ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైన పోస్ట్‌లను షెడ్యూల్ చేయడం ఎలా?

|

ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన సోషల్ నెట్‌వర్క్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. దీనిని ఎక్కువగా ఫోటోలు మరియు వీడియోలను పోస్ట్ చేయడం కోసం చాలా మంది ఉపయోగిస్తూ ఉంటారు. మీరు ఫోటోలను సవరించడానికి మరియు పోస్ట్ చేయకుండా వాటిని సేవ్ చేయడానికి, ప్రత్యేక ఫాంట్‌లతో మీ ప్రొఫైల్‌ను అలంకరించడానికి, ఫోటోలు మరియు వీడియోలను షెడ్యూల్ చేయడం వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా మీ యొక్క విషయాలను పోస్ట్ ద్వారా షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైన పోస్ట్‌లను షెడ్యూల్ చేసే పద్ధతులు
 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైన పోస్ట్‌లను షెడ్యూల్ చేసే పద్ధతులు

** ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి మొదటగా మీరు బిజినెస్ అకౌంట్ ను కలిగి ఉండాలి. మీ అకౌంట్ ను బిజినెస్ అకౌంటుగా మార్చడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ గుర్తు మీద నొక్కండి. ఇప్పుడు కుడి వైపున ఎగువ భాగంలో ఉన్న హాంబర్గర్ చిహ్నాన్ని నొక్కి సెట్టింగ్‌ల ఎంపికకు వెళ్లండి. ఆ తరువాత అకౌంటుకు వెళ్లి దిగువన ఉన్న క్రీయేట్ బిజినెస్ అకౌంట్ ఎంపికను ఎంచుకుని కొన్ని ప్రాంప్ట్‌లను అనుసరించి బిజినెస్ అకౌంట్ గా మార్చవచ్చు.

** బిజినెస్ అకౌంటుకు మారడం అంటే మీ ప్రొఫైల్ పబ్లిక్‌గా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అకౌంటులు ప్రైవేట్‌గా ఉండవు. అది మీకు సమస్య అయితే మీరు మరొక చిట్కాను అనుసరించండి.

రెండవ పద్ధతి

రెండవ పద్ధతి

** మొదట మీ కంప్యూటర్‌లో facebook.com/creatorstudio ని ఓపెన్ చేయండి. ఈ ప్రక్రియను ఫోన్‌లో కూడా చేయవచ్చు. అయితే ఈ అనుభవం స్మార్ట్‌ఫోన్‌లలో అంత సున్నితంగా ఉండదు.

** ఈ సైట్ లోడ్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లోగో మీద క్లిక్ చేయండి. ముందుకు సాగడానికి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంటును ఈ పేజీతో కనెక్ట్ చేయండి.

** తరువాత క్రీయేట్ పోస్ట్ ఎంపికను క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు షెడ్యూల్ చేయాలనుకుంటున్న ఫోటోను జోడించండి. అలాగే ఏదైనా శీర్షికను, దాని స్థానాన్ని కూడా జోడించవచ్చు. మీరు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత దాన్ని ప్రచురించడానికి పక్కన ఉన్న బాణం గుర్తును క్లిక్ చేసి షెడ్యూల్ ఎంపికను ఎంచుకోండి. తరువాత సమయం మరియు తేదీని నమోదు చేయండి. దీనిని మీరు పూర్తి చేసిన తర్వాత షెడ్యూల్ ఎంపిక మీద నొక్కండి. ఇలా చేయడం వల్ల మీ పోస్ట్ భవిష్యత్తు కోసం షెడ్యూల్ అవుతుంది.

మూడవ పద్ధతి
 

మూడవ పద్ధతి

** ఈ అధికారిక పద్ధతి ప్రస్తుతానికి బిజినెస్ అకౌంట్ లకు మాత్రమే పనిచేస్తుంది. అయితే మీకు సాధారణ అకౌంట్ ఉంటే మరియు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లను షెడ్యూల్ చేయాలనుకుంటే మీరు దీన్ని మూడవ పార్టీ యాప్ ద్వారా చేయవచ్చు.

** మీ ఐఫోన్‌లో ప్రివ్యూ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. Android లో కూడా డౌన్‌లోడ్ చేయండి.

** ఆన్-స్క్రీన్ ప్రాంప్ట్‌లను అనుసరించి దాన్ని సెటప్ చేయండి.

** దీనికి మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అయిన తర్వాత హోమ్‌పేజీ నుండి + క్లిక్ చేసి ఫోటోలు / వీడియోలను ఎంచుకోండి. ఆ తర్వాత మీరు షెడ్యూల్ చేయదలిచిన ఫోటో లేదా వీడియోను ఎంచుకోండి.

** ఆ ఫోటో మెయిన్ పేజీలో లోడ్ అయిన తర్వాత దాని మీద నొక్కండి. ఆ తరువాత మీకు కావాలంటే ఫోటోను సవరించడానికి ఒక ఎంపిక కూడా ఉంది.ఇది పూర్తయిన తర్వాత థాట్ బబుల్ మీద నొక్కండి.

** ఈ పేజీలో మీరు ఏవైనా శీర్షికలు మరియు హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించవచ్చు. కానీ ముఖ్యంగా మీరు షెడ్యూల్ పోస్ట్‌ను నొక్కవలసి ఉంటుంది. మీరు అలా చేసిన తర్వాత తేదీ మరియు సమయాన్ని ఎన్నుకోమని అడుగుతుంది. అది పూర్తయిన తరువాత షెడ్యూల్ ఎంపిక మీద నొక్కండి.

** మీ పోస్ట్ ఇప్పుడు భవిష్యత్తు కోసం షెడ్యూల్ చేయబడుతుంది. క్యాలెండర్ చిహ్నాన్ని పైకి నొక్కడం ద్వారా మీరు మీ షెడ్యూల్ చేసిన పోస్ట్‌లను తనిఖీ చేయవచ్చు. అలాగే మీరు షెడ్యూల్ చేసిన పోస్ట్‌ను తొలగించాలనుకుంటే కూడా చేయవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Schedule The Instagram Posts

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X