మీ ఆండ్రాయిడ్ ఫోన్ హ్యాక్ అవకుండా ఉండాలంటే..?

ఈ రోజుల్లో హ్యాకింగ్ అనేది చాలా సింపుల్ విషయంలా మారిపోయింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఫోన్‌లకు ఈ సమస్య ఎక్కువు అవుతోంది.

|

ఈ రోజుల్లో హ్యాకింగ్ అనేది చాలా సింపుల్ విషయంలా మారిపోయింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న ఫోన్‌లకు ఈ సమస్య ఎక్కువు అవుతోంది. ఆండ్రాయిడ్ అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ కావటంతో సులువుగా ఇందులోకి హ్యాకర్లు చొరబడగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో యూజర్ల అజాగ్రత్త వల్ల కూడా ప్రైవసీ రిస్కులను ఫేస్ చేయవల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మన వెన్నెంటే ఉంటు మన వ్యక్తిగత సమాచారాన్ని నిరంతరం క్యారీ చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌లను సెక్యూర్‌గా ఉంచుకోవల్సిన బాధ్యత మన పై ఎంతైనా ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో సెక్యూరిటీ స్థాయిని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

ఆపిల్‌ను వెంటాడుతున్న iPhone X సమస్యలు, వరుసగా రెండో సారిఆపిల్‌ను వెంటాడుతున్న iPhone X సమస్యలు, వరుసగా రెండో సారి

పాస్‌వర్డ్స్‌ను బ్రౌజర్‌లలో సేవ్ చేయకండి..

పాస్‌వర్డ్స్‌ను బ్రౌజర్‌లలో సేవ్ చేయకండి..

చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఆన్‌లైన్ అకౌంట్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను బ్రౌజర్స్‌లోనే సేవ్ చేసేస్తుంటారు. ఇది చాలా ప్రమాదాకరమైన చర్య. పొరుపాటున వీరి ఫోన్ హ్యాకింగ్ గురైనట్లయితే ముందుగా వారు వీటి గురించి ఆరా తీస్తారు. వారికి ఈ పాస్‌వర్డ్స్‌ దొరికినట్లయితే మీ ఆన్‌లైన్ డేటా గల్లంతయినట్లే. కాబట్టి ముఖ్యమైన ఆన్‌లైన్ సర్వీసులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను బ్రౌజర్‌లలో సేవ్ చేయకండి.

ఆండ్రాయిడ్ బిల్ట్‌ఇన్ సెక్యూరిటీని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి..

ఆండ్రాయిడ్ బిల్ట్‌ఇన్ సెక్యూరిటీని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి..

గూగుల్ తన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను ఇన్‌బిల్ట్‌గా ఇస్తోంది. వీటిలో ఒకటైన స్ర్కీన్ లాక్ ఫీచర్ ఫోన్ ప్రొటెక్షన్ స్థాయిని మరో లెవల్‌కు తీసుకువెళుతుంది. పాస్‌వర్డ్, పిన్, ప్యాట్రన్, ఫింగర్ ప్రింట్, ఫేస్‌ అన్‌లాక్ ఇలా రకరకాల ఆప్షన్స్‌లో ఈ స్ర్కీన్ లాక్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టిలో వీటిలో ఏదో ఒక సెక్యూరిటీ లాక్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఫోన్‌ను ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫోన్‌కు లాక్ ఏర్పాటు చేయని పక్షంలో ఎవరు పడితే వాళ్లు మీ ఫోన్‌ను యాక్సెస్ చేసుకునే ప్రమాదముంది.

థర్డ్ పార్టీ యాప్స్‌కు పూర్తిగా దూరంగా ఉండండి...

థర్డ్ పార్టీ యాప్స్‌కు పూర్తిగా దూరంగా ఉండండి...

మీ ఫోన్‌కు అవసరమైన యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే తీసుకోండి. థర్డ్ పార్టీ యాప్స్ జోలికి వెళ్లకండి. వీటి ద్వారానే మాల్వేర్స్ అనేవి ఫోన్‌లలోకి చొరబడే అవకాశం ఉంది. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేముందు వెరిఫికేషన్ అనేది చాలా అవసరం.

 ఎన్‌క్రిప్ట్ చేసుకోవటం ద్వారా..

ఎన్‌క్రిప్ట్ చేసుకోవటం ద్వారా..

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవటం ద్వారా ఫోన్‌లోని డేటా భద్రంగా ఉంటుంది. ఫోన్ సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి Encrypt phone ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ ఫోన్ పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కాబడుతుంది. దీంతో ఫోన్‌లోని డేటాను ఎవరూ దొంగిలించలేరు.

పబ్లిక్ వై-ఫై కనెక్షన్స్ వద్ద జాగ్రత్త..

పబ్లిక్ వై-ఫై కనెక్షన్స్ వద్ద జాగ్రత్త..

పబ్లిక్ వై-ఫైలు వద్ద ఇంటర్నెట్‌ను ఉచితంగా యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్‌లు చాలానే ఉంటాయి. ఇలాంటి చోటే మీ ఫోన్‌ను మాల్వేర్లు చుట్టిముట్టే ప్రమాదముంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే ముందు ఆచితూచి స్పందించండి.

బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా..

బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా..

బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా పర్సనల్ లాగిన్ డిటెయిల్స్ రిమూవ్ కాబడతాయి. దీంతో హ్యాకర్లకు ఎటువంటి సమచారం దొరికేందుకు ఆస్కారం ఉండదు.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌లను తీసుకోవటం ద్వారా..

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌లను తీసుకోవటం ద్వారా..

ఫోన్ పనితీరును మెరుగుపరించేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీదారులతో పాటు అప్లికేషన్ డెవలపర్లు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌‌లను అందుబాటులోకి తీసుకువస్తుంటారు. వీటిని ఎప్పటికప్పుడు ఫాలో అవటం వల్ల ఫోన్ సెక్యూరిటీ రిస్క్‌ను దాదాపుగా తగ్గించుకోవచ్చు.

కనెక్టువిటీ యాప్స్‌ను అవసరం మేరకే ఉపయోగించుకోండి..

కనెక్టువిటీ యాప్స్‌ను అవసరం మేరకే ఉపయోగించుకోండి..

వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వైర్‌లెస్ కనెక్షన్‌లను ఎప్పుడు ఆన్‌ చేసి ఉంచటం వల్ల కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను అవసరం మేరకే ఉపయోగించుకోండి.

 

 

Best Mobiles in India

English summary
We are going to share an interesting article that will surely help you secure your Android smartphone from being hacked. Follow this simple trick to avoid hackers.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X