Home
How to

సోషల్‌ మీడియా అకౌంట్‌లను వినియోగిస్తున్నారా.. భద్రత కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

ప్రస్తుతం కోట్లాది మంది సోషల్‌ మీడియాను (Social Media) వినియోగిస్తున్నారు. సైబర్‌ దాడులకు గురికాకుండా ఈ అకౌంట్‌ల నిర్వహణ కష్టంగా మారింది. ఫలితంగా అత్యాధునిక భద్రతా ప్రమాణాలను అవలంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా అకౌంట్‌ లు హ్యాకర్లకు టార్గెట్‌గా మారుతున్నాయి. సాధారణంగా ఈ అకౌంట్‌ లు వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉంటాయి. మెరుగైన భద్రత చర్యలు తీసుకోవడం ద్వారా.. సైబర్‌ దాడుల నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

ఇందులో టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (2FA) ఫీచర్‌ ద్వారా సోషల్ మీడియా ఖాతాలకు అదనపు భద్రతను జోడించిట్లు అవుతుంది. అంటే మొబైల్‌ నంబర్‌ కు వచ్చిన OTP లేదా యాప్‌ ద్వారా లాగిన్‌ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. పాస్‌వర్డ్‌తోపాటు 2FA వెరిఫికేషన్‌ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ తరహా అకౌంట్‌లను సులభంగా హ్యాక్ చేయలేరు.

how to secure social media accounts

యూనిక్‌ పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి :
సోషల్‌ మీడియా ఖాతాలకు పటిష్టమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. అక్షరాలు, అంకెలు, గుర్తులతో కలిగి పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. వివిధ రకాల అకౌంట్‌లకు ఒకేరకమైన పాస్‌వర్డ్‌ను ఏర్పాటుచేసుకోవద్దు. పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ద్వారా యూనిక్‌ పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

అప్‌డేట్ చేసుకోవాలి : సోషల్‌ మీడియా యాప్‌ లు తరచూ కొత్త అప్‌డేట్‌లను విడుదల చేస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తరహా అప్‌డేట్‌లు మెరుగైన భద్రతను కలిగి ఉంటాయి. ఫలితంగా సోషల్ మీడియా ఖాతాలు భద్రంగా ఉంటాయి.

అనుమానిత మెసేజ్‌ లు మరియు ఈ-మెయిల్‌ ద్వారా వచ్చే లింక్స్‌ను, ధ్రువీకరణ లేకుండా క్లిక్‌ చేయవద్దు. మెసెజ్‌, మెయిల్‌ ఎవరి దగ్గర నుంచే వచ్చాయో తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు.. హానికర లింక్స్‌ పంపి సోషల్‌ మీడియా ఖాతాల లాగిన్‌ వివరాలు సహా వ్యక్తిగత సమాచారం కాజేసేందుకు ప్రయత్నం చేస్తారు.

పబ్లిక్‌ వైఫై వినియోగం :
పబ్లిక్‌ W-Fi లు కొన్నిసార్లు సరైన భద్రతను అందించలేవు. అందులోని లోపాల కారణంగా సైబర్‌ నేరగాళ్లు దాడులు చేసేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏదైనా అత్యవసర సమయాల్లో పబ్లిక్‌ వైఫైని వినియోగించాల్సి వస్తే బ్యాంకింగ్‌, సోషల్‌ మీడియా ఖాతాల వినియోగానికి దూరంగా ఉండాలి.

ప్రైవరీ సెట్టింగ్స్‌ను తనిఖీ చేయాలి : భద్రత కోసం సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తుండాలి. మీ వ్యక్తిగత సమాచారం పూర్తిగా బహిర్గతం కాకుండా మార్పులు చేయాలి. మీ పోస్టులు ఎవరు చూడాలి. మరియు మిమ్మల్ని ఎవరు నేరుగా మెసెజ్‌ చేయవచ్చు వంటి ఆప్షన్‌లను కూడా పరిశీలించాలి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to secure social media accounts here are the best practice full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X