖ్యమైన రోజును విష్ చేయ‌డం మ‌ర‌చి పోకుడ‌దనుకుంటే, మీరు ఎవరికైనా వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇమెయిల్‌ను షెడ్యూల్ చేయవచ్చు లేదా వార్షికోత్సవం చెప్పవచ్చు. అంతేకాకుండా, అధికారుల‌కు నిర్దేశించిన స‌మ‌యానికి ద‌ర‌ఖాస్తులు, మొద‌లైన‌వి కూడా షెడ్యూల్ చేసుకోవ‌డానికి ఈ ఫీచ‌ర్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

 
Apple డివైజ్‌ల‌లోనూ మెయిల్స్ షెడ్యూల్ చేయొచ్చు.. ఇది చ‌ద‌వండి!

అదేవిధంగా, iOS 16 అప్‌డేట్ త‌ర్వాత క‌ల్పించిన మ‌రిన్ని ఫీచ‌ర్ల గురించి కూడా తెలుసుకుందాం:
* బ్యాట‌రీ ప‌ర్సంటేజీని చూపించే ఇండికేట‌ర్‌ను పొందుతారు.
* లాక్ స్క్రీన్‌ను ఎక్కువసేపు నొక్కడం ద్వారా వినియోగదారులు వాల్‌పేపర్‌ను మార్చగ‌ల ఫీచ‌ర్‌ను పొందుతారు.
* అంతేకాకుండా, యూజ‌ర్లు స్క్రీన్‌పై విడ్జెట్లు యాడ్ చేయడానికి అవ‌కాశం ఉంటుంది.
* నోటిఫికేష‌న్లు నేరుగా లాక్ స్క్రీన్‌పైనే క‌నిపిస్తాయి. దిగువ నుండి పైకి స్వైప్ చేయడం ద్వారా వినియోగదారులు యాక్సెస్‌ను పొందగలరు.
* Apple యూజ‌ర్లు అప్‌గ్రేడెడ్ కెమెరా యాప్‌ను పొంద‌గ‌ల‌రు.
* కొత్త UI వినియోగదారులను ఫిల్టర్‌లు మరియు మోడ్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది.
* కొంద‌రు ఐఫోన్ యూజ‌ర్లు మెరుగైన, అద్భుత‌మైన సినిమాటిక్ మోడ్‌ను పొంద‌వ‌చ్చు.
* అంతేకాకుండా, లాక్‌డౌన్ మోడ్ గా పిలిచే లాక్‌డౌన్ మోడ్‌ను పొందుతారు. ఇది పెగాసస్ వంటి స్పైవేర్ నుండి డివైజ్‌ల‌ను రక్షించడానికి రూపొందించబడింది.

Best Mobiles in India

English summary
How to Schedule messages in Apple mail app from latest iOS.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X